Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
కోవిడ్ వార్తలురాజకీయ వార్తలు

నరేంద్ర మోదీపై ప్రపంచ మీడియాలో విమర్శల వెల్లువ!

కరోనా విజృంభణకు కారణం మోదీ వైఫల్యమే … విరుచుకుపడిన అంతర్జాతీయ మీడియా
-ఎన్నికల కోసం నిబంధనలను గాలికి వదిలారు
-కరోనా వేళ 20 ఎన్నికల సభల్లో పాల్గొన్నారు.
-తన సన్నిహిత సహచరుడు అమిత్ షా 30 సభల్లో పాల్గొన్నారు.
-ఇద్దరు 24 పైగా రోడ్ షో లలో పాల్గొన్నారు
-మాస్క్ లు ధరించలేదు
-ఐదు రాష్ట్రాలను తమ పాలనలోకి తెచ్చుకోవాలనే లక్ష్యం తప్ప మరొకటి లేదు
-ఇతర దేశాలకు వ్యాక్సిన్ తరలి పోతున్నా దేశ అవసరాలకోసం కట్టడి చేయలేదు
-రెండో వేవ్ ప్రమాదకరమని తెలిసీ చర్యలు చేపట్టలేదు
-అన్నింటినీ తెరిచి కేసులను పెంచేశారు
-వెస్ట్రన్ దేశాల మీడియా కథనాలు

నిన్న మొన్నటి వరకు మోడీ ….మోడీ భారత్ ఆశాకిరణంగా భావించిన వెస్ట్రన్ మీడియా ఆయన వైఫల్యాలపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తింది … భారత్ లో విఫరీతంగా కరోనా విజృభిస్తున్న వేళ ఐదు రాష్ట్రాలలో ఎన్నికలు పెట్టి వాటిని తమ గుప్పెటలోకి తీసుకురావాలనే లక్ష్యం తో ఎన్నికల సభల్లోనూ , ర్యాలీలతో బిజీ అయ్యారు తప్ప కరోనా మహమ్మారిని ఎదుర్కొనేందుకు సరైన చర్యలు తీసుకోలేదని విమర్శలు గుప్పంచాయి. ఒక్క మీడియా కాదు అనేక మీడియా సంస్థలు మోడీ చర్యలను ఉతికి ఆరేశాయి. మోడీ చర్యలవలన భారత్ పెద్ద ఎత్తున మహమ్మారితో నష్టపోతుందని అభిప్రాయపడింది . ప్రపంచమంతా కరోనా మహమ్మరితో యుద్ధం చేస్తుంటే మోడీ మాత్రం ఎన్నికల యుద్ధం చేశారని ఎద్దేవా చేశాయి . ఫైనాన్సిల్ టైమ్స్ , గార్డియన్ , వాల్ స్ట్రీట్ జర్నల్ , వాషింగ్టన్ పోస్ట్ ఒకటేమిటి ఎలా అనేక పత్రికలూ కధనాలు రాశాయి. ఇండియన్ మీడియాను మోడీ ,షా ద్వయం మేనేజ్ చేసిందని కూడా విమర్శలు గుప్పించాయి. మోడీ అధికారంలోకి వచ్చిన తరువాత ఆయన పై ఇంత పెద్ద ఎత్తున విమర్శలు రావడం ఇదే మొదటి సారి కావడం విశేషం .

ఇండియాలో కరోనా కేసుల విజృంభణకు ప్రధాని నరేంద్ర మోదీ వైఫల్యమే కారణమని ప్రపంచ మీడియాలో విమర్శలతో కూడిన వార్తలు వస్తున్నాయి. కరోనా తొలి దశలో ఎన్నో దేశాలకు సాయం అందించి, ఔషధాలను, వ్యాక్సిన్లను పంపించిందని కొనియాడని పత్రికలు, ఇప్పుడు ప్రభుత్వ పెద్దల విధానాలతోనే ఇండియాలో కరోనా కేసులు అపరిమిత స్థాయికి పెరిగాయని కథనాలను ప్రచురిస్తున్నాయి. ఎన్నికల్లో విజయం సాధించడమే లక్ష్యంగా ఉన్న కేంద్రం, జాగ్రత్తలను గాలికి వదిలేసిందని, రెండో వేవ్ మరింత ప్రమాదకరంగా ఉంటుందని తెలిసినా సన్నద్ధంగా లేదని పేర్కొన్నాయి.

గత సెప్టెంబర్ లోనే కరోనా సెకండ్ వేవ్ పై హెచ్చరికలు జారీ చేసినా, కుంభమేళాలు, జాతరలతో పాటు ప్రార్థనా మందిరాలు, మాల్స్, సినిమా హాల్స్ తదితరాలను తెరిచారని, దీంతో ప్రజల మధ్య బౌతిక దూరం తగ్గిపోయి, మహమ్మారి ఉద్ధృతి సునామీని తలపిస్తోందని విదేశీ పత్రికలు అభిప్రాయపడ్డాయి. ప్రస్తుతం ప్రపంచంలో నమోదవుతున్న కేసుల్లో సగం కేసులు ఇండియా నుంచే వస్తున్నాయని, ఆసుపత్రుల్లో పడకలు దొరకడం లేదని, రోజులు నడిరోడ్డుపైనే మరణిస్తున్నారని, ఇది అత్యంత కలవరపరిచే అంశమని వ్యాఖ్యానించాయి.

ఇండియాలో పుట్టిన కొత్త కరోనా, సరిహద్దులు దాటి మిగతా ప్రపంచానికి కూడా ముప్పుగా మారే ప్రమాదం ఉందని, కరోనా తీవ్రత తెలిసి కూడా, రెండో దశ వ్యాప్తికి ఏడాది సమయాన్ని ఉంచుకుని నరేంద్ర మోదీ తీవ్ర నిర్లక్ష్యం చేశారని, రెండో వేవ్ ను అడ్డుకునేందుకు ఎందుకు చర్యలు చేపట్టలేదని ‘ఎకానమిస్ట్’ ప్రశ్నించింది. మొన్నమొన్నటి వరకూ ప్రపంచ దేశాల నేతల్లో తనకంటూ ఓ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్న మోదీ, ఇప్పుడు వెస్ట్రన్ దేశాల మీడియా దృష్టిలో అసమర్థ పాలకుడిగా నిలవడం గమనార్హం.

Related posts

బీజేపీ ,టీడీపీ ,జనసేన దోస్తీకి రంగం సిద్ధం !

Drukpadam

ఈ నెల 18న గులాబీ గూటికి మోత్కుపల్లి!

Drukpadam

పార్లమెంట్ లో కేసీఆర్ అవమానించిన బండి సంజయ్ పై స్పీకర్ ఏమి చర్యలు తీసుకుంటారు …!

Ram Narayana

Leave a Comment