Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఆంధ్రప్రదేశ్

గొత్తికోయల గ్రామ బహిష్కరణ …నాగరికమా ?

గొత్తికోయల గ్రామ బహిష్కరణనాగరికమా ?
సంచార జాతులుగా ఉండే గొత్తికోయలపై జులం సరైందేనా
అడవి బిడ్డలపై కక్ష్యలు పెంచుకోవడం ఆత్మపరిశీలన అవసరం
గుంపుల్లో వారికీ కనీస వసతులు కరువు
సరైన ఆహారం అందక వ్యాధుల బారిన పడి మరణిస్తున్న ఆదివాసీలు

గొత్తికోయలు ..భద్రాద్రికొత్తగూడెం జిల్లాలోని చంద్రుకొండ మండలం,బెండలపాడు గ్రామపంచాయతీ లో ఫారెస్ట్ రేంజర్ శ్రీనివాస్ రావు హత్యతో చెడ్డపేరు తెచ్చుకున్నారు . వారు అంటే జాలిపడే వారు సైతం, కోపగించుకునే పరిస్థితి ఏర్పడింది ఎర్రబోరులో జరిగిన శ్రీనివాసరావు హత్య …ఇది కచ్చితంగా ఖండించాల్సిందే …ఇందులో మరో మాటకు తావులేదు … హత్యకు కారకులైన వారిని శిక్షించాల్సిందే … ఇప్పటికే హత్యలో పాల్గన్నారని చెబుతున్నవారిని అరెస్ట్ చేశారు . కానీ ఆపేరుతో అమాయకులైన గొత్తికోయలను గ్రామబహిష్కరణ చేయడం , లేదా ఇక్కడ లేకుండా తరిమేయాలని అనడం అనాగరికం అవుతుంది. దీన్ని విజ్ఞులైన వారు ఆలోచన చేయాల్సిన అంశం . ఇలాంటి అనాగరిక చర్యలను అందరు ఖండించాలి . లేకపోతె గిరిజనుల బ్రతుకులే ప్రశ్నర్థకంగా మారె పరిస్థితి ఏర్పడుంది .

ఎవరి గొత్తికోయలు ….

 

మధ్యప్రదేశ్ , మహారాష్ట్ర లలో మావోయిస్టు లకు పోలీసులకు జరుగుతున్న యుద్ధంలో తట్టుకోలేక ఛత్తీస్ ఘడ్ ప్రాంతంలోని గ్రామాలకు గ్రామాలను ఖాళీచేసి 30 సంవత్సరాల క్రితం పొట్టపోసుకునేందుకు ఉమ్మడి ఖమ్మం జిల్లాకు వచ్చినవారే గొత్తికోయలు …వారు ఇక్కడ ఆయాప్రాంతాల్లో గుంపులుగా ఉంటూ అటవీ ఉత్పత్తులపై ఆధారపడి జీవిస్తున్నారు . వారు వలస జీవులు … భారత ప్రభుత్వం రాజ్యంగంలోని 5, 6 అధికరణలకింద ఆటవిపై ఆదివాసీలకు హక్కులను కల్పించింది . 1 /70 చట్టం ఉండటంతో గిరిజనేతరులు ఏజన్సీ లో భూములు కొనడానికి వీలులేదు . ఇప్పటికే అక్కడ పట్టాలు కలిగి ఉన్న గిరిజనేతరులు భూములు అమ్మదలిస్తే గిరిజనులకే అమ్మాలి …కానీ పోడు భూముల విషయంలో గిరిజనేతరులు కూడా తాము సాగు చేసుకుంటున్న భూములకు పట్టాలు ఇవ్వాలని కోరడంపై అభ్యంతరాలు ఉన్నాయి.

పోడు భూములు కాజేస్తున్న దొంగలు ఎవరు ?

ఆదివాసీల పేరుతో అడవులను ఆగం చేస్తూ పోడు వ్యవసాయం చేస్తున్న దొంగలు దొరలుగా చెలామణి అవుతున్నారు. వందల ఎకరాల పోడు భూములను కొట్టి దానికి తామే వారసులం అని చెప్పే ప్రయత్నం చేస్తున్నారు . ఈ దొంగలు ఎవరు అధికారంలో ఉంటె వారి పంచన చేరి పోడు భూములకు హక్కులు పొందే ప్రయత్నం చేస్తున్నారు . ఆదివాసులకు హక్కుగా ఉండాల్సిన పోడుభూములు గిరిజేనేతరులు కొట్టేసే ప్రయత్నం చేస్తున్నారనే విమర్శలు ఉన్నాయి.

