Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఆంధ్రప్రదేశ్

డిసెంబర్ 1 ,5 తేదీల్లో గుజరాత్ ఎన్నికలు…

డిసెంబర్ 1 ,5 తేదీల్లో గుజరాత్ ఎన్నికలు…
-ఎన్నికల షెడ్యూల్ విడుదల చేసిన కేంద్రం ఎన్నికల సంఘం
-మొత్తం 182 అసెంబ్లీ స్థానాలకు రెండు విడతలుగా ఎన్నికలు …
-89 స్థానాల్లో మొదట విడత,93 స్థానాల్లో రెండవ విడత ఎన్నికలు
-ఓట్ల లెక్కింపు డిసెంబర్ 8 న …ఫలితాలు డిసెంబర్ 10

గుజరాత్ ఎన్నికలకు కేంద్ర ఎన్నికల సంఘం పచ్చజెండా ఊపింది.ఫిబ్రవరి నెలతో గుజరాత్ అసెంబ్లీ కాలపరిమితి ముగుస్తుంది. దీంతో ఎన్నికలను ఈలోపు నిర్వించాలని కేంద్ర ఎన్నికల సంఘం నిర్ణయించింది.ఈ మేరకు ఢిల్లీలోని ఎన్నికల సంఘం ప్రధాన కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎన్నికల సంఘం ప్రధాన అధికారి రాజ్ కుమార్ వెల్లడించారు . ఎన్నికల లెక్కింపు డిసెంబర్ 8 ఉంటుందని వెల్లడించారు . గత ఎన్నికల్లో బీజేపీకి ,కాంగ్రెస్ కి జరిగిన హోరా హోరా ఎన్నికల్లో బీజేపీ నెగ్గింది. ఇప్పుడు ఆమ్ ఆద్మీ పార్టీ కూడా రంగంలో నిలవబోతుంది. దీంతో కాంగ్రెస్ కు నష్టం జరుగుతుందని తమకు గతంకంటే ఎక్కువ సీట్లు వస్తాయని బీజేపీ భావిస్తుంది.

తొలి విడత పోలింగ్ కోసం ఈ నెల 5న, రెండో విడత కోసం ఈ నెల 10న నోటిఫికేషన్ విడుదల చేయనున్నట్లు సీఈసీ రాజ్ కుమార్ వెల్లడించారు. అసెంబ్లీ ఎన్నికలు రెండు విడతల్లో.. డిసెంబర్ 1, 5 తేదీల్లో నిర్వహిస్తామని ప్రకటించారు. రాష్ట్రవ్యాప్తంగా 51 వేల పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు వివరించారు. ప్రస్తుతం గుజరాత్ లో 4.9 కోట్ల మంది ఓటర్లు ఉన్నారని, అందులో 4.61 లక్షల మంది కొత్తగా ఓటు హక్కు పొందారని మీడియా సమావేశంలో సీఈసీ రాజ్ కుమార్ చెప్పారు. అంతకుముందు, మోర్బీ వంతెన మృతులకు అధికారులు సంతాపం వ్యక్తంచేశారు. ఈసారి జరగనున్నఎన్నికల్లో ప్రతీ ఒక్కరూ ఓటేసేలా చర్యలు తీసుకుంటామని సీఈసీ తెలిపారు.

ఓట్ల లెక్కింపును డిసెంబర్ 8న చేపడతామని సీఈసీ రాజ్ కుమార్ చెప్పారు. ఈ నెల 12న ఎన్నికలు జరగనున్న హిమాచల్ ప్రదేశ్ లో కూడా వచ్చే నెలలోనే ఓట్ల లెక్కింపు జరుగుతుంది. డిసెంబర్ 10వ తేదీన ఎన్నికల ఫలితాలు ప్రకటిస్తామని ఎన్నికల కమిషన్ వెల్లడించింది.

Related posts

ఏపీ ప్రెస్ అకాడమీ చైర్మన్ గా బాధ్యతలు స్వీకరించిన కొమ్మినేని!

Drukpadam

ఏపీ మంత్రి ఉషశ్రీ చరణ్‌పై నాన్ బెయిలబుల్ వారెంట్!

Drukpadam

ఏజెంట్ చేతిలో మోసపోయి కెనడాలో బిక్కుబిక్కుమంటున్న 700 మంది భారత విద్యార్థులు

Drukpadam

Leave a Comment