Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఆంధ్రప్రదేశ్

మంత్రి గంగుల ఇంటిపై ఐటీ ,ఈడీ దాడులు హుటాహుటిన ఇండియా కు…

మంత్రి గంగుల ఇంటిపై ఐటీ ,ఈడీ దాడులు హుటాహుటిన ఇండియా కు…
-దుబాయ్ లో ఉన్న మంత్రి గంగుల
-ఫెమా నిబంధనల ఉల్లంఘన పై పలువురికి నోటీసులు
-రాష్ట్రంలో మరిన్ని సంస్థలపై దాడులు చేసే అవకాశం ఉందనే ప్రచారం
-సర్దుకుంటున్న సంస్థలు ,కంపెనీలు

రాష్ట్రంలో ఐటీ ,ఈడీ దాడుల కలకలం ….ఇది రాజకీయ కక్ష్య అంటున్న అధికార పార్టీ నేతలు …లేదు ఆదాయానికి మించిన ఆస్తులు ఉన్నాయనే సమాచారంతోనే చట్టప్రకారం కేంద్ర దర్యాప్తు సంస్థలు చర్యలు చేపట్టాయని అంటున్న కేంద్ర ప్రభుత్వ వర్గాలు …రెంటి మధ్య రేవడిలా కొందరి పై వేలాడుతున్న కత్తులు …నిన్నగాక మొన్న మునుగోడు ఉపఎన్నిక జరిగింది. ఆ ఎన్నికల్లో బీజేపీ ఓడిపోయింది. దీంతో రాష్ట్రంలో ఉన్న ప్రముఖ అధికార పార్టీ నేతలపై వత్తిడి పెంచాలనే ఉద్దేశంతో దాడులు జరుగుతున్నాయని టీఆర్ యస్ అంటుంది. దీంతో పారిశ్రామిక వేత్తలు హడలి పోతున్నారు . ఇలాంటి దాడుల వల్ల ఇబ్బందులు కలుగుతున్నాయని వాపోతున్నారు . కాంట్రాక్టర్లు , పారిశ్రామిక వేత్తలు ,గ్రానైట్ వ్యాపారాలు చివరకు కార్పొరేట్ ఆసుపత్రులు టార్గెట్ గా ఢిల్లీ నుంచి పెద్ద మొత్తంలో బుధవారం హైద్రాబాద్ లో దిగిన అధికారులు తాము ఎంచుకున్న ప్రాంతాలకు హుటాహుటిన బయలు దేరి వెళ్లారు . హైద్రాబాద్ , కరీంనగర్ , ఖమ్మం లాంటి ప్రాంతాల్లో ఏకకాలంలో దాడులు చేశారు . అనేక పాత్రలను స్వాధీనం చేసుకున్నారు . ఫెమా నిబంధనల ఉల్లగించినట్లు ఆధారాలు ఉన్నాయనే అందుకే దాడులు జరుగుతున్నాయని సమాచారం . వారు దాడులు చేస్తున్న సందర్భంగా ఎవరికీ లోనకు వెళ్లేందుకు ఎంట్రీ ఇవ్వలేదు . చివరకు ప్రెస్ ను కూడా దరిదాపుల్లోకి రానివ్వలేదు .

గ్రానైట్ ఎగుమతుల్లో అక్రమాల పేరిట ఆదాయపన్ను శాఖ (ఐటీ), ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ)లు తెలంగాణలోని పలు ప్రాంతాల్లో బుధవారం ఉదయం నుంచి సోదాలు చాల చోట్ల దాడులు జరుగుతున్నాయి. మొత్తం 30 బృందాలుగా వీడిపోయిన వారు ఆకస్మిక దాడులు చేశారు. ఆయాసంస్థలు , పరిశ్రమలు ఒక్కసారిగా షాక్ కు గురైయ్యాయి. ఇందులో భాగంగా గ్రానైట్ కంపెనీలను నిర్వహిస్తున్న తెలంగాణ మంత్రి గంగుల కమలాకర్ ఇల్లు, కార్యాలయాలపైనా అధికారులు సోదాలు చేస్తున్నారు. కరీంనగర్ లోని గంగుల ఇంటికి బుధవారం ఉదయం చేరుకున్న అధికారులు…ఇంటికి వేసి ఉన్న తాళాన్ని పగుల గొట్టి మరీ ఇంటిలోకి ప్రవేశించిన సంగతి తెలిసిందే.

గంగుల తన కుటుంబ సభ్యులతో కలిసి ప్రస్తుతం దుబాయిలో పర్యటిస్తున్నారు. ఐటీ, ఈడీ అధికారులు తన ఇంటిపై దాడి చేశారన్న వార్త తెలియగానే… ఆయన దుబాయి నుంచి తిరుగు ప్రయాణమయ్యారు. నేటి రాత్రికి ఆయన హైదరాబాద్ చేరుకుని నేరుగా కరీంనగర్ చేరుకుంటారు. కరీంనగర్ రాగానే ఐటీ, ఈడీ దాడులపై ఆయన దృష్టి సారించనున్నారు.

Related posts

ఏపీ నూతన ప్రధాన కార్యదర్శిగా కేఎస్ జవహర్‌రెడ్డి?

Drukpadam

నిద్రలేమితో దీర్ఘకాలంలో అనారోగ్య సమస్యలు: నిపుణుల హెచ్చరిక!

Drukpadam

రేపు ‘హుజూరాబాద్, బద్వేలు ఉప ఎన్నిక ఓట్ల లెక్కింపు… ఏర్పాట్లు పూర్తి…

Drukpadam

Leave a Comment