Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
రాజకీయ వార్తలు

మళ్ళీ .రెండు రాష్ట్రాల సీఎంల  సెంటిమెంట్  డ్రామాలు …బండి సంజయ్ విమర్శ!

మళ్ళీ .రెండు రాష్ట్రాల సీఎంల  సెంటిమెంట్  డ్రామాలు …బండి సంజయ్ విమర్శ!
కవిత లిక్కర్ స్కాం నుంచి దృష్టి మరల్చేందుకు, కేసీఆర్ వైసీపీ నేతలతో కలిసి కుట్ర చేస్తున్నారు
ఉమ్మడి ఏపీకే తమ ఓటు అన్న సజ్జల
స్పందించిన బండి సంజయ్
తెలంగాణ సెంటిమెంట్ రగిల్చే ప్రయత్నమని ఆరోపణ

రాష్ట్ర విభజనకు తాము వ్యతిరేకమని, ఇప్పటికీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నే కోరుకుంటామని ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి చేసిన వ్యాఖ్యలపై తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్ స్పందించారు. సజ్జల వ్యాఖ్యల వెనుక కేసీఆర్ ప్రయోజనాలు దాగి ఉన్నాయని తెలిపారు.

జగిత్యాలలో ఆయన మీడియాతో మాట్లాడుతూ, కేసీఆర్ కుమార్తె కవిత రూ. లక్ష కోట్ల లిక్కర్ దందా చేశారని, కవిత ఢిల్లీ లిక్కర్ స్కాం నుంచి ప్రజల దృష్టి మరల్చేందుకే కేసీఆర్ వైసీపీ నేతలతో కలిసి కుట్రలు చేస్తున్నాడని బండి సంజయ్ ఆరోపించారు.

రెండు రాష్ట్రాల సీఎంలు కలిసి డ్రామాలు ఆడుతున్నారని విమర్శించారు. వారిద్దరూ కలిసే ఉన్నారని, కమీషన్లు పంచుకుంటారని బండి సంజయ్ వ్యాఖ్యానించారు. ఏపీ సీఎంతో మాట్లాడి వైసీపీ నాయకుడితో ఈ వ్యాఖ్యలు చేయించారని వివరించారు. సజ్జల వ్యాఖ్యలతో తెలంగాణ సెంటిమెంట్ ను మళ్లీ రగిల్చేందుకు కేసీఆర్ ప్రయత్నం చేస్తున్నారని తెలిపారు. కవిత పై చర్యలు తప్పవని హెచ్చరించారు . కేసీఆర్ , జగన్ లు కలిసే ఉన్నారని పేర్కొన్నారు .

Related posts

పొంగులేటి ఆధ్వరంలో కలక్టరేట్ కు రైతు భరోసా యాత్ర ఉద్రిక్తత…

Drukpadam

కమ్మ జాతికిది అవమానం…కాట్రగడ్డ ప్రసూన!

Drukpadam

ఖమ్మం మేయర్ గా సీల్డ్ కవర్ లో పేరెవరిది ?

Drukpadam

Leave a Comment