Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
రాజకీయ వార్తలు

ఖమ్మం అంటే కేసీఆర్ కు వివక్ష…కిషన్ రెడ్డి

ఖమ్మం అంటే కేసీఆర్ కు వివక్ష… ఒక్క సీటుకే పరిమితం చేశారని కోపం: కిషన్ రెడ్డి
తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల కోలాహలం
అధికార పక్షంపై కిషన్ రెడ్డి విమర్శలు
అధికార దుర్వినియోగంతో గెలవాలని చూస్తున్నారని ఆరోపణ
ఖమ్మం జిల్లాలో టీఆర్ఎస్ కు ప్రజాబలంలేదని వెల్లడి
ఫిరాయింపులతో సీట్ల బలం పెంచుకున్నారని వ్యాఖ్యలు
మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో కేంద్ర హోంశాఖ సహాయమంత్రి, బీజేపీ నేత కిషన్ రెడ్డి తెలంగా సర్కారుపై విమర్శనాస్త్రాలు సంధించారు. బెదిరింపులు, అధికార దుర్వినియోగంతో టీఆర్ఎస్ గెలవాలని చూస్తోందని ఆరోపించారు. ఖమ్మం జిల్లాలో ఫిరాయింపులతో కేసీఆర్ సీట్ల బలం పెంచుకుంది తప్ప ప్రజాబలం కాదని స్పష్టం చేశారు. ఖమ్మం అంటే కేసీఆర్ కు వివక్ష అని, ఒక్క సీటుకే పరిమితం చేశారని కోపమని కిషన్ రెడ్డి వ్యాఖ్యానించారు. కేసీఆర్ పాలన కాంట్రాక్టర్లు, లిక్కర్, ఇసుక మాఫియాలకు అడ్డాగా మారిందని కిషన్ రెడ్డి విమర్శించారు. రాష్ట్రంలో డబుల్ బెడ్రూం ఇళ్ల నిర్మాణం జరుగుతున్న తీరు చూస్తే నత్త కూడా సిగ్గుపడుతుందని అన్నారు. కేసీఆర్ కు పాలన పైన జ్యాస కన్నా ఫిరాయింపులపై ఉందని విమర్శించారు. ఖమ్మం లో అభివృద్ధి ఇప్పుడే జరిగిందా గతంలో జరగలేదా ? అని ప్రశ్నించారు. డబల్ బెడ్ రూమ్ ఇళ్ళు అన్ని కట్టిస్తామని ఎన్ని కట్టించారో ఖమ్మం ప్రజలకు తెలియంది కాదన్నారు. మాటలు చెప్పడం తప్పించుకోవడం కేసీఆర్ అలవాటే నాని అన్నారు. ఖమ్మం జిల్లాలో గత ఎన్నికల్లోనే ప్రజలు కేసీఆర్ కు బుద్ది చెప్పారని ఇక్కడ గెలిచినా సీట్లు ఎన్ని ఫిరాయింపుల ద్వారా వచ్చింది ఎన్ని అని నిలదీశారు. రాష్ట్రలో అనేక సమస్యలకు పరిష్కరాలే లేవని అంతా అరచేతిలో వైకుంఠం చూపిస్తున్నారని ధ్వజమెత్తారు. బంగారు తెలంగాణ అన్న కేసీఆర్ మాటలు నమ్మిన నిరుద్యోగులు , ఉద్యోగాలు లేక రోడ్లు ఎక్కుతున్నారని నిరుద్యోగ భృతి అన్న మాట నీటి మూటగా మారిందని అన్నారు. కేంద్రం నిధులు ఇస్తుంటే వాటికీ తమ పథకాలుగా చెప్పుకొని ప్రచారం చేసుకోవడమా పై ఆయన అభ్యంతరం వ్యక్తం చేశారు.
ఖమ్మం కార్పొరేషన్ ఎన్నికల్లో టిఆర్ఎస్ అన్ని రకాల అడ్డదారులు తొక్కుతుందని మండిపడ్డారు.ప్రజలు అన్ని పార్టీలను చూశారని ఎవరు అభివృద్ధి చేయలేదని ఎద్దేవాచేశారు.టిఆర్ ఎస్ పార్టీ బరి తెగించి ఫిరాయింపులకు
గురి చేసిందని అన్నారు. జిల్లాలో కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన నిధులుతోనే ఖమ్మం నుండి వరంగల్, ఖమ్మం నుండి విజయవాడ వరకు రోడ్లు అభివృద్ధి చెందయని ఇంకా కొన్ని వేల కోట్ల రూపాయలతో జాతీయ రహదారులను ప్రారంభిస్తున్నట్లు తెలిపారు. రానున్న రోజుల్లో ఖమ్మం నగరాన్ని అన్ని హంగులతో తీర్చిదిద్దుతామని అన్నారు. జిల్లాలో పేదలకు రెండు లక్షలు ఇల్లు కడతామని చెప్పి ఏడు సంవత్సరాలు గడుస్తున్నా నత్తనడకన సాగుతున్నాయని ఆగ్రహం వ్యక్తంచేశారు.జిల్లాలోని భక్త రామదాసు,సీతారామ ప్రాజెక్టు కూడా పక్కన పెట్టారని అన్నారు.తెలంగాణ రాష్ట్రం వచ్చిన తరువాత సచివాలయానికి ఆరు సంవత్సరాలు రాని ఏకైక ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు.టిఆర్ ఎస్ కు ప్రత్యామ్నాయం బీజేపీ అని ప్రజలు కోరుకుంటున్నారు అని తెలిపారు. ఈ రాయల్ ఈ ర్యాలీలో రాష్ట్ర బిజెపి నాయకులు మాజీ ఎమ్మెల్సీ సుధాకర్ రెడ్డి చింతల రామచంద్రారెడ్డి కొండపల్లి శ్రీధర్ రెడ్డి బిజెపి జిల్లా నాయకులు వాసు దేవరావు బిజెపి డివిజన్ నాయకులు భద్రం, సైదులు తదితరులు పాల్గొన్నారు

Related posts

పార్లమెంట్ సమావేశాలు వాష్ అవుట్ కావడంపై వెంకయ్యనాయుడు కంట కన్నీరు!

Drukpadam

నెపం నాదికాదు…కేసీఆర్, కేటీఆర్ లది …మంత్రి మల్లారెడ్డి!

Drukpadam

2.8 లక్షల ఓట్ల భారీ మెజారిటీతో గెలిచిన అఖిలేశ్ యాదవ్ అర్ధాంగి డింపుల్!

Drukpadam

Leave a Comment