Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
రాజకీయ వార్తలు

రాజకీయ హీట్ పెంచనున్న 2023 …టెంపర్ తనం తగ్గిన బీఆర్ యస్!

రాజకీయ హీట్ పెంచనున్న 2023 …టెంపర్ తనం తగ్గిన బీఆర్ యస్!
-జాతీయపార్టీ గుర్తింపు పొందాలంటే ఎన్నికల సంఘం నియమాలు పూర్తి చేయాలి
-ఎన్నికలకు మరికొద్ది నెలలే ఉండటంతో పార్టీల ఉరుకుల పరుగులు
-ఇప్పటికి తెలంగాణాలో బలమైన పార్టీగానే బీఆర్ యస్
-కమ్యూనిస్టుల కలయిక అదనపు బలం
-పాగా వేసేందుకు బీజేపీ తీవ్ర ప్రయత్నాలు
-అందుకే ఉపఎన్నికలు తెచ్చిపెడుతున్న వైనం
-కాంగ్రెస్ లో అంతర్గత కుమ్ములాటలు మైనస్ గా మారె అవకాశం

2023 చివరిలో తెలంగాణ అసెంబ్లీకి ఎన్నికలు జరగనున్నాయి. దీంతో 2023 కచ్చితంగా రాజకీయ హీట్ ను పెంచనున్నది . తెలంగాణ ఏర్పడిన తర్వాత మూడవసారి జరుగుతున్నఎన్నికల్లో మరోసారి అధికారంలోకి రావాలని నాటి టీఆర్ యస్ నేటి బీఆర్ యస్ పధక రచన చేస్తుంది. అయితే ఈసారి అంతా తేలికైన విషయం కాదంటున్నారు రాజకీయ విశ్లేషకులు . పార్టీ పేరులో టీఆర్ యస్ లో ఉన్నంత వాడి వేడి బీఆర్ యస్ పేరులో కనిపించడంలేదు. దీంతో గులాబీ పార్టీలో టెంపర్ తనం తగ్గింది. అయితే కమ్యూనిస్టులతో కలిసి పోటీచేయాలని గులాబీ బాస్ నిర్ణయం బీఆర్ యస్ కు కచ్చితంగా అదనపు బలంగా మారబోతుందనే అభిప్రాయాలు ఉన్నాయి. మునుగోడులో కమ్యూనిస్టులు లేకపోతె బీఆర్ యస్ పరిస్థితి దారుణంగా ఉండేదని అభిప్రాయాలు గులాబీ శ్రేణులు సైతం వ్యక్తం చేస్తున్నాయి. బీజేపీ తెలంగాణాలో ఏ ఎన్నిక వచ్చినా, అవకాశాన్ని జారవిడవకుండా గులాబీ పార్టీకి సవాల్ విసురుతుంది. దుబ్బాక , హుజారాబాద్ ఉపఎన్నికల్లో గెలుపు , జి ఎచ్ ఎం సి ఎన్నికలల్లో గెలుపు అంచులకు రావడం బీజేపీ ఆశలను చిగురింప చేసింది. ఇటీవల మునుగోడులో జరిగిన ఎన్నికల్లో సైతం బలమైన అభ్యర్థిని కాంగ్రెస్ నుంచి లాక్కొని గెలుపు దగ్గరకు వచ్చి ఓటమి పాలైంది. దీంతో ఆపార్టీ దక్షిణాదిన తెలంగాణపై ఫోకస్ పెట్టింది. బీఆర్ యస్ , కాంగ్రెస్ లో ఉన్న అసంతృప్త నేతలకు గాలం వేస్తుంది. ఎమ్మెల్యేల కొనుగులుకు చేసిన ప్రయత్నం వికటించింది .

