Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఆంధ్రప్రదేశ్

యాదాద్రిలో ప్రవేట్ హెలికాఫ్టర్ కు పూజలు …ఎగబడ్డ జనం

యాదాద్రిలో ప్రైవేటు హెలికాప్టర్‌కు పూజలు.. చూసేందుకు ఎగబడిన జనం!

  • హెలికాప్టర్‌ను కొనుగోలు చేసిన బోయినపల్లి శ్రీనివాసరావు
  • యాదాద్రి పెద్దగుట్టపై ప్రత్యేక పూజలు
  • పాల్గొన్న శ్రీనివాసరావు, సీహెచ్ విద్యాసాగర్, కుటుంబ సభ్యులు

సాధారణంగా కొత్త వాహనాలను ప్రారంభించడానికి ముందు పూజలు చేయడం సర్వసాధారణ విషయమే. తెలంగాణలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన యాదాద్రిలో నిత్యం వాహన పూజలు జరుగుతుంటాయి. అయితే, తొలిసారి ఓ హెలికాప్టర్‌కు ఇక్కడ ప్రత్యేక పూజలు నిర్వహించారు.

కరీంనగర్‌కు చెందిన ప్రతిమా ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ ఎండీ, హైదరాబాద్ ఎయిర్‌ లైన్స్ ప్రైవేటు లిమిటెడ్ డైరెక్టర్ బోయినపల్లి శ్రీనివాసరావు ఈ హెలికాప్టర్‌ను కొనుగోలు చేశారు. యాదాద్రి పెద్దగుట్టపై నిన్న ఈ హెలికాప్టర్‌కు పూజారులు పూజలు చేశారు. చాపర్ యజమాని బోయినపల్లి శ్రీనివాసరావు, మహారాష్ట్ర మాజీ గవర్నర్ సీహెచ్ విద్యాసాగర్‌ రావుతోపాటు వారి కుటుంబ సభ్యులు ఈ పూజల్లో పాల్గొన్నారు. హెలికాప్టర్‌ను చూసేందుకు ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చారు.

Related posts

ఆకాశ, భూ మార్గాల్లో వరంగల్ మెట్రో.. డీపీఆర్ రూపొందించిన మహారాష్ట్ర మెట్రో…

Drukpadam

సమంతను ప్రీతమ్ జుకాల్కర్ జీజీ అని పిలిచేవారు …జీ జీ అంటే అక్క: మేకప్ ఆర్టిస్ట్ సాధనా సింగ్ …

Drukpadam

కమ్యూనిస్టు సిద్ధాంతం మాత్రమే ప్రజల అవసరాలను గుర్తిస్తుంది .. కూనంనేని

Ram Narayana

Leave a Comment