Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
రాజకీయ వార్తలు

ఉమ్మడి ఖమ్మం జిల్లాలో లెఫ్ట్ కు ఐదు సీట్లు ?…టీఆర్ యస్ కు ఐదు …??

ఉమ్మడి ఖమ్మం జిల్లాలో లెఫ్ట్ కు ఐదు సీట్లుటీఆర్ యస్ కు ఐదు …?
బీఆర్ యస్ తో లెఫ్ట్ పార్టీల పొత్తు పై అంగీకారం దిశగా అడుగులు
భద్రాచలం, మధిర , పాలేరు పై సిపిఎం , కొత్తగూడెం ,వైరా పై సిపిఐ గురి
నల్లగొండ జిల్లాలో రెండు సీట్లపై లెఫ్ట్ పట్టురంగారెడ్డి , కరీంనగర్ ఉమ్మడి జిల్లాల్లో సీట్లపై కసరత్తు .రెండు పార్టీలకు ఐదు నుంచి 10 సీట్ల మధ్య ఒప్పందం కుదిరే అవకాశం ..

రాష్ట్రంలో తిరిగి అధికారంలోకి రావాలనే దిశగా వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్న బీఆర్ యస్ అధినేత కేసీఆర్ లెఫ్ట్ పార్టీలతో కలిసి వెళ్లాలనే గట్టినిర్ణయానికి వచ్చారని విశ్వసనీయ సమాచారం . 2023 లో రాష్ట్ర అసెంబ్లీకి ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఆరునెలలు ముందుగానే అభ్యర్థులను ప్రకటిస్తానని చెప్పిన గులాబీ బాస్ లెఫ్ట్ పార్టీలకు ఇచ్చే సీట్లపై కూడా కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తుంది. అయితే లెఫ్ట్ తో పొత్తు ఉంటె సుమారు 25 నుంచి 30 నియోజకవర్గాల్లో వారి ప్రభావం ఉంటుందని కేసీఆర్ అంచనా వేస్తున్నారు . ఇంటలిజెన్స్ వర్గాలు కూడా అదే చెబుతున్నట్లు తెలుస్తుంది. గులాబీ పార్టీకి బలమైన నియోజకవర్గాలుగా ఉండి సిట్టింగ్ స్థానాలు అయినప్పటికీ సిట్టింగులకు ప్రత్యాన్మాయ మార్గాలు చూపడం ద్వారా కమ్యూనిస్టులతో కలిసి వెళ్లాలనే నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తుంది. ఆమేరకు సిట్టింగులకు సైతం గట్టి హామీ ఇచ్చి కన్విన్స్ చేయాలనీ చూస్తున్నారు . ప్రధానంగా ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఐదు సీట్లు , నల్లగొండ లో 3 నుంచి నాలుగు సీట్లు , కరీంనగర్ , రంగారెడ్డి జిల్లాల్లో ఒక్కొక్క సీటు ఇచ్చే అవకాశాలను తోసిపుచ్చలేమని రాజకీయ పరిశీలకుల అభిప్రాయంరెండు పార్టీలలోని ముఖ్యనేతలు సైతం బీఆర్ యస్ ,లెఫ్ట్ పొత్తులను తోసిపుచ్చడం లేదు . ఆలా అని ఫైనల్ అయినట్లు చెప్పడం లేదు . పైగా లెఫ్ట్ కోరే సీట్లలో కొన్ని సిట్టింగులు అయినప్పటికీ గులాబీ బాస్ కు స్థానిక తగాదాలు తలనొప్పిగా ఉన్నాయి . తలనొప్పిని తగ్గించుకోవడం కోసం కూడా లెఫ్ట్ కు ఇవ్వాలనే ఆలోచనకు కేసీఆర్ వచ్చినట్లు ప్రచారం జరుగుతుంది.

భారతీయ రాష్ట్ర సమితి పేరుతో జాతీయ పార్టీ పెట్టిన కేసీఆర్ కు లెఫ్ట్ పార్టీల అవసరం మరింతగా ఉంది . జాతీయ స్థాయిలో నమ్మకమైన మిత్రుల కోసం కేసీఆర్ అన్వేషిస్తున్నారు . వివిధ రాష్ట్రాల్లో ఉన్న స్థానిక పార్టీలతో పాటు వామపక్ష పార్టీలకు దేశవ్యాపితంగా ఉన్న సంబంధాలను ఇందుకు వినియోగించుకోవాలని యోచనలో ఉన్నారు . అందుకే పార్టీ పెట్టె ఆలోచనలో ఉన్నప్పుడే జాతీయ స్థాయిలో వివిధ పార్టీల నేతలను కలవడంతో పాటు సిపిఎం , సిపిఐ జాతీయకార్యదర్శులతో ప్రత్యేక సమావేశాలు ఏర్పాటు చేశారు . ఒక్క తెలంగాణలోనే కాకుండా దేశవ్యాపితంగా లెఫ్ట్ ఇతర పార్టీల సహకారం లేకుండా బీఆర్ యస్ మనగడ సాధ్యమయ్యే అవకాశాలు లేవు . ఇది కేసీఆర్ కు సైతం తెలియని విషయం కాదు . ఇప్పటికైతే ఒక్క కర్ణాటక రాష్ట్రానికి చెందిన జేడీఎస్ నేత మాజీ సీఎం కుమారస్వామి మాత్రమే బీఆర్ యస్ ఆవిర్భావ సభకు వచ్చారు .జార్ఖండ్ సీఎం కూడా కేసీఆర్ తో టచ్ లో ఉన్నా అక్కడ ఉన్న రాజకీయపరిస్థితుల నేపథ్యంలో ఆయన బయటకు రాలేక పోతున్నారని సమాచారం . అందువల్ల తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు కేసీఆర్ కు ప్రతిష్టాత్మకంగా మారాయి . ఇక్కడ బీఆర్ యస్ తో కలిసి వచ్చే శక్తుల్లో లెఫ్ట్ పార్టీలే కనిపిస్తున్నాయి. ఇటీవల జరిగిన మునుగోడు ఉపఎన్నికలో సైతం లెఫ్ట్ మద్దతు లేకపోతె గులాబీ పార్టీ గెలుపు సాధ్యమయ్యేది కాదని తెలుసుకున్న కేసీఆర్ వారి స్నేహాన్ని కోరుకుంటున్నారు . చూద్దాం ఏమి జరుగుతుందో

Related posts

మోదీ.. థాకరే మధ్య ఇంకా మంచి సంబంధాలే ఉన్నాయి: సంజయ్‌ రౌత్‌…

Drukpadam

సుపరిపాలన కోసం మంచి నిర్ణయం…మాజీ ఎంపీ పొంగులేటి…

Drukpadam

నిర్మల్ సభలో బీజేపీ ప్రస్తావన తీసుకురాకుండా కాంగ్రెస్ నే టార్గెట్ చేసిన కేసీఆర్…

Drukpadam

Leave a Comment