Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
రాజకీయ వార్తలు

రాష్ట్ర రాజకీయాలలో ప్రకంపనలు పుట్టిస్తున్న కారు పార్టీలో కబ్జాల వ్యవహారం

రాష్ట్ర రాజకీయాలలో ప్రకంపనలు  పుట్టిస్తున్న కారు పార్టీలో కబ్జాల వ్యవహారం
పథకం ప్రకారమే ఈటెల ను టార్గట్ చేశారా ?
-ఆయన్ను మంత్రి వర్గం నుంచి తప్పించనున్నారా ??
-అదే జరిగితే టీఆర్ యస్ కు లాభమా ? నష్టమా ?
-ఒక ఉద్యమకారున్ని , బీసీని సాగనంపే చర్యకు కేసీఆర్ పూనుకుంటారా???
రాష్ట్ర రాజకీయాలలో కారు పార్టీలో భూకబ్జా వ్యవహారం ప్రకంపనలు సృష్టిస్తుంది . దీనిపై రాజకీయవర్గాలలో ఆశక్తికర చర్చ జరుగుతుంది. అసలు టీఆర్ యస్ లో జరుగుతున్నా ఈ పరిణామాలపై విపక్ష పార్టీలు నిశితంగా గమనిస్తున్నాయి.
పథకం ప్రకారమే రాష్ట్ర కాబినెట్ లో సీనియర్ మంత్రి ఉద్యమ సహచరుడు మంత్రి ఈటెలను టార్గట్ చేశారా ? …… ఆయన్ను మంత్రి వర్గం నుంచి తప్పించనున్నారా ?…….. అంటే అవుననే అంటున్నారు విశ్లేషకులు . అదే జరిగితే టీఆర్ యస్ లో ఏమి జరుగుతుంది …… పార్టీకి లాభమా ? నష్టమా ? ……. ఒక ఉద్యమ కారున్ని అందునా బీసీ నాయకుడిని సాగనంపే ప్రయత్నం చేస్తారా ?…. అలంటి చర్యలకు కేసీఆర్ పూనుకుంటారా ?….. అయితే మంత్రి ఈటెలను తప్పించినందువల్ల టీఆర్ యస్ కు వెంటనే వచ్చే నష్టమేమి ఉండకపోవచ్చు …. …… కాని పెద్ద చర్చకు అవకాశం ఏర్పడుతుంది . ఇది భవిష్తలో పార్టీపై ప్రభావం చూపే అవకాశం ఉంటుంది. …. ఈటెల పై ఇప్పుడే ఎందుకు ఆరోపణలు వచ్చాయి….. దీని వెనక ఎవరు ఉన్నారు …. ముఖ్యమంత్రి కి తెలియకుండా ఒక ముఖ్యమైన కాబినెట్ మంత్రి మీద ఆరోపణలు వచ్చే అవకాశం ఉందా? ఒకవేళ ఆయన కబ్జాకు పాల్పడినా, స్థానికంగా ఎవరికీ ఫిర్యాదు చేయకుండానే రైతులు నేరుగా ముఖ్యమంత్రికే ఎందుకు ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు చేసినవాళ్లలో ఎస్సీ ,ఎస్టీ ,బీసీ లకు చెందిన అచ్చంపేట ,హకీంపేట రైతులు ఉన్నారు. ఎవరో ఒకరు పెద్దల హస్తం లేకుండా బడుగు బలహీన వర్గాలకు చెందిన రైతులు ఫిర్యాదు చేసే సాహసం చేయరని అభిప్రాయాలు ఉన్నాయి. దీని వెనక పెద్ద వ్యూహమే ఉందనే సందేహాలు సహజంగానే కలుగుతున్నాయి. ఈ సందేహాలు నివృత్తి కావాల్సిందే . నిజంగా ఈటెల భూకబ్జాకు పాల్పడితే ఆయన మీద చర్యలు తీసుకోవాల్సిందే . కాని ఉద్దేశ పూర్వకంగా చేస్తేనే తప్పు అవుతుంది. అయన భూములు లాగేసుకున్నాడా? అక్కడ భూములకు విలువవుందా ? అసలు అక్కడ ఏమి జరిగింది. అనేది విచారణలోగాని తేలదు. కేసీఆర్ రెండవసారి అధికారంలోకి వచ్చిన తరువాత మంత్రివర్గ ఏర్పాటులో ముందు ఈటల పేరు లేదనే వార్తలు వచ్చాయి. చివరలో ఆయనకు సీఎం ఆఫీస్ నుంచి కబురు వచ్చింది. లేక పొతే ఆయనకు మంత్రి