వనమా కోరిక మేరకు కొత్తగూడెం కు సీఎం కేసీఆర్ వరాలు!
-వనమాపై ప్రశంసలు …ఎప్పడు హైద్రాబాద్ వచ్చిన కోరికల చిట్టా ఇస్తారని వెల్లడి
-పాల్వంచ ,కొత్తగూడెం మున్సిపాలిటీలకు 80 కోట్లు
-ఇల్లందు ,మణుగూరు మున్సిపాలిటీలకు 50 కోట్లు
-481 పంచాయతీలకు ఒక్కో పంచాయితీకి 10 లక్షలు
-ముర్రేడు వాగు ప్రక్షాళనకు స్మిత సబర్వాల్ కు ఆదేశాలు
-జర్నలిస్టులకు ఇళ్లస్థలాలు తప్పకుండ ఇస్తామని ప్రకటన
కొత్తగూడెం కు చెందిన సీనియర్ ఎమ్మెల్యే వనమా కోరిక మేరకు సీఎం కేసీఆర్ వరాలు కురిపించారు . భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నూతన కలెక్టరేట్ సముదాయాన్ని ప్రారంభించేందుకు కొత్తగూడెం వచ్చిన సీఎం ఇంటిగ్రేటెడ్ కలెక్టర్ కార్యాలన్నీ ప్రారంభించిన అనంతరం ఏర్పాటు చేసిన సభలో ప్రసంగించారు . ఈసందర్భంగా కొత్తగూడంకు చెందిన సీనియర్ ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరావు పై ప్రసంశలు కురిపించారు . వనమా ఎప్పడు హైద్రాబాద్ వచ్చినా, కోరికల చిట్టాతో వస్తారని ప్రజలకోసం ఎదో చేయాలనే తపన పడతారని అందుకోసం ఆయన్ను అభినందిస్తున్నాని అన్నారు . ఆయన కోరికమేరకు ముర్రేడు వాగు ప్రక్షాళనకు వెంటనే పరిశీలన జరిపి దానికి కావాల్సిన చర్యలు తీసుకోవాలని తన స్పెషల్ సెక్రటరీ స్మిత సబర్వాల్ ను ఆదేశిస్తున్నట్లు తెలిపారు .
అంతే కాకుండా జిల్లాలో ఉన్న రెండు పెద్ద మున్సిపాలిటీలు వనమా నియోజకవర్గంలోనే ఉన్నాయని అందువల్ల కొత్తగూడెం ,పాల్వంచ మున్సిపాలిటీలకు 80 కోట్ల నిధులు మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారు .వేదిక మీదనే వనమగారు చాలా అంటూ సీఎం కేసీఆర్
అడగటం అందరిని నవ్వులు పూవించింది. వెంటనే స్పందించిన వనమా సీఎం దగ్గరకు వచ్చి కృతజ్ఞత పూర్వకంగా నమస్కారాలు తెలిపారు . ఈ దృశ్యం సభికులను సైతం పులకింప చేసింది. అదే సందర్భంలో జర్నలిస్టులకు సింగరేణి స్థలంలో ఇళ్ల స్థలాలు ఇవ్వాలని కోరగా తప్పకుండ జర్నలిస్టులకు ఇళ్లస్థలాలు ఇస్తామని సీఎం బహిరంగ సభలో ప్రకటించారు .
జిల్లాలో ఉన్న ఇల్లందు , మణుగూరు మున్సిపాలిటీలకు ఒక్కొక్క మున్సిపాలిటీకి 25 కోట్ల చొప్పున వెంటనే మంజూరి చేస్తున్నట్లు సీఎం ప్రకటించారు . జిల్లాలో ఉన్న 481 గ్రామపంచాయతీలకు ఒక్కొక్క పంచాయతీకి 10 లక్షల రూపాయలు ఇస్తున్నట్లు తెలిపారు .తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమ సందర్భంగా ఉమ్మడి జిల్లా తనను కడుపులో పెట్టుకొని కాపాడిందని అది ఎప్పుడు నా మనుసులో ఉంటుందని సీఎం అన్నారు.సభలో మంత్రి పువ్వాడ అజయ్ ,ఎమ్మెల్యే వనమా లు ప్రసంగించారు . కార్యక్రమంలో ఎంపీలు నామ నాగేశ్వరరావు , వద్దిరాజు రవి చంద్ర , ఎమ్మెల్సీలు పల్లా రాజేశ్వరరెడ్డి ,తాతా మధు , ఎమ్మెల్యేలు రేగా కాంతారావు , మెచ్చా నాగేశ్వరరావు , హరిప్రియ , మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు , తదితరులు పాల్గొన్నారు . అంతకు ముందు కలెక్టరేట్ ప్రారంభించిన అనంతరం కలెక్టర్ అనుదీప్ ను కుర్చీలో కూర్చోబెట్టిన సీఎం కేసీఆర్ ఆయనకు పుష్పగుచ్ఛము అందించారు . బీఆర్ యస్ జిల్లా కార్యాలన్నీ ప్రారంభించారు . కేసీఆర్ రక సందర్భంగా వనమా ఆధ్వరంలో కొత్తగూడెం పాల్వంచ పట్టణాలను గులాబీ మాయం చేశారు .