Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఆంధ్రప్రదేశ్

తెలంగాణలో లేకపోతే నాపై రాజద్రోహం కేసు పెట్టేవారేమో: ప్రొఫెసర్ నాగేశ్వర్!

తెలంగాణలో లేకపోతే నాపై రాజద్రోహం కేసు పెట్టేవారేమో: ప్రొఫెసర్ నాగేశ్వర్!

  • మోదీ విధానాలను ప్రశ్నిస్తే రాజద్రోహం కేసులు పెడుతున్నారన్న నాగేశ్వర్ 
  • జీవితాంతం జైల్లో మగ్గేలా చేస్తున్నారని ఆరోపణ 
  • కార్పొరేట్లను దూరం పెడితే లీటర్ పెట్రోల్, డీజిల్ పై రూ. 30 చొప్పున తగ్గించొచ్చని వ్యాఖ్య 

ప్రధాని మోదీ పాలనా విధానాలపై ఎవరు ప్రశ్నించినా వారిపై రాజద్రోహం కేసులు పెడుతున్నారని రాజకీయ విశ్లేషకుడు ప్రొఫెసర్ నాగేశ్వర్ అన్నారు. వారిని జీవితాంతం జైల్లో మగ్గేలా చేస్తున్నారని విమర్శించారు. తాను తెలంగాణలో ఉండటం వల్ల ప్రశాంతంగా ఉన్నానని… లేకపోతే తనపై కూడా కేసులు పెట్టేవాళ్లేమోనని అన్నారు.

మన దేశంలో ఇప్పటికీ 4 కోట్ల మంది నిరుద్యోగులు ఉన్నారని ప్రొఫెసర్ చెప్పారు. 22 కోట్ల మంది రోజుకు రూ. 375 కంటే తక్కువ సంపాదనతోనే బతుకీడుస్తున్నారని తెలిపారు. ఇలాంటి విషయాలను చెపితే తనను అర్బన్ నక్సలైట్, యాంటీ నేషనల్, పాకిస్థాన్ ఏజెంట్, యాంటీ హిందూ అనే ముద్ర వేస్తారని చెప్పారు.  2014 నాటి ఆర్థిక విధానాలను అవలంభిస్తే, కార్పొరేట్లను దూరం పెడితే…  ఇప్పటికీ లీటర్ పెట్రోల్, డీజిల్ పై రూ. 30 చొప్పున తగ్గించొచ్చని తెలిపారు.

Related posts

ఖమ్మం గుప్త హోటల్ నిర్వాకుల కొత్త ఆలోచన!

Drukpadam

చంద్రబాబుపై మరో కేసు నమోదు చేసిన ఏపీ ప్రభుత్వం

Ram Narayana

సోవియెట్ యూనియన్ చివరి అధినేత మిఖాయిల్ గోర్బచెవ్ కన్నుమూత!

Drukpadam

Leave a Comment