Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఆంధ్రప్రదేశ్

ఇవి తింటే చలికాలంలోనూ విటమిన్ డి తగ్గదు!

ఇవి తింటే చలికాలంలోనూ విటమిన్ డి తగ్గదు!

  • మానవ దేహానికి అత్యంత కీలకం విటమిన్ డి
  • ప్రధానంగా సూర్యరశ్మి ద్వారా లభించే విటమిన్
  • కండరాలు, ఎముకల పటుత్వానికి ఇదే ఆధారం
  • చలికాలంలో పలువురిలో విటమిన్ డి లోపం
  • తగిన పోషకాహారంతో లోపాన్ని అధిగమించవచ్చంటున్న నిపుణులు

మనిషి ఆరోగ్యానికి అత్యంత ముఖ్యమైన విటమిన్ డి ప్రధానంగా సూర్యరశ్మి ద్వారా లభిస్తుందన్న సంగతి తెలిసిందే. అయితే చలికాలంలో ఎండ తక్కువగా ఉంటుంది. దాంతో చాలామందిలో విటమిన్ డి లోపం తలెత్తుతుంది. ఇలాంటి వాళ్లు సరైన పోషకాహారం తీసుకుంటే విటమిన్ డి లోపాన్ని అధిగమించవచ్చని నిపుణులు చెబుతున్నారు.

శరీరంలో కండరాలు, ఎముకలు, దంతాలు దృఢంగా ఉండాలంటే విటమిన్ డి తప్పనిసరి. అంతేకాదు, విటమిన్ డి మనిషి శరీరంలోని కాల్షియం, ఫాస్పేట్ వంటి ఖనిజలవణాలను కూడా నియంత్రిస్తుంది. విటమిన్ డి లోపిస్తే ఎముకలు బలహీనపడి, ఆస్టియోపొరోసిస్ వంటి రుగ్మతలకు దారితీస్తుంది. ఎముకలు పెళుసుగా మారి తేలిగ్గా విరిగిపోతుంటాయి.

అంతేకాదు, పిల్లల్లో విటమిన్ డి లోపం తీవ్రస్థాయిలో ఉంటే రికెట్ వ్యాధికి దారితీస్తుందని, ఎముకలు గట్టిపడాల్సింది పోయి మెత్తబడతాయని నిపుణులు చెబుతున్నారు. అందుకే, విటమిన్ డి లోపాన్ని తేలిగ్గా తీసుకోరాదని వెల్లడించారు.

చలికాలంలో ఈ లోపాన్ని ఆహారంతో నివారించవచ్చని తెలిపారు. పుట్టగొడుగులు, సాల్మన్ చేపలు, టూనా చేపలు, పాలు, పాల ఉత్పత్తులు, కమలా పండ్లు, ధాన్యాలు, కోడిగుడ్లు, క్యాబేజి, కాడ్ లివర్ ఆయిల్, బీఫ్ లివర్ వంటి ఆహార పదార్థాలను తీసుకోవడం ద్వారా విటమిన్ డి పొందవచ్చు.

ఆహారం ద్వారా కంటే సూర్యరశ్మిలో ఉండడం ద్వారా మరింత మెరుగైన రీతిలో ఈ కీలక విటమిన్ పొందవచ్చని, చలికాలంలో పగటి వేళల్లో వీలైనంత సమయం ఎండలో ఉండాలని సూచిస్తున్నారు. ఒకవేళ విటమిన్ డి లోపం తీవ్రంగా ఉంటే డాక్టర్ల సలహా తీసుకున్న తర్వాతే మాత్రల రూపంలో వాడాలని నిపుణులు స్పష్టం చేశారు.

Related posts

ఈ అలవాట్లతో కిడ్నీలకు డేంజర్!

Drukpadam

భారత్ దేశం వారిదే కాదు నాకుకూడా చెందుతుంది …. జమియత్ ఉలేమా చీఫ్!

Drukpadam

కోడి పందేల మెయిన్ ఆర్గనైజర్ చింతమనేని ప్రభాకరే: పఠాన్ చెరు డీఎస్పీ

Drukpadam

Leave a Comment