మధ్యతరగతి ప్రజలకు అందుబాటులో సిపిఎం మెడికల్ క్యాంప్!
-వేలాది మందికి ఉచిత పరీక్షలు …తక్కువ ధరలకే మందులు
-హర్షం వ్యక్తం చేస్తున్న పేదలు
-ప్రభుత్వ ఆసుపత్రి లో అన్ని వైద్య సౌకర్యాలు అందించాలని డిమాండ్
మధ్య తరగతి ప్రజలకు అందుబాటులో ఉండేవిధంగా సిపిఎం ,బోడేపూడి విజ్ఞాన కేంద్రం ఆధ్వరంలో మెడికల్ క్యాంపులు నిర్వహిస్తున్నట్లు సిపిఎం జిల్లా కార్యదర్శి నున్నా నాగేశ్వరరావు పేర్కొన్నారు
సిపిఎం పార్టీ టూ టౌన్ కమిటీ, బోడేపూడి విజ్ఞాన కేంద్రం ఆధ్వర్యంలో శనివారం నిర్వహించిన మెడికల్ క్యాంపు జిల్లా వ్యాప్తంగా పేదలకు, మధ్యతరగతి ప్రజలకు ఉపయోగపడే విధంగా అందుబాటులో వుందని నున్నా నాగేశ్వరరావు తెలిపారు. ప్రతి నెలా మొదటి శనివారం నిర్వహిస్తున్న బిపి, షుగర్, కంటి,చెవి ముక్కు, గొంతు తదితర అనారోగ్య సమస్యలపై ఉచిత మెడికల్ క్యాంపు మంచికంటి హల్ లో జరిగింది. ఈ సందర్భంగా వందలాది మంది పేషెంట్ లకు డాక్టర్లు పరిక్షలు చేసి ఉచితంగా నెలకు సరిపడా మందులు అందజేశారు ఈ సందర్భంగా నున్నా నాగేశ్వరరావు మాట్లాడుతూ ప్రజలందరికీ ఆరోగ్యానికి ఉపయోగపడే విధంగా ప్రభుత్వ ఆసుపత్రిలో అన్నీ సౌకర్యాలు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు . పేదలు, మధ్య తరగతి ప్రజలు హాస్పిటల్లో ఫీజులు కట్టలేక ఆస్తులు అమ్ముకుంటున్నారు అని ఆందోళన వ్యక్తం చేశారు. వైద్యం, విద్యా రంగానికి ప్రభుత్వం తగిన నిధులు మంజూరు చేయడం లేదు అని విమర్శించారు. అనంతపురం పేషెంట్ లకు
షుగర్, బిపి చెక్ చేసి నెలకు సరిపడా మందులు డాక్టర్లు ఇచ్చారు. డాక్టర్ సి భారవి, డాక్టర్ రావిళ్ళ రంజిత్, డాక్టర్ కొల్లి ఆనుదీప్, డాక్టర్ పి సుబ్బారావు,
డాక్టర్ జెట్ల రంగారావు రోగాలను పరిక్షించారు. తిరిగి వచ్చే నెల మెదటి శనివారం డిసెంబర్ 3న మెడికల్ క్యాంపు వుంటుందని తెలిపారు ఈ కార్యక్రమంలో పార్టీ జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు వై విక్రమ్, వై శ్రీనివాసరావు, బోడపట్ల సుదర్శన్,శివనారయణ, పి ఝాన్సీ, అఫ్జల్, చి హెచ్ భద్రం , వాసిరెడ్డి వీరభద్రం , కె వెంకన్న నాగేశ్వరరావు, తదితరులు పాల్గొన్నారు