Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
రాజకీయ వార్తలు

టీ టీడీపీ అధ్యక్షుడిగా కాసాని జ్ఞానేశ్వర్ నియామకం!

టీ టీడీపీ అధ్యక్షుడిగా కాసాని జ్ఞానేశ్వర్ నియామకం!

  • గతంలో టీడీపీలోనే కొనసాగిన కాసాని
  • రంగారెడ్డి జిల్లా పరిషత్ చైర్మన్ గా కొనసాగిన వైనం
  • చాలా కాలం పాటు పార్టీకి దూరంగా ఉండి ఇటీవలే తిరిగి చేరిన వైనం
  • బక్కని నర్సింహులుకు పొలిట్ బ్యూైరోలో స్థానం కల్పించిన చంద్రబాబు
  • ఈ నెల 10 టీ టీడీపీ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టనున్న కాసాని

తెలుగు దేశం పార్టీ తెలంగాణ శాఖ అధ్యక్షుడిగా సీనియర్ నేత కాసాని జ్ఞానేశ్వర్ నియమితులయ్యారు. ఈ మేరకు టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు శుక్రవారం కీలక ప్రకటన చేశారు. ప్రస్తుతం టీ టీడీపీ అధ్యక్షుడిగా కొనసాగుతున్న బక్కని నర్సింహులును టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా నియమించిన చంద్రబాబు…ఆయనకు పార్టీ అత్యున్నత నిర్ణాయక విభాగం పొలిట్ బ్యూరోలో స్థానం కల్పించారు.

తెలుగు నేల ఉమ్మడి రాష్ట్రంగా ఉన్న సమయంలో టీడీపీలోనే కొనసాగిన కాసాని… రంగారెడ్డి జిల్లా పరిషత్ చైర్మన్ గా కొనసాగారు. ముదిరాజ్ సామాజిక వర్గానికి చెందిన కాసానికి ఆ వర్గంతో పాటు తెలంగాణలో మంచి పట్టు ఉంది. చాలా కాలం పాటు పార్టీకి దూరంగా ఉన్న కాసాని ఇటీవలే చంద్రబాబు సమక్షంలో టీడీపీలో చేరారు. టీడీపీ గూటికి చేరిన వెంటనే ఆయనకు పార్టీ రాష్ట్ర పగ్గాలు దక్కడం గమనార్హం. ఈ నెల 10న కాసాని టీ టీడీపీ అధ్యక్షుడిగా పదవీ బాధ్యతలు చేపట్టనున్నారు.

Related posts

అందుకే తెలంగాణ ప్రజలు రాష్ట్ర విభజన కోరుకున్నారు: ధర్మాన ప్రసాదరావు

Drukpadam

కేరళ మాజీ మంత్రి శైలజకు పెరుగుతున్న మద్దతు..

Drukpadam

టీమిండియా చీఫ్ కోచ్ పదవికి గుడ్ బై చెప్పిన రవిశాస్త్రి..

Drukpadam

Leave a Comment