Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
రాజకీయ వార్తలు

బీజేపీతో పొత్తుకోసమేనా..? చంద్రబాబు ఖమ్మం సభ….!

బీజేపీతో పొత్తుకోసమేనా..? చంద్రబాబు ఖమ్మం సభ….!
-తెలంగాణ రాజకీయాలను పట్టించుకోని చంద్రబాబు
-స్పీడ్ పెంచిన టీడీపీ…పాతకాపులను టీడీపీలోకి అహానిస్తున్న వైనం
-ఏపీలో అధికారంలోకి రావాలంటే బీజేపీ సహకారం తప్పనిసరి అని భావించిన చంద్రబాబు ..
-2019 ఎన్నికలకు ముందు బీజేపీ తో తెగ తెంపులు చేసుకున్న టీడీపీ
-ఫలించని పవన్ కళ్యాణ్ ద్వారా రాయభారం ..
-నేరుగా రంగంలోకి దిగిన చంద్రబాబు …

రాజకీయాల్లో ఎప్పడు ఏమి జరుగుతుందో చెప్పలేము …మిత్రులు …శత్రువులు …శత్రువులు మిత్రులు అవుతారు …కచ్చితంగా అదే జరుగుతుంది ..టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఈనెల 21 న ఖమ్మం లో బహిరంగ సభ పెట్టారు . ఉమ్మడి ఖమ్మం జిల్లా నేతలు బాబు సభ ఏర్పాట్లలో నిమగ్నమైయ్యారు . కొందరు పాతకాపులను తిరిగి పార్టీలోకి తీసుకోని రావాలని ప్రయత్నాలు చేస్తున్నారు . ప్రజల సమీకరణకు కూడా ముమ్మర ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇందుకు టీడీపీ లో పదవులు అనుభవించిన నేతల సహకారం కూడా తీసుకుంటున్నట్లు సమాచారం .

తెలంగాణ రాష్ట్ర రాజకీయాలకు కొంతకాలంవరకు దూరంగా ఉన్న చంద్రబాబు తెలంగాణపై ఎందుకు ద్రుష్టి సారించారనేది ఆసక్తిగా మారింది. ఖమ్మం సభ తో తెలంగాణాలో టీడీపీ సహకారం ఉంటె బీజేపీ అధికారంలోకి వస్తుందనే బలమైన అభిప్రాయం కల్గించటం ద్వారా ఏపీలో బీజేపీ సహకారం తీసుకోవాలని చంద్రబాబు ఎత్తులు వేస్తున్నారు . ఈ విషయాన్నీ టీడీపీ వర్గాలు కూడా అంగీకరిస్తున్నాయి . ఈసారి ఏపీ,తెలంగాణాలలో బీజేపీ తో తమపార్టీ పొత్తు ఖాయమని అంటున్నారు తెలుగు తమ్ముళ్లు .

2019 ఎన్నికల్లో …2014 ఎన్నికల్లో బీజేపీ సహకారంతో ఏపీలో అధికారంలోకి వచ్చిన చంద్రబాబు 2019 ఎన్నికల్లో బీజేపీతో టీడీపీ తెగదెంపులు చంద్రబాబు కు నష్టం కల్గించాయి . ఆ ఎన్నికల్లో టీడీపీ ఘోర పరాజయం పాలైంది.

నాటి నుంచి జగన్ సర్కార్ పై పోరాడుతున్న చంద్రబాబు జగన్ ను ఎదుర్కొనేందుకు తమ బలం సరిపోదని గ్రహించినట్లు ఉన్నారు .అందువల్ల జనసేన పవన్ కళ్యాణ్ , బీజేపీపార్టీతో పొత్తు పెట్టుకోవడం ద్వారా ఏపీలో తిరిగి అధికారంలోకి రావాలని వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు . అయితే బీజేపీ అందుకు సుముఖంగా లేదనే ప్రచారం జరుగుతుంది. టీడీపీ తో పొత్తు విషయంలో పవన్ కళ్యాణ్ ఆలోచనలు తెలుసుకునేందుకు విశాఖకు పిలిపించిన పీఎం మోడీ ఏపీ రాజకీయాలు బీజేపీ వైఖరిపై స్పష్టత ఇచ్చినట్లు సమాచారం . పీఎం మోడీతో కలిసిన తర్వాత పవన్ కళ్యాణ్ మాటల్లో కూడా తేడా వచ్చిందని పరిశీలకుల భావన .

తెలంగాణాలో టీడీపీ బీజేపీకి మద్దతు ఇవ్వడం వల్ల గులాబీ పార్టీతో యుద్దానికి సిద్దపడుతున్నారు. బీజేపీ తో కలిసే పోటీ చేసేందుకు ఆసక్తిగా ఉన్న బాబు అన్ని వైపులనుంచి బీజేపీ పై వత్తిడి తెస్తున్నారు .అందులో భాగంగానే పవన్ కళ్యాణ్ ద్వారా రాయబారం నడిపారు . అది వికటించడంతో నేరుగా చంద్రబాబే రంగంలోకి దిగారు . ఇటీవల ఢిల్లీలో జి -20 దేశాల అధ్యక్ష భాద్యతలు తీసుకున్న సందర్భంగా ప్రధానిని కలిసి మాట్లాడారు. ఇందులో టీడీపీ నేత చంద్రబాబు ఎంతవరకు సక్సెస్ అవుతారో చూడాలి మరి …!

Related posts

పవర్ షేరింగ్ ఫార్ములాను నేను బయటకు చెప్పను!: డీకే శివకుమార్…

Drukpadam

బీజేపీ పై తీవ్రస్వరంతో ధ్వజమెత్తిన కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ!

Drukpadam

ఆందోళనలో పాల్గొన్నవారికి ఉద్యోగం నో

Drukpadam

Leave a Comment