Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఆంధ్రప్రదేశ్

భగభగలాడుతున్న అతిపెద్ద అగ్నిపర్వతం… హవాయి ద్వీపంలో కలకలం!

భగభగలాడుతున్న అతిపెద్ద అగ్నిపర్వతం… హవాయి ద్వీపంలో కలకలం!

  • బద్దలవుతున్న మవోనా లోవా అగ్నిపర్వతం
  • పెద్ద ఎత్తున విడుదలవుతున్న బూడిద
  • హవాయిలోని చాలా ప్రాంతాలకు హెచ్చరికలు
  • చివరిసారిగా 1984లో బద్దలైన అగ్నిపర్వతం

అమెరికాకు చెందిన హవాయి దీవిలోని మవోనా లోవా అగ్నిపర్వతం నుంచి భారీ స్థాయిలో బూడిద, ఇతర శకలాలు వెలువడుతున్నాయి. కాల్డెరా పర్వత శిఖరాగ్రంపై ఉన్న మవోనా లోవా ప్రపంచంలో క్రియాశీలకంగా ఉన్న అతిపెద్ద అగ్నిపర్వతం. ఇప్పుడది బద్దలవుతోంది.

మరికొన్నిరోజుల్లో ఇది పూర్తిస్థాయిలో లావా వెదజల్లనుందని అధికారులు హెచ్చరించారు. దీని ప్రభావంతో సమీప ప్రాంతాలు బూడిదమయం అయ్యాయి. హవాయి ద్వీపంలోని చాలా భాగానికి బూడిద హెచ్చరికలు జారీ అయ్యాయి. 0.6 సెం.మీ మందంతో బూడిద పేరుకుంటుందని జాతీయ వాతావరణ సంస్థ వెల్లడించింది.

అటు, శాస్త్రవేత్తలు కూడా అప్రమత్తం అయ్యారు. ఇటీవల భూకంపాల సంఖ్య పెరిగిన నేపథ్యంలో, మవోనా లోవా నుంచి వస్తున్న సంకేతాలను తేలిగ్గా తీసుకోరాదని అంటున్నారు. హవాయి దీవిలో ఉన్న ఐదు అగ్నిపర్వతాల్లో మవోనా లోవా ఒకటి. ఇది చివరిసారిగా 1984లో బద్దలైంది.

Related posts

ఎట్టకేలకు ఆయుష్మాన్ భారత్ పథకంలో చేరిన తెలంగాణ…

Drukpadam

వీలునామా రాయకపోతే తండ్రి ఆస్తుల్లో కుమార్తెలకు వాటా: సుప్రీంకోర్టు!

Drukpadam

ఎల్కే అద్వానీకి ఇంటికెళ్లి బర్త్ డే విషెస్ చెప్పిన ప్రధాని మోదీ

Drukpadam

Leave a Comment