Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
రాజకీయ వార్తలు

త్వరలో కేసీఆర్ అవినీతి బయట పెడతాం …మునుగోడు మాదే: తరుణ్ ఛుగ్!

త్వరలో కేసీఆర్ అవినీతి బయట పెడతాం …మునుగోడు మాదే: తరుణ్ ఛుగ్!
-టీఆర్ఎస్ ఎంత ప్రయత్నించినా.. గెలుపు బీజేపీదే
-మునుగోడు ఉప ఎన్నికలో టీఆర్ఎస్ అక్రమాలకు పాల్పడిందన్న తరుణ్ ఛుగ్
-మంత్రులు ఓటర్లకు డబ్బులు పంచారని ఆరోపణ
-ప్రధాని కావాలని కేసీఆర్ కలలు కంటున్నారని ఎద్దేవా

త్వరలోనే కేసీఆర్ అవినీతిని బయటపెడతామని బీజేపీ తెలంగాణ ఇంచార్జి తరుణ్ ఛుగ్ అన్నారు . బంగారు తెలంగాణ తెస్తామన్న కేసీఆర్ అప్పుల తెలంగాణ తెచ్చారని విమర్శించారు. తెలంగాణ కోసం ఉద్యమంలో పాల్గొన్న ఉఉద్యమకారుల్ని విస్మరించి ,టీఆర్ యస్ ను కుటుంబ పార్టీగా మార్చి తెలంగాణ పదం తొలగించి బీఆర్ యస్ గా చేసుకొని ప్రధాని కావాలనే కలలు కంటున్నారని దుయ్యబట్టారు . రాష్ట్రంలో నిరుద్యోగం ,పేదలకు మోయలేని భారాలు , అవినీతి తాండవిస్తుంది ఛుగ్ అన్నారు .ప్రజల నుంచి వ్యతిరేకత వస్తుందని గ్రహించిన కేసీఆర్ జాతీయరాజకీయాలు అని బీఆర్ యస్ పేరుతొ డ్రామాలు ఆడుతున్నారని విమర్శించారు .

టీఆర్ఎస్ ఎమ్మెల్యేలను కొనే ప్రయత్నాన్ని తాము చేయలేదని ఛుగ్ అన్నారు. ఈ కేసులో అరెస్టయిన ముగ్గురు నిందితులతో తమ పార్టీకి సంబంధం లేదని చెప్పారు. మునుగోడు ఉప ఎన్నికలో టీఆర్ఎస్ పార్టీ అక్రమాలకు పాల్పడిందని అన్నారు. టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు మునుగోడు ఓటర్లకు డబ్బులు పంచడమే కాకుండా అన్ని విధాలుగా ప్రలోభాలకు గురి చేశారని చెప్పారు. టీఆర్ఎస్ ఎంత చేసినా మునుగోడులో గెలిచేది బీజేపీనే అని ధీమా వ్యక్తం చేశారు. తెలంగాణలో అభివృద్ధి, పేదల సంక్షేమంపై బహిరంగ చర్చకు తాము సిద్ధమని చెప్పారు. దేశానికి ప్రధాని కావాలని ముఖ్యమంత్రి కేసీఆర్ కలలు కంటున్నారని ఎద్దేవా చేశారు. త్వరలోనే కేసీఆర్ అవినీతిని బయటపెడతామని చెప్పారు.

Related posts

ఉద్యోగులను సజ్జల బెదిరించారు: చంద్రబాబు ఆరోపణ

Drukpadam

జ‌గ‌న్‌ను శాశ్వ‌తంగా రాజ‌కీయాల నుంచి సాగనంపాలి: చంద్రబాబు…

Drukpadam

తెలంగాణ‌లో త్వ‌ర‌లోనే ప్ర‌భుత్వం మార‌బోతోంది: అమిత్ షా సంచలన వ్యాఖ్యలు!

Drukpadam

Leave a Comment