Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
రాజకీయ వార్తలు

కేసీఆర్ ముందస్తుకే వెళ్తారు …బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ప్రవీణ్ కుమార్…

కేసీఆర్ ముందస్తుకే వెళ్తారు …బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ప్రవీణ్ కుమార్…
ఇందులో సందేహాలు అవసరం లేదన్న బీఎస్పీ నేత
6 నెలల్లో కేసీఆర్ ముందస్తు ఎన్నికలకు వెళ్తారన్న ప్రవీణ్
ఈడీ, ఐటీ సోదాలు బీజేపీ, టీఆర్ఎస్ ల డ్రామాలని కామెంట్
జనాభాకు అనుగుణంగా రిజర్వేషన్లు పెంచాలని డిమాండ్
52 శాతం ఉన్న బీసీలకు సీట్లు ఎన్ని ?

తెలంగాణలో ముందస్తు ఎన్నికలు వస్తాయని రాష్ట్ర బీఎస్పీ అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఘంటాపధంగా చెబుతున్నారు . కచ్చితంగా కేసీఆర్ కు ముందస్తు ఆలోచనలు ఉన్నాయని ఇందులో ఎలాంటి సందేహాలు అవసరం లేదని పేర్కొన్నారు . ముఖ్యమంత్రి కేసీఆర్ 6 నెలల్లో ముందస్తు ఎన్నికలకు ఖాయంగా కనిపిస్తుందని అన్నారు . ఈడీ, ఐటీ సోదాలు టీఆర్ఎస్, బీజేపీలు కలిసి ఆడుతున్న డ్రామాలని విమర్శించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఫారెస్ట్ అధికారి హత్యకు గురి కావడానికి కేసీఆర్ నైతిక బాధ్యత వహించాలని చెప్పారు.

52 శాతం ఉన్న బీసీలకు స్థానిక సంస్థల్లో 27 శాతం రిజర్వేషన్లను కల్పిస్తే ఎలాగని ప్రవీణ్ కుమార్ ప్రశ్నించారు. బీసీ రిజర్వేషన్ల అంశంపై ఈ నెల 26 నుంచి పెద్ద ఎత్తున పోరాడుతామని చెప్పారు. కోటి సంతకాలను సేకరించి రాష్ట్రపతికి పంపుతామని అన్నారు. పెరిగిన జనాభాకు అనుగుణంగా రిజర్వేషన్లను కూడా పెంచాలని డిమాండ్ చేశారు. ఈడబ్ల్యూఎస్ కోటాలో ఆర్థికంగా వెనుకబడిన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు అవకాశం ఇవ్వాలని అన్నారు.

Related posts

ఆర్‌ఎల్‌డీ జాతీయ అధ్యక్షుడిగా అజిత్ సింగ్ తనయుడు జయంత్ చౌదరి…

Drukpadam

వైసీపీ స‌ర్వేలో టీడీపీకి 115 సీట్లు వ‌స్తాయ‌ని తేలింది: ర‌ఘురామ‌కృష్ణ‌రాజు

Drukpadam

ఢిల్లీ రైతు ఉద్యమానికి ఖమ్మం ప్రజల జేజేలు

Drukpadam

Leave a Comment