వర్గంలో స్తానం ఉండేది కాదని ప్రచారం జరిగింది. కేసీఆర్ మొదటి సారి అధికారంలోకి వచ్చినప్పుడు ముఖ్యమైన ఆర్థిక శాఖను ఈటెలకు ఇచ్చారు. కాని అధికారాలన్నీ సీఎం చేతుల్లోనే ఉన్నాయనే విమర్శలు ఉన్నాయి . రెండవసారి ఆయనకు వైద్య ఆరోగ్యశాఖను అప్పగించారు. గత రెండు సంవత్సరాల కాలంలో ఆయన మంత్రిగా బాగా సేవలు అందిస్తున్నప్పటికీ ముఖ్యమంత్రికి ఈటెలకు మధ్యకు గ్యాప్ ఉందనే ప్రచారం ఉంది . దీనికి తగ్గట్లుగానే ఈటల ఒక సందర్భంలో పార్టీ మీద ఈటల లాంటి మాటలు మాట్లాడారు . పార్టీ ఎవరి జాగీరు కాదని అందరం దాని ఓనర్లమేనని, జెండాలు మోసే కార్యకర్తలే పార్టీకి నిజమైన వారసులని తన అభిప్రాయాలను కుండా బద్దలు కొట్టారు. దీనిపై పెద్ద ఎత్తున చర్చజరిగింది. తరువాత మరో సందర్భంలో పార్టీ పథకాలపై మాట్లాడిన మాటలు వివాదాస్పదం అయ్యాయి. ఆయన ఎందుకు ఆలా మాట్లాడుతున్నారు. ఒక కేబినెట్ మంత్రిగా అందులో సీనియర్ గా బాలన్స్ తప్పుతున్నారా ? అనే అభిప్రాయాలు వ్యక్తం అయ్యాయి. ఆయన అంటే ఇష్ట పడేవాళ్ళు కూడా ఈటల మాటల వెనక అంతరంగం ఏమిటనే ఆలోచనలో పడ్డారు. చాలాకాలంగా ఆయనకు ముఖ్యంత్రికి గ్యాప్ ఉందనే చర్చ జరుగుతుంది. కొన్ని సందర్భాలలో అందుబాటులో ఉన్న మంత్రిలతో జరిపే సమావేశాలకు ఈటలను ఆహ్వానించక పోవడం , ప్రత్యేకంగా వైద్య శాఖ ఉన్నతధికారులుతో కరోనా పై జరిగిన సమీక్షకు ఆయన్ని పీలవకపోవడం , ఈటల కూడా దూరంగా ఉండటం లాంటి పరిణామాలు చోటుచేసుకున్నాయి. ఈ నేపథ్యంలో ఈటల భూకబ్జా వ్యవహారం బయటకు రావడంతో రాష్ట్ర రాజకీయాల్లో సంచలనంగా మారింది. ఒకటి ,రెండు ఎకరాలు కాదు ఏకంగా 100 ఎకరాలు రాష్ట్ర కాబినెట్ మంత్రి ఈటల కబ్జా చేశారని ఆరోపణలు , మెదక్ జిల్లాకు చెందిన సాయియంపేట మండలం కు చెందిన ఎస్సీ ,ఎస్టీ ,బీసీ రైతులు ముఖ్యమంత్రికి ఫిర్యాదు చేయడం , మీడియా లో కథనాలు కరోనాతో అల్లాడుతున్న రాష్ట్ర రాజకీయాలను ఒక్కసారిగా కుదిపేశాయి.దీనిపై ముఖ్యమంత్రి వెంటనే విచారణకు ఆదేశించడం చకచకా జరిగిపోయాయి. ముఖ్యమంత్రి అసలు మంత్రిని పిలిచి విచారించారా? మంత్రికి తెలియకుండానే విచారణకు ఆదేశించారా అనేది ఇప్పుడు జరుగుతున్నా చర్చ . దీనితో ఇప్పుడు కారు పార్టీలో కబ్జా వ్యవహారం ప్రకంపనలు పుట్టిస్తుంది. ఈటల పై వేటు తప్పదని టీఆర్ యస్ వర్గాలు అంటున్నాయి. ముఖ్యమంత్రి వడివడిగా తీసుకున్న చర్యలు సైతం ఇందుకు బలాన్ని చేకూర్చున్నాయి.

Related posts

ముంబయికి తిరిగొచ్చేయండి…మాట్లాడుకుందాం రెబల్స్ కు ఉద్దవ్ బుజ్జగింపులు !

Drukpadam

రేవంత్ రెడ్డిలా పార్టీలు మారడం నాకు చేతకాదు: బండి సంజయ్…

Drukpadam

పంజాబ్ ప్రజలు విప్లవం సృష్టించారు: కేజ్రీవాల్

Drukpadam

Leave a Comment