Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
రాజకీయ వార్తలు

దేశరాజధాని ఢిల్లీలో బీఆర్ యస్ హడావుడి …

దేశరాజధాని ఢిల్లీలో బీఆర్ యస్ హడావుడి …
కార్యాలయం ప్రారంభం.. జెండాను ఎగురవేసిన కేసీఆర్
కార్యాలయం వద్ద రాజశ్యామల యాగాన్ని నిర్వహించిన కేసీఆర్
అనంతరం జెండాను ఆవిష్కరించి, తన ఛాంబర్ లో కూర్చున్న బీఆర్ఎస్ అధినేత
బీఆర్ఎస్ కార్యాలయం వద్ద నెలకొన్న సందడి
పాల్గొన్న యూపీ మాజీ సీఎం , కర్ణాటక మాజీ సీఎం కుమారస్వామి
పలువురు రైతుసంఘ నేతలు ,ఎంపీలు ,మంత్రులు ఎమ్మెల్యేలు,ఎమ్మెల్సీలు

భారతదేశ రాజకీయాల్లో మరో జాతీయపార్టీ దేశరాజధాని ఢిల్లీలో తన కార్యకలాపాలను అట్టహాసంగా ప్రారంభించింది .

ఢిల్లీలో బీఆర్ఎస్ జాతీయ కార్యాలయం ఏర్పాటు కార్యక్రమం అట్టహాసంగా జరిగింది. కార్యాలయంలో బీఆర్ఎస్ అధినేత, తెలంగాణ సీఎం కేసీఆర్ దంపతులు రాజశ్యామల యాగాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి అఖిలేశ్ యాదవ్, కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామిలు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.

వీరితో పాటు వివిధ రాష్ట్రాలకు చెందిన పలువురు నేతలు, రైతు సంఘాల నేతలు తరలి వచ్చారు. యాగం పూర్తయిన వెంటనే బీఆర్ఎస్ జెండాను కేసీఆర్ ఆవిష్కరించారు. అనంతరం కార్యాలయంలోని తన ఛాంబర్ కు కేసీఆర్ వెళ్లారు. ఈ సందర్భంగా అక్కడ సందడి నెలకొంది.

ఏపీ బాధ్యతలను తలసానికి అప్పగించిన కేసీఆర్

  • ఏపీ బాధ్యతలను తలసానికి అప్పగించిన కేసీఆర్
  • హైదరాబాద్ లో ఉన్న ఏపీ ప్రముఖులతో సంప్రదింపులు జరుపుతున్న వైనం
  • తెలుగు ప్రజలు ఎక్కువగా ఉండే రాష్ట్రాల్లో పోటీ చేయాలనే యోచన
KCR appoints Talasani as BRS AP incharge

తెలంగాణ ఉద్యమ పార్టీ టీఆర్ఎస్ జాతీయ పార్టీగా మారింది. బీఆర్ఎస్ పేరుతో జాతీయ రాజకీయాల్లోకి అడుగుపెట్టింది. దేశ వ్యాప్తంగా క్రమంగా వివిధ రాష్ట్రాల్లోకి విస్తరించాలనే యోచనలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఉన్నారు. ఏపీలో సైతం సత్తా చాటాలని పట్టుదలతో ఉన్నారు. బీఆర్ఎస్ ఏపీ బాధ్యతలను మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ కు అప్పగించినట్టు సమాచారం. సంక్రాంతికి ఏపీలో బీఆర్ఎస్ అడుగుపెట్టబోతోంది.

ఈ క్రమంలో అమరావతిలో భారీ బహిరంగసభను నిర్వహించాలని కేసీఆర్ భావిస్తున్నట్టు తెలుస్తోంది. బహిరంగసభ బాధ్యతలను కూడా తలసానికి కేసీఆర్ అప్పగించారు. ఏపీ మూలాలు ఉండి హైదరాబాద్ లో ఉన్న ప్రముఖులతో కేసీఆర్ ఇప్పటికే సంప్రదింపులు జరిపారు. జాతీయ పార్టీ అధికారిక గుర్తింపు కోసం తెలుగు ప్రజలు ఎక్కువగా ఉండే రాష్ట్రాల్లో తొలుత పోటీ చేయాలనే యోచనలో కేసీఆర్ ఉన్నారు. తొలి దశలో ఏపీ, కర్ణాటక, తమిళనాడు, మహారాష్ట్రలో పోటీ చేయాలని భావిస్తున్నారు.

Related posts

మా గవర్నర్‌ ఓ అవినీతిపరుడు: మమతా బెనర్జీ సంచలన వ్యాఖ్యలు

Drukpadam

కేంద్రంపై యుద్ధమే …కార్యాచరణపై వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులతో కేసీఆర్ మంతనాలు

Drukpadam

కర్ణాటక విజయం …ఖమ్మం లో కాంగ్రెస్ సంబరాలు…

Drukpadam

Leave a Comment