Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
రాజకీయ వార్తలు

టీఆర్ యస్ తో ఎన్నికల పొత్తు మునుగోడుతో ముగిసింది …సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని…

టీఆర్ యస్ తో ఎన్నికల పొత్తు మునుగోడుతో ముగిసింది …సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని…
-బీజేపీని మునుగోడులో ఓడించాలనే మా లక్ష్యం నెరవేరింది
-టీఆర్ యస్ తో పొత్తు కొనసాగుతుందో లేదో చెప్పలేము
-వారు మాతో పొత్తును కోరుకుంటున్నారు…
-మారింది టీఆర్ యస్ మేము కాదు …
-సింగరేణి ఎన్నికల్లో టీఆర్ యస్ తో పొత్తు లేదు
-ప్రజాసమస్యలపై రాజీలేని పోరాటం చేస్తాం

టీఆర్ యస్ తో ఎన్నికల పొత్తు మునుగోడు ఎన్నికలతో ముగిసిందని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు స్పష్టం చేశారు . మునుగోడులో బీజేపీని ఓడించాలనే మా లక్ష్యం నెరవేరిందని ,భవిష్యత్ లో టీఆర్ యస్ తో పొత్తు ఉంటుందో లేదో ఇప్పుడే చెప్పలేమని అన్నారు . ఆదివారం సిపిఐ ఖమ్మం జిల్లా కార్యాలయం గిరిప్రసాద్ భవనంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన విలేకర్లు అడిగిన పలు ప్రశ్నలకు సమాధానం చెప్పారు . టీఆర్ యస్ తో వచ్చే ఎన్నికల్లో పొత్తు కొనసాగుతుందని మీకు కొత్తగూడెం ,సీపీఎంకు పాలేరు సీట్లు ఇస్తామని ఎన్నికల ఖర్చులకు డబ్బులు కూడా ఇస్తామని టీఆర్ యస్ ఆఫర్ చేసిందని జరుగుతున్న ప్రచారంపై విలేకర్లు ప్రశ్నించగా అవన్నీ పచ్చి అబద్ధాలని ఆయన కొట్టి పారేశారు .ఇలాంటి పుకార్లు చేసేవారిపట్ల అప్రమత్తంగా ఉండాలన్నారు . తమది సిద్ధాతంపరమైన పార్టీ మాకు ఒక లక్ష్యం ఉంటుంది, ప్రజల సమస్యల పరిస్కారం కోసం ఏ ప్రభుత్వాన్ని అయినా ఎదిరిస్తాం …అందుకు ఎన్ని కష్టాలైనా ఎదుర్కొంటామన్నారు . నిన్ననే ప్రధాని తెలంగాణాలో పర్యటించారు. ఆసందర్భంగా సిపిఐకి చెందిన 7 వేల మంది కార్యకర్తలను అరెస్ట్ చేశారు . అందులో నేను కూడా ఉన్నానని తెలిపారు . టీఆర్ యస్ మాటలు చెప్పింది కానీ ప్రధాని పర్యటనకు నిరసన తెలిపే కార్యక్రమంలో అడ్రస్ లేకపోవడం విచారకరమన్నారు . ప్రధానిగా మోడీ ఎక్కడికైనా పర్యటించే అధికారం ఉంది…. కానీ ప్రభుత్వరంగ సంస్థలను ప్రవేట్ పరం చేస్తూ పర్యటన జరపడం పైన తమ అభ్యంతరమన్నారు . విభజన హామీలతో సహా అనేక సమస్యలను పరిష్కరించకుండా పర్యటనలకు రావడం అబద్దాలు చెప్పటం అలవాటుగా మారిందని అందువల్ల నైతికంగా ప్రధాని మోడీకి పర్యటించే అర్హతలేదని చెప్పామని అన్నారు . అందుకే తమ నిరసన తెలిపామన్నారు .పైగా రామగుండంలో రెండు సంవత్సరాల క్రితం ఉత్పత్తి ప్రారంభమైన ఎరువుల కర్మాగారాన్ని తిరిగి ప్రారంభించటం ఏమిటని ప్రశ్నించడం తప్పు ఎలా అవుతుందన్నారు .

