Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
రాజకీయ వార్తలు

మళ్ళీ గవర్నర్ కొర్రీ ….బిల్లులపై చర్చించేందుకు హరీష్ రావును బంగ్లాకు రమ్మన్న తమిళశై …..

అసెంబ్లీ ఆమోదించిన బిల్లుపై అసంతృప్తి.. హరీశ్ రావును రాజ్ భవన్ కు రమ్మన్న తమిళిసై!

  • మెడికల్ టీచింగ్ స్టాఫ్ ఉద్యోగ విరమణ వయసును పెంచుతూ అసెంబ్లీ ఆమోదం
  • అభ్యంతరం వ్యక్తం చేస్తున్న గవర్నర్
  • హరీశ్ ను వివరణ కోరనున్న తమిళిసై

తెలంగాణాలో రాష్ట్రప్రభుత్వానికి గవర్నర్ కు మధ్య నెలకొన్న విభేదాలు కొనసాగుతూనే ఉన్నాయి. రాష్ట్రంలో ఎమ్మెల్సీల నామినేట్ దగ్గర నుంచి వివిధ అంశాలపై గవర్నర్ కొర్రీలు పెడుతున్నారని రాష్ట్ర ప్రభుత్వం మంత్రులు ,వివిధ సందర్భాల్లో బహిరంగంగానే వ్యాఖ్యానించారు. గవర్నర్ సైతం రాష్ట్ర ప్రభుత్వ చర్యలను తప్పు పట్టారు . ఇటీవల విద్యాశాఖకు సంబంధించి ఆశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డిని రాజ్ భవన్ కు పిలిపించిన తమిళశై , అసెంబ్లీ ఆమోదం పొందిన బిల్లులల విషయంలో తన అభ్యంతరాలను నివృత్తి చేసుకునేందుకు ఆర్ధికమంత్రి హరీష్ రావు ను గవర్నర్ బంగ్లాకు రమ్మని కబురు చేయడం టీఆర్ యస్ మండి పడుతుంది.

తెలంగాణ అసెంబ్లీ ఆమోదించిన బిల్లులకు ఆమోదముద్ర వేసే విషయంలో గవర్నర్ తమిళిసై ఆచితూచి వ్యవహరిస్తున్నారు. పలు బిల్లులకు ఆమోదం తెలపకుండా తన వద్దే ఉంచుకుంటున్నారు. పూర్తి క్లారిటీ ఉంటేనే ఆమోదిస్తున్నారు. ఈ క్రమంలో… రాజ్ భవన్ కు రావాలంటూ తాజాగా ఆరోగ్యమంత్రి హరీష్ రావుకు పిలుపు వచ్చింది.

మెడికల్ టీచింగ్ స్టాఫ్ ఉద్యోగ విరమణ వయస్సును పెంచుతూ అసెంబ్లీ ఆమోదించిన బిల్లుపై తమిళిసై అసంతృప్తితో ఉన్నారు. టీచింగ్ స్టాఫ్ తో పాటు డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్, అడిషనల్ డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ పోస్టుల రిటైర్మెంట్ వయస్సును పెంచడంపై ఆమె అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ క్రమంలోనే హరీశ్ కు రాజ్ భవన్ కు రావాలంటూ పిలుపు వచ్చింది. బిల్లుకు సంబంధించి మంత్రి నుంచి ఆమె వివరణ కోరనున్నారు. బిల్లు విషయానికి వస్తే… వయో పరిమితిని 62 నుంచి 65 ఏళ్లకు పెంచడం జరిగింది.

Related posts

గజినీ వేషాలు ఇప్పటికైనా మానుకో: కేసీఆర్ పై బండి సంజయ్ ఫైర్!

Drukpadam

కమలహాసన్ రాజకీయాలకు గుడ్‌బై చెప్పేస్తున్నారా?

Drukpadam

బోస్ ప్రజలకోసం జీవించి వారికీ వెలుగులు నింపారు …ప్రొఫెసర్ మాడభూషి శ్రీధర్!

Drukpadam

Leave a Comment