ఛత్తీస్‌గఢ్‌, మహారాష్ట్ర, ఒడిశా, మధ్యప్రదేశ్‌ రాష్ట్రాల నుంచి ఏజెన్సీ ప్రాంతాలకు గొత్తికోయలు వలసవచ్చారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాతో పాటు వరంగల్ , కరీంనగర్ ,ఆదిలాబాద్ జిల్లాలలో లక్షలాదిగా ఉన్నారు . ప్రధానంగా ఛత్తీస్ ఘడ్ రాష్ట్రంనుంచి ఉమ్మడి ఖమ్మం జిల్లాలో లక్షమందికి పైగా వలస వచ్చారు. అయితే సంవత్సరాలు గడుస్తున్నా వారి జీవనం దయనీయంగానే ఉంది. అమాయకులైన గొత్తికోయలకు వలస జీవనం అలవాటు . నీళ్లు ,సాగుచేసుకునేందుకు వీలైన భూములు ఎక్కడ ఉంటె అక్కడ పోడు కొట్టి వ్యవసాయం చేసుకునేవారు . చేసుకున్నన్నాళ్లు చేసుకొని అక్కడ నుంచి వేరే ప్రాంతానికి తరలిపోవడం అనాదిగా వస్తుంది . … గొత్తికోయలకు గోసి తప్ప వంటిపై బట్టలు ఉండటం అరుదు. స్త్రీలు సైతం ఒక్క చీర మాత్రమే అదికూడా సగం వంటిని మాత్రమే కప్పి ఉంటుంది. ఒకపూట తింటే మరో పూట పస్తులు ఉండటం , అటవీ ఉత్పత్తులను సంతల్లో కారు చౌకకు ఇవ్వడం ,వారికీ కావాల్సింది తెచ్చుకోవడం అనే వాస్తు మార్పిడి విధానం ఆనవాయితీగా మారింది. ఒకరకంగా చెప్పాలంటే గొడ్డు చాకరి చేయడం ఆపొద్దుకు సరిపెట్టుకోవడం …వారికీ పొట్టనింపుకోవడం తప్ప పొట్టకొట్టడం తెలియదు . దోపిడీ చేతకాదు …అవినీతి అక్రమాలు అసలు తెలియని అక్షరాలురాని అమాయకులు …

పొట్టనింపుకునేందుకు ఎవరినైనా ఎదిరించడం అవసరమైతే ప్రాణాలకు తెగించడం వారి లక్షణం . వలస వచ్చిన గొత్తికోయలకు తెలుగు రాష్ట్రాల్లో ప్రభుత్వాలు కొంత సహాయం చేసేందుకు ప్రయత్నిస్తున్నాయి. అయితే పోడు సాగు చేసుకునే దగ్గర వారికీ ఫారెస్ట్ సిబ్బందికి మధ్య తరచూ తగాదాలు జరుగుతున్నాయి. గతంలో ఆదిలాబాద్ జిల్లాలో ఎమ్మెల్యే కోనేరు కోనప్ప సోదరుడు ఫారెస్ట్ అధికారిపై చేయిచేసుకున్న ఘటన కూడా చూశాం. అనేక మంది ఎమ్మెల్యేలు , అధికార పార్టీ నాయకులు వందల ఎకరాల పోడు భూములు కాజేసేందుకు చేస్తున్న ప్రయత్నాలపై భిన్న అభిప్రాయాలూ ఉన్నాయి.

ఆదివాసీలు నివసించే ప్రాంతాల్లో కనీస వసతులు కరువు

వలస వచ్చిన ఆదివాసీలు నివసిస్తున్న ప్రాంతాల్లో విద్యుత్‌ సరఫరా లేకపోవడంతో చిమ్మచీకట్లో కాలం వెళ్లదీస్తున్నారు. రాత్రి వేళల్లో విషపురుగుల బారిన పడి పలువురు గొత్తికోయలు మృతిచెందిన సందర్భాలున్నాయి.గుంపుల్లో మంచినీరు, రోడ్లు, విద్యుత్‌, వైద్య సౌకర్యాలు కల్పించాలని కోరుతున్నారు .అమాయకులైన గిరిజనులను ఆదుకోవాల్సిన నాగరిక ప్రపంచం వారిని వెలివేయడం సరైందేనా అని ఆలోచించాలి ….

 

Related posts

ఢిల్లీ పీక పిసికేశారు.. ప్రజల ఆస్తులు ధ్వంసం చేశారు.. రైతుల ఆందోళనపై సుప్రీంకోర్టు తీవ్ర వ్యాఖ్యలు!

Drukpadam

ఎస్ఈసీ నిమ్మగడ్డకు ప్రివిలేజ్ కమిటీ నోటీసులు

Drukpadam

 ప్రభుత్వం అంగన్వాడీల పట్ల దుర్మార్గంగా వ్యవహరించింది: అంగన్వాడీ నాయకురాలు బేబీ రాణి

Ram Narayana

Leave a Comment