Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
రాజకీయ వార్తలు

కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికలు… రాహుల్ వద్దకే పోలింగ్ బూత్1

కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికలు… రాహుల్ వద్దకే పోలింగ్ బూత్!
ఏపీ, కర్ణాటక సరిహద్దులో ఓటేయనున్న రాహుల్ గాంధీ
రేపు ఉదయం 11 గంటలకు పోలింగ్ ప్రారంభం
సుగినేకళ్ క్యాంపులో ఓటేయనున్న రాహుల్ గాంధీ
యాత్రలో పాల్గొంటున్న ఏపీ నేతల కోసం కర్నూలులో ఏర్పాట్లు

చాల సంవత్సరాల తర్వాత కాంగ్రెస్ అధ్యక్షపదవికి ఎన్నికలు జరుగుతుండగా ఇద్దరు అభ్యర్థులు పోటీపడుతున్నారు.వారిలో ఒకరు రాజ్యసభలో కాంగ్రెస్ పక్ష నేత మల్లిఖార్జున ఖర్గే కాగా ,మరొకరు కాంగ్రెస్ లోకసభ సభ్యుడు శశిథరూర్ లు ఉన్నారు . మల్లిఖార్జున ఖర్గే ఎన్నిక దాదాపు ఖరారు అయినట్లేనని అభిప్రాయాలూ వ్యక్తం అవుతున్నాయి. భారత్ జోడో యాత్రలో ఉన్న రాహుల్ గాంధీ పోలింగ్ లో పాల్గొనేందుకు ఏపీ కర్ణాటక బోర్డర్ లోఉన్న ఒక గ్రామంలో పోలింగ్ బూత్ ను ఏర్పాటు చేశారు.

కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష ఎన్నికల్లో కీలక ఘట్టమైన పోలింగ్ రేపు (సోమవారం) జరగనుంది. దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో ఓటు హక్కు కలిగిన నేతలంతా ఆయా రాష్ట్రాల్లోనే ఓటు హక్కు వినియోగించుకునేలా పార్టీ అధిష్ఠానం ఇప్పటికే ఏర్పాట్లు పూర్తి చేసింది. పార్టీ అధ్యక్ష పదవికి పార్టీ సీనియర్ నేతలు మల్లికార్జున ఖర్గే, శశి థరూర్ లు పోటీ పడుతున్న సంగతి తెలిసిందే. రేపు ఉదయం 10 గంటలకు పోలింగ్ ప్రారంభం కానుంది.

ఇదిలా ఉంటే… కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష ఎన్నికల వేళ ఆ పార్టీ కీలక నేత రాహుల్ గాంధీ ప్రస్తుతం భారత్ జోడో యాత్రలో ఉన్న సంగతి తెలిసిందే. ఈ యాత్ర ఇటీవలే ఏపీలోకి ప్రవేశించింది. కర్ణాటక సరిహద్దులోని ఏపీలో ఈ యాత్ర కొనసాగుతోంది. ఈ క్రమంలో అధ్యక్ష ఎన్నికల్లో రాహుల్ గాంధీ ఏపీ, కర్ణాటక సరిహద్దు గ్రామం సుగినేకళ్ లో ఏర్పాటు చేసిన క్యాంపులో ఓటు హక్కు వినియోగించనున్నారు. రాహుల్ తో యాత్రలో సాగుతున్న ఇతర రాష్ట్రాల నేతలు కూడా ఇక్కడే ఓటు వేయనున్నారు. ఇక యాత్రలో పాలుపంచుకుంటున్న ఏపీ నేతలు తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు కర్నూలులో ప్రత్యేకంగా ఏర్పాట్లు చేశారు.

Related posts

కేంద్రం ధాన్యం కొనుగోలు చేయాలనీ ధర్నాలతో దద్దరిల్లిన తెలంగాణ!

Drukpadam

రాజ్య‌స‌భ‌కు ‘బాహుబ‌లి’ క‌థా ర‌చ‌యిత‌ విజయేంద్రప్రసాద్!

Drukpadam

షిండే సీఎం కావడంపై సంచలన వ్యాఖ్యలు చేసిన మహారాష్ట్ర బీజేపీ చీఫ్!

Drukpadam

Leave a Comment