సింగరేణిని ప్రవేటీకరణ లేదని చెబుతున్న ప్రధాని అనేక బొగ్గుగనులను ప్రవేటీకరణ చేస్తున్నారని ఆరోపించారు. ఆదిశగా వేగంగా అడుగులు వేస్తున్నారని పేర్కొన్నారు . సింగరేణిలో రాష్ట్ర వాటా 51 శాతం గా ఉందని అందువల్ల కేంద్రం ఎలా ప్రవేట్ పరం చేస్తుందని చెప్పటాన్ని కూడా సాంబశివరావు తప్పుపట్టారు . ఇల్లందు సమీపంలోని కోయగూడెం , సత్తుపల్లి , మందమర్రిలోని కేకే ఖని ప్రవేట్ పరం చేసింది నిజంకాదా? సాంబశివరావు ప్రశ్నించారు . ప్రధానిస్తాయిలో ఉన్న వ్యక్తి ఉందాగా వ్యవహరించాల్సింది పోయి దిగజారుడు రాజకీయాలకు, చిల్లర రాజకీయాలకు పాల్పడటం , అబద్దాలు ఆడటం సిగ్గుచేటని విమర్శలు గుప్పించారు .

మోడీ హయాంలో ప్రవేటీకరణ దిశగా దేశాన్ని తీసుకోపోతున్నారని ఇది తీవ్ర అభ్యంతరకరమన్నారు మోనిటైజేషన్ పైప్ లైన్ పేరుతొ ప్రభుత్వ ఆస్తులు అమ్మెందుకు వీలుగా పార్లమెంట్ చట్టం చేసిందని ,ఇది అత్యంత దుర్మార్గమైన చర్యగా అభివర్ణించారు. ఎన్నికల్లో అనేక వాగ్దానాలు చేసి, ప్రతి పేదవాడికి 15 లక్షల రూపాయలు అకౌంట్లలో జమచేస్తామని చెప్పింది నిజం కదా అని అన్నారు . 2014 లో మొదటిసారి అధికారంలోకి వచ్చిన మోడీ పార్లమెంట్ భవనంలో నేలను ముద్దాడి ప్రజాస్వామ్యాన్ని అపవాస్యం చేస్తున్నారని ధ్వజమెత్తారు . మోడీ పాలనా ఫాసిజాన్ని తలపిస్తుందని హిట్లరులా వ్యవహరిస్తున్నారని ఘాటైన విమర్శలు చేశారు.దేశంలో ద్రవ్యోల్బణం పెరిగిందని ,శ్రీలంక ను తలపిస్తుందని ఆదోనళన వ్యక్తం చేశారు . రాష్ట్రంలో సీఎం కేసీఆర్ పాలన కూడా నైజం పాలనను గుర్తు చేస్తుందని దాన్ని మార్చుకోవాలని, ప్రజారంజక పాలన అందించాలని హితవు పలికారు . విలేకర్ల సమావేశంలో సిపిఐ జిల్లా కార్యదర్శి పోటు ప్రసాద్ , సహాయకార్యదర్శి దండి సురేష్ , జిల్లా నాయకులు జమ్ముల జితేందర్ రెడ్డి ,జానీమియా , గోవిందరావు , కరుణాకర్ పాల్గొన్నారు .

Related posts

రసవత్తరంగా పంజాబ్ కాంగ్రెస్ రాజకీయాలు!

Drukpadam

ఆగస్టు 9న కాంగ్రెస్ పార్టీ ‘దళిత-గిరిజన దండోరా’: రేవంత్ రెడ్డి…

Drukpadam

మొదటి రెండు సంవత్సరాల సీఎం గా సిద్దు …తర్వాత 3 సంవత్సరాలు డీకే…?

Drukpadam

Leave a Comment