Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
రాజకీయ వార్తలు

కాంగ్రెస్’పై పేటెంట్ తీసుకోవాల్సింది.. పొరపాటు జరిగింది: జైరామ్ రమేశ్

కాంగ్రెస్’పై పేటెంట్ తీసుకోవాల్సింది.. పొరపాటు జరిగింది: జైరామ్ రమేశ్

  • పార్టీ నుంచి బయటకు వెళ్లిన వారు కాంగ్రెస్ పేరును వాడుకుంటున్నారన్న జైరామ్
  • కాంగ్రెస్ అనే పదంపై పేటెంట్ తీసుకోకుండా తప్పుచేశామని వ్యాఖ్య
  • కాంగ్రెస్ లేకుండా బలమైన ప్రతిపక్షం అసాధ్యమన్న అభిప్రాయం

కాంగ్రెస్ పార్టీ పేరుతో ఎన్నో పార్టీలు దేశంలో పుట్టుకువచ్చి, ప్రబలంగా మారుతున్న క్రమంలో.. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడైన జైరామ్ రమేశ్ కీలక వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ పార్టీ లేకుండా ప్రతిపక్షంలో ఐక్యత ఎలా సాధ్యమని ప్రశ్నించారు. అసలు కాంగ్రెస్ పార్టీ లేకుండా ప్రతిపక్షం అన్న ఆలోచనే ఊహించడానికి అసాధ్యమన్నారు. ప్రతిపక్ష పార్టీలు పలు రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ స్థానానికి ముప్పు తెచ్చి పెడుతుండడంపైనా జైరామ్ రమేశ్ స్పందించారు.

‘‘భిన్న పార్టీలు ఎన్నో ఏళ్ల కాలలో మా నుంచి ఎంతో తీసుకున్నాయి. కానీ, మాకు ఇచ్చింది ఏమీ లేదు. కాంగ్రెస్ అనే పదంపై పేటెంట్ (మేధో హక్కు) కోరాలని నేను లోగడ చెప్పాను. ఈ విషయంలో మేము తప్పు చేశాము. నేడు కాంగ్రెస్ పార్టీ నుంచి బయటకు వచ్చిన ఎన్నో పార్టీలు కాంగ్రెస్ పేరును పెట్టుకోవడాన్ని చూస్తున్నాం’’ అని జైరామ్ రమేశ్ చెప్పారు.

వైఎస్సార్ కాంగ్రెస్, తృణమూల్ కాంగ్రెస్, నేషనలిస్ట్ కాంగ్రెస్ (ఎన్సీపీ) ఈ మూడూ లోగడ కాంగ్రెస్ పార్టీలో ఉండి, బయటకు వెళ్లిన నేతలు పెట్టినవేనని గుర్తు చేశారు. కాంగ్రెస్ పార్టీ లేకుండా బలమైన ప్రతిపక్షం అసాధ్యమని మరోసారి ఆయన చెప్పారు.

Related posts

లోకల్ మాఫియా చెలరేగిపోతోంది.. సామాన్యుడికి భద్రత కరవైంది: ఎమ్మెల్యే ఆనం!

Drukpadam

కేసీఆర్ ఫార్మ్ హౌస్ ను లక్ష నాగళ్లతో దున్ని, పేదలకు పంచుతాం: బండి సంజయ్!

Drukpadam

హస్తానికి ట్రబుల్ షూటర్ల కొరత …కాంగ్రెస్ లో సంక్షోభం…

Drukpadam

Leave a Comment