ఇక కాంగ్రెస్ పార్టీకి ప్రజలు ఓట్లు వేద్దామని అనుకున్నా వారిలో వారికీ తన్నులాటలతో పార్టీ అభాసు పాలౌతుంది. పొరపాటున కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి ఓటు వేసి గెలిపించినా, గెలిచిన తర్వాత పార్టీలో ఉంటాడనే నమ్మకంలేదు .ఎన్నికల నాటికీ పార్టీని హైకమాండ్ గాడిలో పెట్టగలిగితే బీజేపీకన్నా మంచి ఫలితాలు సాధించే అవకాశాలు ఉన్నాయి. సీనియర్లు ,జూనియర్లు మధ్య తగాదాలు అధిష్టానానికి సైతం తలనొప్పిగా మారాయి. ఇక్కడ తలనొప్పిని తగ్గించేందుకు చికిత్స నిమిత్తం ఏఐసీసీ రాజకీయ కురువృద్ధుడు దిగ్విజయ్ సింగ్ ను పంపించింది అధిష్టానం . ఆయన ఇక్కడ పరిస్థితులను వివరిస్తూ అధిష్టానానికి నివేదిక అందించారు .దానిపై ఎలాంటి చర్యలను అధిష్టానం తీసుకుంటుందో అనే ఆత్రుత నాయకుల్లో ఉంది.

రాజకీయాల్లో చాణిక్యుడిగా భావిస్తున్న కేసీఆర్ భారత రాష్ట్ర సమితి ఎందుకు పెట్టాల్సి వచ్చిందనే దానిపై క్లారిటీ లేక పార్టీ నేతల్లో అసంతృప్తి కనిపిస్తుంది. పార్టీలోని నాయకులు అంతా కేసీఆర్ నిర్ణయానికి తలలు ఊపుతున్నా దానిపై వారికీ మింగుడు పడని విషయంగానే ఉంది .

తెలంగాణ రాష్ట్ర సాధనలో కీలక పాత్ర పోషించిన కేసీఆర్ ప్రజల ఆశలు ఆకాంక్షలు సాకారం కాకుండానే బీఆర్ యస్ పేరుతో జాతీయ పార్టీ రిజిస్టర్ చేయించడంపై భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. పేరుకు జాతీయ పార్టీ అయినప్పటికీ దానికి ఇంకా జాతీయ హోదా రాలేదు . జాతీయహోదా రావాలంటే దానికి కొన్నికేంద్ర ఎన్నికల సంఘ నియమనిబంధనలు ఉన్నాయి. అవి ఏంటో చూద్దాం …

జాతీయ పార్టీగా గుర్తింపు పొందాలంటే..?

ఒక పార్టీ జాతీయ పార్టీగా గుర్తింపు పొందాలంటే కేంద్ర ఎన్నికల సంఘం నిబంధన -1968 ప్రకారం ( ఈ నిబంధనను కాలానుగుణంగా మార్చుతున్నారు) చివరగా జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో పార్లమెంట్ లేదా అసెంబ్లీ స్థానాల్లో నాలుగు లేదా అంతకంటే ఎక్కువ రాష్ట్రాల్లో అభ్యర్థులు పోటీ చేయాలి. ఎన్నికల్లో పోలై చెల్లిన ఓట్లలో ఆరు శాతం ఓట్లు సాధించాలి. 

దీనితోపాటు ఏదైనా ఒక రాష్ట్రం లేదా రాష్ట్రాల నుంచి కనీసం నలుగురు అభ్యర్థులు ఎంపీలుగా ఎన్నికవ్వాలి. లేదా కనీసం నాలుగు రాష్ట్రాల్లో ప్రాంతీయ పార్టీగా గుర్తింపు పొందాలి
గత సాధారణ ఎన్నికల్లో లోక్‌సభలోని మొత్తం సీట్లలో కనీసం రెండు శాతం సీట్లను గెలుచుకొని ఉండాలి. గెలుపొందిన అభ్యర్థులు మూడు రాష్ట్రాల నుంచి ఎన్నికవ్వాలి. అందువల్ల బీఆర్ యస్ పెట్టిన కేసీఆర్ పార్టీకి ఇంకా జాతీయహోదా రాలేదు .

ఈ నేపథ్యంలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీలు వేసే ఎత్తులు జిత్తులతో , ఫలితాలు ఎలా ఉండబోతున్నాయనే ఆసక్తి నెలకొన్నది….!

Related posts

సీఎం గారూ… రేపటి మీ ఢిల్లీ యాత్ర దేనికి స్వామి :వర్ల

Drukpadam

బీజేపీలోకి ఈటల.. త్వరలోనే బీజేపీ చీఫ్ నడ్డాతో భేటీ!

Drukpadam

త్వరలో జేపీ నడ్డా, అమిత్ షా తెలంగాణ పర్యటన…

Drukpadam

Leave a Comment