Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
క్రైమ్ వార్తలు

చీటింగ్ కేసులో యాంకర్ శ్యామల భర్త అరెస్ట్!

చీటింగ్ కేసులో యాంకర్ శ్యామల భర్త అరెస్ట్!
కోటి రూపాయలు తీసుకుని మోసం చేశాడంటూ ఒక మహిళ ఫిర్యాదు
లైంగిక వేధింపులకు కూడా గురి చేశాడని వెల్లడి
అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించిన రాయదుర్గం పోలీసులు
ప్రముఖ తెలుగు బుల్లితెర యాంకర్ శ్యామల భర్త నర్సింహారెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఆయనను అదుపులోకి తీసుకున్న హైదరాబాద్ రాయదుర్గం పోలీసులు రిమాండ్ కు తరలించారు. వివరాల్లోకి వెళ్తే… రాయదుర్గం పోలీస్ స్టేషన్ లో నర్సింహారెడ్డిపై చీటింగ్ కేసు నమోదైంది. తన వద్ద నుంచి కోటి రూపాయలు తీసుకుని, తిరిగి ఇవ్వకుండా మోసం చేస్తున్నాడని అతనిపై ఓ మహిళ ఫిర్యాదు చేసింది.

2017లో తన వద్ద కోటి రూపాయలు తీసుకున్నాడని… డబ్బులు అడిగితే బెదిరింపులకు పాల్పడుతున్నాడని… లైంగిక వేధింపులకు కూడా గురి చేశాడని తన ఫిర్యాదులో ఆమె పేర్కొంది. ఈ వ్యవహారంలో సెటిల్మెంట్ చేసుకోవాలని మరో మహిళ కూడా రాయబారం నడిపిందని ఆమె తెలిపింది. ఆమె ఫిర్యాదు మేరకు నర్సింహారెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు.

Related posts

వైసీపీ శ్రేణులకు చెప్పిన విధంగానే అసత్య ప్రచారాలపై ఫిర్యాదు చేశాను: అనంత శ్రీరామ్

Ram Narayana

పుణ్యక్షేత్రాలు తిరిగొచ్చిన పేపర్ లీక్ జంట.. పట్టుబడకుండా ఉండాలని మొక్కులు…

Drukpadam

నేను ఏం నేరం చేశాను?… ఎన్ఐఏ సోదాల‌పై మావోయిస్టు ఆర్కే భార్య ఆవేద‌న!

Drukpadam

Leave a Comment