కర్నూలులో చంద్రబాబు ఆవేశం చూసి బాధేసింది: యనమల!
- కర్నూలులో చంద్రబాబు ఆవేశపూరిత ప్రసంగం
- నేడు టీడీపీ విస్తృతస్థాయి సమావేశం
- హాజరైన సీనియర్ నేతలు
- ప్రజలు టీడీపీని గెలిపించేందుకు సిద్ధంగా ఉన్నారన్న యనమల
చంద్రబాబు ఆవేశంపై స్పందించిన టీడీపీ సీనియర్ నేతలు …సర్ మీరు కర్నూల్ పర్యటనలో బాగా ఆవేశ పడ్డారు అంత ఆవేశం వద్దు … మాకు మంచి సలహాలు ఇవ్వండి . టీడీపీని గెలిపించేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారు . మీరు ప్రశాంతగా ఉండి అభ్యర్థులను త్వరగా నిర్ణయించండి. అని యనమల సూచించారు . టీడీపీ ఏపీ అధ్యక్షుడు అచ్చం నాయుడు మాట్లాడుతూ టీడీపీకి 160 సీట్లు వస్తాయని జగన్ రెడ్డి ప్రభుత్వం మీద ప్రజల వ్యతిరేకత బాగుందని అన్నారు .అందువల్ల మనం అభ్యర్థులను నిర్ణయించి ప్రజల్లోకి వెళ్లాలని జగన్ ప్రజా వ్యతిరేక కార్యక్రమాలను ఎండగట్టాలని అన్నారు .
టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు అధ్యక్షతన నేడు పార్టీ విస్తృతస్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి పార్టీ పొలిట్ బ్యూరో సభ్యుడు యనమల రామకృష్ణుడు కూడా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, నిన్న కర్నూలులో చంద్రబాబు చేసిన ఆవేశపూరితమైన ప్రసంగం పట్ల స్పందించారు.
కర్నూలులో మీ ఆవేశం చూసి మేం బాధపడ్డాం అని యనమల వెల్లడించారు. మీరు టెన్షన్ చెందవద్దు… ప్రశాంతంగా ఉండండి… మాకు తగిన సలహాలు ఇవ్వండి అంటూ చంద్రబాబును ఉద్దేశించి వ్యాఖ్యానించారు.
ఎన్నికలు వస్తే టీడీపీని గెలిపించేందుకు ప్రజలంతా సిద్ధమయ్యారని, అభ్యర్థులను ఖరారు చేసే విషయంలో చంద్రబాబు సాధ్యమైనంత త్వరగా నిర్ణయం తీసుకోవాలని అన్నారు. ఇంతకుముందు మాదిరే ప్రతి మూడు జిల్లాలకు ఓ ఇన్చార్జిని నియమించాలని యనమల సూచించారు.