Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
కోవిడ్ వార్తలు

తెలంగాణ సర్కార్ ఉచిత వ్యాక్సిన్ కు భారత్ బయోటెక్ సానుకూలం

తెలంగాణ సర్కార్ ఉచిత వ్యాక్సిన్ కు భారత్ బయోటెక్ సానుకూలం

భారత్ బయోటెక్ ప్రతినిధులతో సీఎస్ సోమేశ్ సమావేశం
హాజరైన బయోటెక్ ఎండీ కృష్ణ ఎల్లా
తెలంగాణకు టీకా డోసులు అందిస్తామని వెల్లడి
రాష్ట్రంలో 18 ఏళ్లకు పైబడినవారికి ఉచితంగా వ్యాక్సిన్
రూ.2,500 కోట్ల వ్యయంతో కార్యాచరణ
కొవాగ్జిన్ కరోనా వ్యాక్సిన్ తయారీదారు భారత్ బయోటెక్ సంస్థ ఎండీ కృష్ణ ఎల్లా, ప్రతినిధులతో తెలంగాణ సీఎస్ సోమేశ్ కుమార్ సమావేశమయ్యారు. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు సోమేశ్ కుమార్ ఈ భేటీ నిర్వహించారు. తెలంగాణలో ఉచిత వ్యాక్సిన్ కు సరిపడా డోసులు సరఫరా చేయాలని భారత్ బయోటెక్ ను కోరారు.

తెలంగాణ ప్రభుత్వ విజ్ఞప్తికి భారత్ బయోటెక్ ఎండీ కృష్ణ ఎల్లా సానుకూలంగా స్పందించారు. తెలంగాణలో ఉచిత వ్యాక్సినేషన్ కు తమ తోడ్పాటు ఉంటుందని, అందుకు అవసరమైన టీకా డోసులు అందజేస్తామని వెల్లడించారు. కరోనా టీకా డోసుల పంపిణీలో తెలంగాణకు తగిన ప్రాధాన్యత ఉంటుందని స్పష్టం చేశారు.

తెలంగాణలో 18 ఏళ్లకు పైబడిన వారందరికీ ఉచితంగా వ్యాక్సిన్ ఇస్తామని టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రకటించిన సంగతి తెలిసిందే. ఉచిత వ్యాక్సినేషన్ కోసం రూ.2,500 కోట్ల వ్యయం అవుతుందని అంచనా.

Related posts

కేటీఆర్,సంతోష్ లకు కరోనా

Drukpadam

లాఠీపట్టడమే కాదు … సహాయం చేయడంలో మిన్న దటీజ్ సజ్జనార్

Drukpadam

కరోనాను కట్టడి చేయడంలో ప్రభుత్వం ఎక్కడో గాడి తప్పింది: అనుపమ్‌ ఖేర్‌

Drukpadam

Leave a Comment