Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
రాజకీయ వార్తలు

తుమ్మల ..రేగా సమావేశం ఆంతర్యం ఏమిటి ?

తుమ్మల ..రేగా సమావేశం ఆంతర్యం ఏమిటి ?
-గోవిందరావు పేట నుంచి మణుగూరు చేరుకున్న తుమ్మల
-తుమ్మలను ఆహ్వానించిన ఎమ్మెల్యే రేగా
-పొంగులేటికి కౌంటర్ గానే తుమ్మలను రేగా ఆహ్వానించారని అభిప్రాయాలు
-కొంతకాలంగా పినపాకలో తరచూ పర్యటనలు జరుపుతున్న పొంగులేటి
-తనకు వ్యతిరేకంగా ఉన్నవారితో కలిసి పొంగులేటి పర్యటనలపై రేగా ఆగ్రహం …
-అందుకే తుమ్మలతో సన్నిహితంగా మెలిగే ప్రయత్నం చేస్తున్నారని ప్రచారం …

రాజకీయాల్లో దూకుడుగా వ్యవహరించే పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు ఇటీవల వార్తల్లో వ్యక్తిగా నిలిచారు. ఎమ్మెల్యేల్ని బీజేపీ కొనుగోలుకు ప్రయత్నం చేసిందని వస్తున్న ఆరోపణల్లో నలుగురు ఎమ్మెల్యేలు ఉండగా అందులో రేగా కాంతారావు ఒకరు . అయితే సోమవారం ఆయన టీఆర్ యస్ నేత మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరావు తో మణుగూరులో భేటీ కావడం ఉమ్మడి ఖమ్మం జిల్లాలో చర్చనీయాంశంగా మారింది. దీనికి పెద్ద ప్రాధాన్యత లేదని అటు తుమ్మల , ఇటు రేగా అనుయాయులు చెబుతున్నప్పటికీ ఇందులో ఎదో మతలబు ఉందని పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు . మాజీఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తరుచు పినపాక నియోజకవర్గంలో పర్యటనలు చేస్తూ తనకు వ్యతిరేకంగా ఉన్నవారితో ఊరేగటంపై ఆగ్రహంగా ఉన్న రేగా కాంతారావు పొంగులేటితో విభేదిస్తున్న మాజీ మంత్రి తుమ్మలను తన క్యాంపు కార్యాలయానికి ఆహ్వానించడం ఆయన్ను సత్కరించడం హాట్ టాపిక్ గా మారింది.

ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఇప్పటికే టీఆర్ యస్ లో ఉన్న గ్రూప్ తగాదాలకు తోడు రేగా , తుమ్మల భేటీ మరింత ఆజ్యం పోసిందని అభిప్రాయాలు ఉన్నాయి. తుమ్మల సత్తుపల్లిలో జరిగిన కృతజ్ఞత సమావేశానికి రాకపోవడం పై కూడా టీఆర్ యస్ లో చర్చనీయాంశం అయిన నేపథ్యంలో వీరి కలయికపై రాజకీయ పార్టీలే కాకుండా టీఆర్ శ్రేణులు కూడా ఆరా తీస్తున్నాయి.

కాంగ్రెస్ నుంచి గెలిచి అధికార టీఆర్ యస్ లో చేరిన ఎమ్మెల్యేలలో రేగా కాంతారావు కీలకంగా వ్యవహరించారు. కాంగ్రెస్ శాసనసభ పక్షాన్ని టీఆర్ యస్ లో విలీనం చేస్తున్నట్లు ప్రకటించి కేసీఆర్ దృష్టిలో పడ్డ రేగా కాంతారావు శాసనసభ లో ప్రభుత్వ విప్ గా నియమితులైయ్యారు. అంతే కాకుండా భద్రాద్రి కొత్తగూడెం టీఆర్ యస్ అధ్యక్షులుగా నియమితులై బహుముఖ పదవులు నిర్వహిస్తున్నారు . టీఆర్ యస్ ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారాన్ని బయటపెట్టి బీజేపీ కుట్రలను బహిర్గతం చేసిన ఎమ్మెల్యేగా నిలిచి సీఎం కేసీఆర్ కి అత్యంత దగ్గరైయ్యారు . ఇప్పుడు 4 +4 గాన్ మెన్లతో సెక్యూర్టీ ,బులెట్ ప్రూఫ్ వాహనంతో ఉన్న రేగా కాంతారావు చాలారోజులు కేసీఆర్ ఉంటున్న ప్రగతి భవనంలో ఉండి బయటకు వచ్చారు . జిల్లాకు వచ్చిన రేగా తన రాజకీయ ఆలోచనలకు పదును పెడుతున్నారు. అందులో భాగంగానే తుమ్మలతో భేటీ జరిగి ఉండవచ్చుననే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.

Related posts

ఓటుకు నోటు కేసులో చంద్రబాబుకు ఊరట-రేవంత్ రెడ్డి పై చార్జిషీటు!

Drukpadam

కాంగ్రెస్ అధ్యక్ష పదవి కోసం అశోక్ గెహ్లాట్ …శశిథరూర్ మధ్య పోటా పోటీ..?

Drukpadam

బీజేపీ మత పిచ్చి రాజకీయాలతో దేశం నాశనమవుతోంది…మోడీ విధానాలపై కేసీఆర్ ఫైర్

Drukpadam

Leave a Comment