Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
రాజకీయ వార్తలు

పాలేరునుంచి తిరిగి కందాల పోటీ ..మంత్రి ప్రశాంత రెడ్డి….!

పాలేరునుంచి తిరిగి కందాల పోటీ ..మంత్రి ప్రశాంత రెడ్డి….!
-ఆయన సీఎం కేసీఆర్ కు చాలా సన్నిహితుడు …
-ఉమ్మడి ఖమ్మం జిల్లాలో 10 కి 10 సీట్లు గెలిచి సీఎంకు కానుకగా ఇవ్వాలి …మంత్రి పువ్వాడ
-అన్ని నియోజకవర్గాల్లో గెలుపే లక్ష్యంగా పనిచేయాలి
-కేసీఆర్ ఆధ్వరంలో తెలంగాణ దేశంలోనే నెంబర్ వన్
-దేశమంతా తెలంగాణ వైపు చూస్తుంది

పాలేరు నుంచి తిరిగి కందాల ఉపేందర్ రెడ్డి బీఆర్ యస్ అభ్యర్థిగా పోటీచేస్తారని రాష్ట్ర రోడ్ల ,భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంతారెడ్డి ప్రకటించారు .లెఫ్ట్ పార్టీలతో పొత్తులు ఉంటాయని పాలేరులో బీఆర్ యస్ , లెఫ్ట్ పార్టీల పొత్తులో భాగంగా పాలేరు సీపీఎంకు కేటాయిస్తారని జరుగుతున్న ప్రచారం నేపథ్యంలో ఖమ్మం రూరల్ మండలం రామన్నపేట లో జరిగిన బహిరంగసభలో ఆయన చేసిన ప్రకటనకు ప్రాధాన్యత సంతరించుకుంది. ఎన్నికలకు మరో 10 నెలల సమయం ఉంది. పాలేరులో తిరిగి కందాల పోటీ గురించి మంత్రి ప్రశాంత రెడ్డి ఎందుకు ప్రకటించినట్లు …సీఎం అనుమతితో చెప్పారా ? లేక సొంత నిర్ణయమా ? అనేదానిపై సందేహాలు ఉన్నాయి. సీఎం కేసీఆర్ ముందు ఎలాంటి పప్పులు ఉడకవు …సిట్టింగ్ లందరికి టికెట్స్ ఇస్తామని అన్నందున సిట్టింగ్ అయిన కందాల ఉపేందర్ రెడ్డి అభ్యర్థి అవుతారని ఆలా చెప్పి ఉండవచ్చుననే అభిప్రాయాలూ కూడా ఉన్నాయి. లెఫ్ట్ పార్టీల బలంతో 25 నుంచి 30 అసెంబ్లీ నియోజకవర్గాల్లో బీఆర్ యస్ గెలిచే అవకాశం ఉంది. లెఫ్ట్ పార్టీలకు ఇచ్చేది కేవలం 6 నుంచి 8 సీట్ల వరకు ఉంటాయి. వారు కోరే అతితక్కువ సీట్లలో పాలేరు ఒకటి . ఏదైనా కేసీఆర్ లెఫ్ట్ పార్టీలమధ్య జరగాల్సిన ఒప్పందం. ఇప్పటికైతే కలిసి పోటీచేయబోతున్నట్లు ప్రచారం జరుగుతుంది. మునుగోడులో లెఫ్ట్ పార్టీల మద్దతు వల్లనే టీఆర్ యస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి గెలిచారని టీఆర్ యస్ నాయకత్వం కూడా నమ్ముతుంది. ఆ బంధం కొనసాగించాలని , బీజేపీ ప్రమాదాన్ని నివారించాలంటే తెలంగాణాలో బలంగా ఉన్న బీఆర్ యస్ కలిసి నడవాలని లెఫ్ట్ పార్టీలు దృఢమైన అభిప్రాయంతో ఉన్నాయి. అయితే కమ్యూనిస్టులు కోరే చోట బీఆర్ యస్ అభ్యర్తిలు సిట్టింగ్ లుగా ఉండటం వారే పోటీచేస్తారని ప్రకటించడం వల్ల క్యాడర్ లో అయోమయం నెలకొనే అవకాశాలు ఏర్పడే అవకాశాలు ఉన్నాయి.

ఇదే సభలో పాల్గొన్న జిల్లా మంత్రి పువ్వాడ అజయ్ మాట్లాడుతూ ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఉన్న 10 సీట్లకు 10 గెలవాలని అందుకు కార్యకర్తలు కష్టపడాలని పిలుపు నిచ్చారు . ఈ జిల్లా అభ్యుదయ ఉద్యమాలకు ,వామపక్ష రాజకీయాలకు నెలవైన జిల్లా , తెలంగాణ సాయిధ రైతాంగపోరాటవారసత్వం కలిగిన జిల్లా ఇక్కడ మత రాజకీయాలకు తావులేదన్నారు . తెలంగాణ ఉద్యమానిర్మాత , సీఎం కేసీఆర్ ఆధ్వరంలో తెలంగాణ దేశంలోనే నుంబర్ వన్ గా ఉందని అన్ని రాష్ట్రాలు తెలంగాణ వైపు చూస్తున్నాయని బీఆర్ యస్ అన్ని రాష్ట్రాలకు విస్తరిస్తుందని కేసీఆర్ తీసుకున్న నిర్ణయంలో మనమంతా భాగస్వాములమై ఆయనకు అండగా నిలవాలని పిలుపు నిచ్చారు .

పాలేరు నియోజకవర్గంలో కూసుమంచి , ఖమ్మం రూరల్ మండలాల్లో రోడ్లు , బ్రిడ్జిలకు మంత్రి ప్రశాంత రెడ్డి , పువ్వాడ అజయ్ లు శంకుస్థాపన చేశారు . బహిరంగసభలో ఎమ్మెల్యే ఎంపీలు వద్దిరాజు రవిచంద్ర , నామ నాగేశ్వరరావు , ఎమ్మెల్యేలు కందాల ఉపేందర్ రెడ్డి , సండ్ర వెంకట వీరయ్య , ఎమ్మెల్సీ జిల్లా పార్టీ అధ్యక్షుడు తాతా మధు , డీసీసీబీ చైర్మన్ కూరాకుల నాగభూషణం , ఖమ్మం మేయర్ పూనుకొల్లు నీరజ , రూరల్ ఎంపీపీ బెల్లం ఉమా , బెల్లం వేణు తదితరులు పాల్గొన్నారు .

Related posts

ప్లీజ్.. ఎన్ కౌంటర్ చేయొద్దు, జైలుకే పంపండి!

Drukpadam

కాంగ్రెస్ వర్గాల్లో కొత్త ఉత్సాహం… కోమటిరెడ్డి నివాసానికి రేవంత్ రెడ్డి!

Drukpadam

పోట్లాడుకున్న కుక్కలు.. ఇద్దరు వ్యక్తుల కాల్చివేత

Ram Narayana

Leave a Comment