Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
రాజకీయ వార్తలు

రాహుల్ జోడో యాత్రతో కాంగ్రెస్ నేతల చిందులు…

రాహుల్ గాంధీ ప్రసంగం ముగియగానే.. వేదికపైనే స్టెప్పులేసిన వీహెచ్, దామోదర రాజనర్సింహ!

  • తెలంగాణలో కొనసాగుతున్న రాహుల్ జోడో యాత్ర
  • గురువారం అందోల్ లో సభ నిర్వహించిన కాంగ్రెస్ నేత
  • రాహుల్ ప్రసంగానికి జనం నుంచి ఊహించని స్పందన
  • జనం స్పందన చూసి మైమరచి స్టెప్పులేసిన వీహెచ్, దామోదర రాజనర్సింహ

రాహుల్ జోడో యాత్రతో కాంగ్రెస్ శ్రేణులు ఉత్సాహంతో ఉప్పొంగి పోతున్నాయి. యాత్రకు ప్రజలనుంచి మంచి మద్దతు లభిస్తుంది. దీంతో పార్టీ గ్రాఫ్ పెరిగిపోతుంది. రాహుల్ గాంధీ పార్టీ శ్రేణులను పరిగెత్తిస్తున్నారు.ఎక్కడకు వెళ్లిన అపూర్వ స్వాగతం లభిస్తుంది. నేడు మెదక్ జిల్లాలోని అందోల్ లో పర్యటించారు. అక్కడ రాహుల్ ప్రసంగం ప్రజలను ఆలోచింప జేసింది . సీనియర్ నేతలు చిందులు వేశారు .

భారత్ జోడో యాత్ర పేరిట కాంగ్రెస్ పార్టీ అగ్ర నేత రాహుల్ గాంధీ చేపట్టిన పాదయాత్రలో ఆ పార్టీ శ్రేణుల్లో సరికొత్త ఉత్సాహం కనిపిస్తోంది. పాదయాత్రకు జనం నుంచి ఊహించిన దాని కంటే అధికంగా స్పందన లభిస్తున్న నేపథ్యంలో పార్టీ శ్రేణులు హర్షం వ్యక్తం చేస్తున్నాయి. ప్రస్తుతం రాహుల్ గాంధీ యాత్ర తెలంగాణలోని సంగారెడ్డి జిల్లా పరిధిలో కొనసాగుతోంది. గురువారం రాత్రి పాదయాత్రను ముగించే సందర్భంగా జిల్లా పరిధిలోని అందోల్ లో భారీ బహిరంగ సభను జరిగింది.

అందోల్ సభకు హాజరైన జనాన్ని ఉద్దేశించి రాహుల్ గాంధీ ప్రసంగించారు. రాహుల్ ప్రసంగానికి జనం నుంచి మంచి స్పందన లభించింది. ఈ స్పందనను చూసిన కాంగ్రెస్ పార్టీ తెలంగాణ నేతలు సంబరాల్లో మునిగిపోయారు. ఈ క్రమంలో రాహుల్ ప్రసంగం ముగిసినంతనే సంతోషం పట్టలేక మాజీ డిప్యూటీ సీఎం దామోదర రాజనర్సింహ తన పక్కనే ఉన్న నేతలతో కలిసి చిందులేయడం మొదలెట్టారు. దామోదరను స్టెప్పులను చూసిన సీనియర్ నేత వి.హన్మంతరావు తన వృద్ధాప్యాన్ని సైతం లెక్క చేయకుండా డ్యాన్స్ చేశారు. ఇద్దరు కీలక నేతలు స్టేజీ మీదే మైమరచి స్టెప్పులేస్తున్న వైనం చూసి పార్టీ శ్రేణులు కేరింతలు కొట్టారు.

Related posts

మునుగోడు స్టార్ క్యాంపైనర్స్ లోలేని జగ్గారెడ్డి పేరు …

Drukpadam

విశాఖ స్టీల్ ప్లాంట్ కేంద్ర ప్రభుత్వ అధీనంలోనే ఉండాలి: పవన్ కల్యాణ్

Drukpadam

సాయి గణేష్ ప్రాణం తీసిన పాపం బిజెపి నాయకులదే.. టీఆర్ యస్ ఆరోపణ!

Drukpadam

Leave a Comment