Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
రాజకీయ వార్తలు

రోహిత్ రెడ్డి సహా నలుగురు ఎమ్మెల్యేలకు బుల్లెట్ ప్రూఫ్ వాహనాలతో భద్రత!

రోహిత్ రెడ్డి సహా నలుగురు ఎమ్మెల్యేలకు బుల్లెట్ ప్రూఫ్ వాహనాలతో భద్రత! పెంచిన తెలంగాణ ప్రభుత్వం

  • రూ.400 కోట్లతో ఎమ్మెల్యేలను కొనుగోలు చేసే ప్రయత్నం
  • నలుగురు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు ఎర
  • ఎమ్మెల్యేల భద్రతపై ఆందోళనలు
  • ఎస్కార్ట్ సౌకర్యం కల్పించిన తెలంగాణ ప్రభుత్వం

టీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు రూ.400 కోట్లతో ఎర వేసిన వ్యవహారం తీవ్ర దుమారం రేపడం తెలిసిందే. అయితే, టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పైలెట్ రోహిత్ రెడ్డి, గువ్వల బాలరాజు, బీరం హర్షవర్ధన్ రెడ్డి, రేగా కాంతారావు ఆ ఆఫర్ ను బట్టబయలు చేశారు. ఈ నేపథ్యంలో నలుగురు ఎమ్మెల్యేల భద్రతపై ఆందోళన నెలకొనడంతో తెలంగాణ ప్రభుత్వం స్పందించింది.

కొన్నిరోజుల కిందటే ఎమ్మెల్యే రోహిత్ రెడ్డికి బుల్లెట్ ప్రూఫ్ వాహనం సమకూర్చిన సర్కారు, తాజాగా మిగిలిన ముగ్గురు ఎమ్మెల్యేలకు కూడా భద్రతను పెంచింది. గువ్వల బాలరాజు, రేగా కాంతారావు, హర్షవర్ధన్ రెడ్డిలకు కూడా బుల్లెట్ ప్రూఫ్ వాహనాలు కేటాయించింది. దాంతో పాటు ఎస్కార్ట్ సౌకర్యం కూడా కల్పించింది. వారి నివాసాల వద్ద కూడా భద్రతను పెంచింది.

ఆ నలుగురు ఎమ్మెల్యేలకు బుల్లెట్ ప్రూఫ్ కారు కేటాయింపు

  • పైలట్ రోహిత్ రెడ్డి, రేగా కాంతారావు, గువ్వల బాలరాజు, హర్షవర్ధన్ రెడ్డిలకు అదనపు భద్రత
  •   4+4 గన్‌మెన్లను కేటాయిస్తూ రాష్ట్ర హోం శాఖ ఆదేశాలు జారీ
  • హైదరాబాద్ తో పాటు సొంత నియోజకవర్గాల్లోనూ భద్రత పెంపు
  • మంత్రుల స్థాయి భద్రతను పెంచిన రాష్ట్ర ప్రభుత్వం
trs mlas who are ijn mlas poaching case get additional protection

తెలంగాణ రాజకీయాల్లో పెను కలకలం రేపిన ఎమ్మెల్యేల కొనుగోలు యత్నం కేసులో కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. ఈ కేసులో బాధితులుగా ఉన్న టీఆర్ఎస్ కు చెందిన నలుగురు ఎమ్మెల్యేలు పైలట్ రోహిత్ రెడ్డి, రేగా కాంతారావు, గువ్వల బాలరాజు, హర్షవర్ధన్ రెడ్డిలకు రాష్ట్ర ప్రభుత్వం భద్రత పెంచుతూ శుక్రవారం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం నలుగురు ఎమ్మెల్యేలకు కొనసాగుతున్న భద్రతకు అదనపు భద్రతను ఏర్పాటు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.

నలుగురు ఎమ్మెల్యేలకు మంత్రుల స్థాయి భద్రత కల్పించేందుకు తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. ఈ నలుగురికీ 4 4 గన్‌మెన్లను ఇస్తూ రాష్ట్ర హోం శాఖ ఆదేశాలు జారీ చేసింది. అలాగే హైదరాబాద్‌లోని నివాసంతోపాటు, సొంత నియోజకవర్గంలోనూ భద్రత కల్పించనున్నారు. దీంతోపాటు బుల్లెట్ ప్రూఫ్ వాహనాలను కూడా ఏర్పాటు చేస్తారు.

Related posts

దటీస్ సిద్దు …ఢిల్లీలో ఆందోళన…

Drukpadam

కుప్పం మున్సిపల్ వార్ …వైసీపీకి ప్రజాబలం లేదని లోకేష్ విమర్శలు!

Drukpadam

అవినీతిపరుల కూటమికి కన్వీనర్ మీరేనా? అంటూ మోదీపై ఖర్గే తీవ్ర విమర్శలు

Drukpadam

Leave a Comment