Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఆంధ్రప్రదేశ్

వివేకా హత్య కేసు బదలాయింపుపై 21న వెలువడనున్న సుప్రీంకోర్టు తీర్పు!

వివేకా హత్య కేసు బదలాయింపుపై 21న వెలువడనున్న సుప్రీంకోర్టు తీర్పు!

  • ఏపీ నుంచి ఇతర రాష్ట్రానికి వివేకా కేసును బదలాయించాలంటూ సుప్రీంకోర్టులో పిటిషన్
  • ఇదివరకే వాదనలను పూర్తి చేసిన సుప్రీం ధర్మాసనం
  • మరో జడ్జి అందుబాటులో లేనందున తీర్పును వాయిదా వేస్తున్నానన్న జస్టిస్ ఎంఆర్ షా
  • ఎర్ర గంగిరెడ్డి బెయిల్ రద్దు పిటిషన్ పై విచారణ కూడా ఈ నెల 21కి వాయిదా

ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చిన్నాన్న, మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసును ఏపీ నుంచి ఇతర రాష్ట్రాలకు బదలాయించాలన్న పిటిషన్ పై సర్వెన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ఈ నెల 21న తీర్పు వెలువరించనుంది. ఈ పిటిషన్ పై ఇప్పటికే విచారణ పూర్తి కాగా…తీర్పును సుప్రీంకోర్టు రిజర్వ్ చేసిన సంగతి తెలిసిందే. గతంలో ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం సోమవారం (నవంబర్ 14)న ఈ వ్యవహారంపై సుప్రీంకోర్టు తీర్పు వెలువరించాల్సి ఉంది. ఈ క్రమంలో ఈ అంశం సోమవారం జస్టిస్ ఎంఆర్ షా నేతృత్వంలోని ధర్మాసనం ముందుకు వచ్చింది.

ఈ సందర్భంగా ఈ వ్యవహారంపై తీర్పును వచ్చే సోమవారం ప్రకటిస్తామని జస్టిస్ ఎంఆర్ షా తెలిపారు. బెంచ్ లోని మరో న్యాయమూర్తి అందుబాటులో లేని కారణంగానే ఈ వ్యవహారంపై తీర్పును వాయిదా వేస్తున్నట్లు ఆయన ప్రకటించారు. మరోవైపు ఇదే కేసులో నిందితుడిగా ఉన్న ఎర్ర గంగిరెడ్డికి మంజూరైన బెయిల్ ను రద్దు చేయాలంటూ సీబీఐ దాఖలు చేసిన పిటిషన్ పై విచారణను కూడా జస్టిస్ ఎంఆర్ షా ఈ నెల 21కి వాయిదా వేశారు. కేసులో కీలక నిందితుడిగా ఉన్న గంగిరెడ్డి కింది కోర్టులో బెయిల్ పొందారు. ఈ బెయిల్ ను ఏపీ హైకోర్టు కూడా సమర్థించింది. ఫలితంగా సీబీఐ సుప్రీంకోర్టును ఆశ్రయించింది.

Related posts

ఈ నెల 30వ తేదీ వరకు విద్యా సంస్థలకు సెలవులు పొడిగింపు ఓమిక్రాన్ ఎఫెక్ట్..!

Drukpadam

చంద్రబాబుకు హైకోర్టులో ఊరట.. తాత్కాలిక ముందస్తు బెయిల్ మంజూరు

Ram Narayana

ఢిల్లీ చేరుకున్న సీఎం కేసీఆర్ కు ఎంపీ నామ ఘ‌న‌స్వాగతం

Drukpadam

Leave a Comment