Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
రాజకీయ వార్తలు

11 మంది అధికార ప్రతినిధులకు తెలంగాణ పీసీసీ షోకాజ్ నోటీసులు!

11 మంది అధికార ప్రతినిధులకు తెలంగాణ పీసీసీ షోకాజ్ నోటీసులు!
-నిన్న తెలంగాణ కాంగ్రెస్ సమావేశం
-జూమ్ యాప్ ద్వారా మీటింగ్
-పెద్ద సంఖ్యలో డుమ్మా కొట్టిన అధికార ప్రతినిధులు
-వివరణ కోరిన తెలంగాణ కాంగ్రెస్

కాంగ్రెస్ లో పరిణామాలు ఆ పార్టీ కార్యకర్తలను ఆందోళనకు గురిచేస్తున్నాయి. చాలారోజుల తర్వాత జూమ్ మీటింగ్ పెట్టిన పీసీసీ చీఫ్ పై వివర్శలు వెల్లు ఎత్తుతున్నాయి. పార్టీ నాయకత్వం ఇదే విధంగా ఉంటె కాంగ్రెస్ పార్టీ ఖాళీ కావడం ఖాయం అనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. మర్రి శశిధర్ రెడ్డి పార్టీ మార్పుకు రేవంత్ రెడ్డి , సీఎల్పీ నేత భట్టి విక్రమార్క లే భాద్యత వహించాలని జగ్గారెడ్డి బహిరంగంగానే విమర్శలు గుప్పించారు .

ఈనేపథ్యంలో హైదరాబాద్ లో నిన్న జరిగిన తెలంగాణ కాంగ్రెస్ ఉన్నతస్థాయి సమావేశానికి 11 మంది అధికార ప్రతినిధులు గైర్హాజరవడం పట్ల పీసీసీ నాయకత్వం ఆగ్రహం వ్యక్తం చేసింది. నిన్నటి సమావేశానికి కేవలం ఇద్దరు అధికార ప్రతినిధులే హాజరయ్యారు. ఈ నేపథ్యంలో 11 మంది అధికార ప్రతినిధులకు టీపీసీసీ నేడు షోకాజ్ నోటీసులు జారీ చేసింది. సమావేశానికి ఎందుకు రాలేదో వివరణ ఇవ్వాలని నోటీసుల్లో స్పష్టం చేసింది.

తెలంగాణ కాంగ్రెస్ పార్టీ నాయకత్వం నిన్న జూమ్ మీటింగ్ ఏర్పాటు చేసింది. మునుగోడు ఓటమి అనంతరం ఏర్పాటు చేసిన సమావేశం కావడంతో, ఆ ఉప ఎన్నిక ఫలితంపై సమీక్ష ఉంటుందని భావించారు. కానీ పెద్ద సంఖ్యలో అధికార ప్రతినిధులు ఈ జూమ్ మీటింగ్ కు డుమ్మా కొట్టారు.

జగ్గారెడ్డి వంటి సీనియర్ నేతలు ఇలా జూమ్ ద్వారా సమావేశం ఏర్పాటు చేయడం ఏంటని బాహాటంగానే ప్రశ్నించారు. జగ్గారెడ్డి కూడా ఈ జూమ్ సమావేశానికి గైర్హాజరైనట్టు తెలుస్తోంది. ఇదేమైనా కంపెనీనా…. ఇళ్లలో కూర్చుని చర్చించుకోవడానికి అంటూ జగ్గారెడ్డి నిలదీశారు.

Related posts

రాహుల్‌గాంధీ ఏమనుకుంటున్నారు.. మనోళ్లపైనా సాయుధ బలగాలను ప్రయోగించమంటారా?: బీజేపీ సూటి ప్రశ్న

Ram Narayana

బెడిసి కొట్టిన బీజేపీ వ్యూహం …బెంగాల్ లో దిదికే పట్టం

Drukpadam

రిపబ్లిక్ ప్రీరిలీజ్ ఈవెంట్ …ఏపీ సర్కారుపై నిప్పులు చెరిగిన పవన్ కల్యాణ్!

Drukpadam

Leave a Comment