ఆంధ్రప్రదేశ్

ఢిల్లీ సీబీఐ కార్యాలయానికి రండి …మంత్రి , ఎంపీలకు నోటీసులు!

ఢిల్లీ సీబీఐ కార్యాలయానికి రండి …మంత్రి , ఎంపీలకు నోటీసులు!
-టీఆర్ఎస్ నేతలు గంగుల, రవిచంద్రకు తాఖీదులు
-నకిలీ సీబీఐ అధికారి శ్రీనివాస్ కేసులో టీఆర్ యస్ నేతలపై ఆరా ?
-రేపు ఢిల్లీలో విచారణకు హాజరు కావాలని గంగులకు నోటీసులు
-గంగుల, రవిచంద్రతో శ్రీనివాస్ కలిసున్న ఫొటోలను గుర్తించిన సీబీఐ అధికారులు

తెలంగాణలో టీఆర్ఎస్ నేతలపై ఈడీ, సీబీఐ దాడులు కలకలం రేపుతున్నాయి. తాజాగా మంత్రి గంగుల కమలాకర్, టీఆర్ఎస్ ఎంపీ వద్దిరాజు రవిచంద్రకు సీబీఐ నోటీసులు అందించింది. ఢిల్లీలో అరెస్ట్ అయిన నకిలీ సీబీఐ అధికారి శ్రీనివాస్ కు చెందిన కేసులో నోటీసులు అందజేసింది. ఈ ఉదయం కరీంనగర్ లో గంగుల ఇంటికి సీబీఐ అధికారులు వెళ్లారు. ఆ సమయంలో ఇంట్లో గంగుల లేకపోవడంతో కుటుంబ సభ్యులకు నోటీసులు అందజేశారు. కొవ్వి రెడ్డి శ్రీనివాస్ రావు విశాఖపట్నం వాసిగా గుర్తించారు . సిబిఐ అధికారినంటూ నకిలీ గుర్తింపు కార్డుతో పలువురి వద్దకు వెళ్లి సెంట్రల్ ఏజన్సీలతో తనకు సంబంధాలు ఉన్నాయని కేసులకు సంబంధించి అన్ని తాను చూసుకుంటానని మాయమాటలు చెప్పి వారివద్ద నుంచి పెద్ద మొత్తంలో వసూళ్లకు పాల్పడుతున్నట్లుగా సిబిఐకి సమాచారం అందిందని అంటున్నారు .

రేపు ఢిల్లీలో విచారణకు హాజరుకావాలని సీబీఐ ఆ నోటీసుల్లో పేర్కొంది. నకిలీ సీబీఐ అధికారి శ్రీనివాస్ ను సీబీఐ అధికారులు రెండు రోజుల క్రితం అరెస్ట్ చేశారు. గంగుల, రవిచంద్రతో శ్రీనివాస్ కలిసున్న ఫొటోలను సీబీఐ అధికారులు గుర్తించారు. ఈ నేపథ్యంలోనే వీరిద్దరికీ నోటీసులు జారీ చేశారు. ఫోన్ డేటా ఆధారంగా సీబీఐ అధికారులు విచారణ జరుపుతున్నారు.

అయితే అరెస్ట్ అయినా నకిలీ అధికారి శ్రీనివాస్ రావు వారితో కలిసి దిగిన ఫోటోల ఆధారంగానే వీరిని పిలిచారా? లేక ఇంకేమైనా సమాచారం ఉందా? అనేది తేలాల్సి ఉంది.

Related posts

ఉత్తరాది ప్రాంతాల్లో భూ ప్రకంపనలు.. ట్విట్టర్ లో పలువురి స్పందనలు!

Drukpadam

5 హామీలిచ్చాం.. 2 గంటల్లో అమలు చేస్తాం: రాహుల్ గాంధీ

Drukpadam

ఖమ్మం జర్నలిస్టుల స్వప్నం నెరవేర్చిన చారితర్ధుడు మంత్రి అజయ్…!

Drukpadam