Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
రాజకీయ వార్తలు

విశాఖకు ప్రధాని మోడీ… గ్రాండ్ వెల్ కం ….

విశాఖకు ప్రధాని మోడీ… గ్రాండ్ వెల్ కం ….
వర్షం వల్ల ఆలస్యంగా విశాఖ చేరుకున్న ప్రధాని మోదీ…
ప్రధానికి స్వాగతం పలికిన గవర్నర్ హరిచందన్, సీఎం జగన్
ఐఎన్ఎస్ డేగా వద్దకు చేరుకున్న ప్రధాని
రేపు పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన
అట్టహాసంగా బీజేపీ రోడ్ షో
రేపు విశాఖలో మోదీ బహిరంగ సభ
హాజరుకానున్న గవర్నర్, సీఎం జగన్
వేదికపై 8 మందికి అవకాశం

తమిళనాడు పర్యటన ముగించుకుని ఏపీ పర్యటనకు వచ్చిన ప్రధాని నరేంద్ర మోదీకి గ్రాండ్ వెల్ కం జరిగింది. ఆయన ప్రయాణిస్తున్న విమానం వర్షం వల్ల మధురై నుంచి విశాఖకు ఆలస్యంగా చేరుకుంది. ఎయిర్ పోర్టు నుంచి ప్రధాని మోదీ ఐఎన్ఎస్ డేగాకు పయనమయ్యారు. తూర్పుతీర నౌకాదళ స్థావరంలో ప్రధాని మోదీకి ఏపీ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్, సీఎం జగన్ స్వాగతం పలికారు.

అనంతరం ప్రధాని మోదీ బీజేపీ ఏర్పాటు చేసిన భారీ రోడ్ షోకు పయనమయ్యారు. అటు, జనసేనాని పవన్ కల్యాణ్ హోటల్ నోవోటెల్ నుంచి ప్రధాని మోదీతో సమావేశం కోసం చోళ సూట్ కు బయల్దేరారు.

రేపు విశాఖపట్నంలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసేందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేడు తూర్పుతీర నగరానికి చేరుకోనున్నారు. మోడీ పర్యటన సందర్భంగా విశాఖ నగరంలో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాటు చేశారు .ఇందుకోసం ఎస్ జి పి భద్రతా దళాలు విశాఖకు చేరుకొని ప్రధాని పర్యటించే ప్రాంతాలను అణువునా పరిశీలించాయి.

కాగా, విశాఖలోని మారుతి జంక్షన్ లో ప్రధాని మోదీ ఒకటిన్నర కిలోమీటర్ల రోడ్ షోలో పాల్గొన్నారు . ఈ రోడ్ లో బీజేపీ శ్రేణులు భారీగా పాల్గొన్నాయి .

విశాఖలో రేపు ప్రధాని నరేంద్ర మోదీ పాల్గొనే బహిరంగ సభలో ఎనిమిది మందికే అనుమతించారు. ప్రధానితో పాటు వేదికపై గవర్నర్ హరిచందన్, సీఎం జగన్, కేంద్రమంత్రి అశ్విని వైష్ణవ్, విశాఖ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ, బీజేపీ రాజ్యసభ సభ్యులు జీవీఎల్ నరసింహారావు, సీఎం రమేశ్, బీజేపీ ఎమ్మెల్సీలు వాకాటి నారాయణరెడ్డి, పీవీఎన్ మాధవ్ మాత్రమే ఉంటారు.

ఈ సభలో ప్రధాని మోదీ 40 నిమిషాల పాటు, ఏపీ సీఎం జగన్ 7 నిమిషాల పాటు ప్రసంగిస్తారు. ఈ బహిరంగ సభకు కేంద్రమంత్రి అశ్విని వైష్ణవ్ అధ్యక్షత వహిస్తారు.

Related posts

బ్రిటన్ నూతన ప్రధానిగా లిజ్ ట్రస్… రిషి సునాక్ కు నిరాశ!

Drukpadam

పంజాబ్ మాజీ సీఎం అమరిందర్ సింగ్ ప్రయాణమెటు …?

Drukpadam

40 పర్సెంట్ కమీషన్ల ప్రభుత్వాన్ని 40 సీట్లకే పరిమితం చేయండి: రాహుల్ గాంధీ…

Drukpadam

Leave a Comment