Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
రాజకీయ వార్తలు

ముఖ్యమంత్రి అంటే జగన్ లా ఉండాలి: ఎంపీ కోమటిరెడ్డి ప్రశంస

ముఖ్యమంత్రి అంటే జగన్ లా ఉండాలి: ఎంపీ కోమటిరెడ్డి ప్రశంస
వెయ్యి దాటే అన్ని వైద్యాలను ఆరోగ్యశ్రీ కిందకు జగన్ తెచ్చారు
కరోనా చికిత్సను కూడా ఆరోగ్యశ్రీ పరిధిలోకి తీసుకొచ్చారు
ఆ పని తెలంగాణ ప్రభుత్వం ఎందుకు చేయడం లేదు?
ఒక పక్క ఆంధ్రప్రదేశ్ లో తన స్వంత పార్టీ కాంగ్రెస్ జగన్ ప్రభుత్వంపై దుమ్మెత్తి పోస్తుంటే తెలంగాణకు చెందిన కాంగ్రెస్ ముఖ్యనేత టీపీసీసీ రేసులో ఉన్న కోమటి రెడ్డి వెంకటరెడ్డి ఏపీ సీఎం జగన్ పై ప్రశంసలు కురుపించడము చర్చనీయంగా మారింది. ఏపీపీసీసీ చీఫ్ సాకే శైలజానాథ్ ముఖ్యమంత్రి చర్యలపై తీవ్ర విమర్శలు గుప్పిస్తున్న తరుణంలో కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాటలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. అయితే ఇది కావాలని అనలేదని నకిరేకల్ లో ఎన్నికల ప్రచారం సందర్భంగా ప్రస్తావన వచ్చినప్పుడు ఆరోగ్యశ్రీ పై చేసిన వ్యాఖ్యలుగా కాంగ్రెస్ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.
ఏపీ ముఖ్యమంత్రి జగన్ పై తెలంగాణ కాంగ్రెస్ నేత, లోక్ సభ సభ్యుడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి ప్రశంసలు కురిపించారు. ముఖ్యమంత్రి అంటే జగన్ మాదిరి ఉండాలని ఆయన అన్నారు. వెయ్యి రూపాయలు దాటే అన్ని వైద్యాలను ఆరోగ్యశ్రీలో జగన్ చేర్చారని… కరోనా చికిత్సను కూడా ఆరోగ్యశ్రీ కిందకు తీసుకొచ్చారని కొనియాడారు. తెలంగాణాలో కూడా జగన్ లాగా వైద్యసేవలను ప్రజలకు అందుబాటులోకి తేవాలని ఆయన అభిప్రాయం . ఏపీ లో 1000 రూపాయలు దాటిన అన్ని రకాల వైద్య సేవలను ఆరోగ్యశ్రీ లోకి తెచ్చిన సంగతి తెలిసిందే .

తెలంగాణలో కరోనా బారిన పడిన ఎందరో పేషెంట్లు ప్రైవేటు ఆసుపత్రుకు లక్షలు చెల్లిస్తున్నారని… కరోనాను ఆరోగ్యశ్రీ కిందకు తెలంగాణ ప్రభుత్వ ఎందుకు తీసుకురాలేదని కోమటిరెడ్డి ప్రశ్నించారు. నకిరేకల్ మున్సిపాలిటీలో ప్రచారం నిర్వహిస్తూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. మాటల మధ్యలో జగన్ ప్రస్తావనను తీసుకొచ్చి, ఆయనపై ప్రశంసలు కురిపించడం తెలంగాణ రాజకీయాల్లో ఆసక్తిని రేకెత్తించింది.

Related posts

అసెంబ్లీ నుంచి వైసీపీ రెబల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి సస్పెన్షన్..

Drukpadam

ఏపీ అప్పుల ఆంధ్రప్రదేశ్ అయ్యిందన్న జీవీఎల్!

Drukpadam

జనసేన బాటలో టీడీపీ …బద్వేల్ ఎన్నిక ఏకగ్రీవమేనా …?

Drukpadam

Leave a Comment