Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
రాజకీయ వార్తలు

గులాబీ బాస్ మీటింగ్ … ఏమి చెబుతారోననే ఉత్కంఠ !

గులాబీ బాస్ మీటింగ్ … ఏమి చెబుతారోననే ఉత్కంఠ !
ఎంపీలు ,ఎమ్మెల్యేలు ,ఎమ్మెల్సీలు రావాలని పిలుపు
అన్ని కార్యక్రమాలు రద్దుచేసుకొని హైద్రాబాద్ పరుగు తీసిననేతలు
బీజేపీ యుద్ధం మరింత పెరుగుతుందా ?
ముందస్తు ఎన్నికలకు ముహూర్తమా ??

గులాబీ బాస్ మంగళవారం మీటింగ్ పెట్టారు ..దానికి ఎంపీలు ఎమ్మెల్యేలు ,ఎమ్మెల్సీలు ఉన్నపళంగా రావాలని ఆదేశాలు వచ్చాయి. ఇంకేముంది బాస్ మీటింగా అంటే తాము తలపెట్టిన కార్యక్రమాలు అన్ని రద్దు చేసుకొని హుటాహుటిన వివిధ జిల్లాలనుంచి నేతలు హైద్రాబాద్ బయలు దేరి వెళ్లారు .

ఈ మీటింగ్ అసలు ఎందుకు పెట్టినట్లు అనేది బయట పరిశీలకులనే కాదు …టీఆర్ యస్ నేతలను వేధిస్తున్న ప్రశ్న …ఇందులో ఎదో స్ట్రాటజీ లేకుండా కేసీఆర్ మీటింగ్ పెట్టరు అనేది మరో ఆలోచన. ఏదైనా బుర్ర బద్దలు కొట్టుకుంటూ కేసీఆర్ సమావేశానికి వెళ్లారు ప్రజాప్రతినిధులు …బాస్ సమావేశం కోసం ఎదురు చూపులు …ఆయన ఏమి చెపుతాడోననే ఉత్కంఠ …ఇటీవల కేంద్రం పై యుద్ధం కొనసాగిస్తున్న కేసీఆర్ బీఆర్ యస్ పార్టీ కూడా పెట్టారు . హోరా హోరీగా జరిగిన మునుగోడు ఎన్నికల్లో గులాబీ పార్టీ అతికష్టం మీద గట్టెక్కింది. అయినా గెలవడం తో కొంత గాలి పీల్చుకున్నారు .అయినప్పటికీ మంత్రులు ,ఎమ్మెల్యేలు ,ఎంపీలు , ఎమ్మెల్సీలు , మంత్రులు గులాబీ పార్టీ యంత్రాంగం చివరకు సీఎం కేసీఆర్ పనిచేసిన బీజేపీకి 86 వేల ఓట్లు రావడాన్ని జీర్ణించుకోలేక పోతున్నారు . కమ్యూనిస్టులు లేకపోతె గులాబీ పార్టీ గెలుపు సాధ్యమయ్యేది కాదని టీఆర్ యస్ శ్రేణులు సైతం ఒప్పుకుంటున్నాయి .

ఈ పరిస్థితుల్లో తిరిగి రాష్ట్రంలో అధికారంలోకి రావడంతో పాటు దేశమంతా పార్టీని విస్తరించాలంటే ముందస్తు ఎన్నికలే మంచిదనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. మునుగోడు గెలుపు ఊపు మీద ఉన్న టీఆర్ యస్ కు ఎన్నికలు ముందు పెట్టడమే కాకుండా లెఫ్ట్ పార్టీలతో కలిస్తే ఉమ్మడి ఖమ్మం నల్గొండ జిల్లాలలోని దాదాపు 22 సీట్లను గెలుచుకోవచ్చుననే అంచనా వేస్తున్నారు . ఇందులో ఐదు లేక ఆరు స్థానాలు సిపిఎం ,సిపిఐ పార్టీలకు ఇచ్చినా, 16 నుంచి 17 స్థానాలు తమ ఖాతాలో వేసుకోవచ్చునని అనుకుంటున్నారు .దీనివల్ల రాష్ట్రంలో అధికారం చేపట్టడంతో పాటు లోకసభ ఎన్నికలనాటికి దేశంలో బీఆర్ యస్ తరుపున అభ్యర్థులను పెట్టి ప్రచారం చేయవచ్చునని అడుగులు వేస్తున్నారు .

అందుకు సిద్ధంగా ఉండాలని ఎమ్మెల్యేలు ఎంపీలకు చెప్పే అవకాశాలు ఉన్నాయి. పొత్తుల్లో భాగంగా కొన్ని సీట్లు కోల్పోయే అవకాశాలు ఉన్నందున వారికీ ప్రత్యాన్మాయ అవకాశాలు కల్పిస్తామని మనదే అధికారం అయినందున కావాల్సిన విధంగా చేసుకోవచ్చునని గులాబీ బాస్ తన పార్టీ నేతలకు హితబోధ చేసే అవకాశాలు ఉన్నాయి . ….చూద్దాం ఏమి జరుగుతుందో….!

Related posts

బీజేపీ ఎంపీ అర్వింద్ ను అడ్డుకున్న గ్రామస్థులు.. కాన్వాయ్‌పై దాడి!

Drukpadam

మోడీ పాలనలో మరోసారి దిగజారిన భారత్: సిపిఎం..

Drukpadam

శివసేనతో చేయి కలిపిన ఎంఐఎం!

Drukpadam

Leave a Comment