Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
రాజకీయ వార్తలు

ఖమ్మంలో జరగనున్న బీఆర్ యస్ సభ పై రేణుక చౌదరి సైటైర్లు!

ఖమ్మంలో జరగనున్న బీఆర్ యస్ సభ పై రేణుక చౌదరి సైటైర్లు!
-ఖమ్మం ఈశాన్యంలో ఉన్నా బయటివారికి కలిసి రాదు
-ఖమ్మం సభ తర్వాత బీఆర్ యస్ కు ఇక విఆర్ యస్సే
-రాష్ట్రాన్ని అదోగతి పాలు చేశారని ధ్వజం
-అప్పుల రాష్ట్రంగా తెలంగాణ

మాజీ కేంద్రమంత్రి ,కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకురాలు రేణుక చౌదరి ఖమ్మంలో ఈనెల 18 న జరగనున్న బీఆర్ యస్ సభపై తనదైన శైలిలో సైటర్లు వేశారు . ఖమ్మం సభ తర్వాత బీఆర్ యస్ కు విఆర్ యస్ ఖాయమన్నారు . కేసీఆర్ ఖమ్మం రాష్ట్రానికి ఈశాన్యంలో ఉందని అందువల్ల వాస్తు ప్రకారం సభ పెడుతున్నట్లు ఉన్నారు .కానీ ఖమ్మం ఈశాన్యం అనేది స్థానికులకు మాత్రమే వర్తిస్తుందని ఇది బయటివారికి వర్తించిందని పేర్కొన్నారు . బంగారు తెలంగాణ చేస్తానన్న కేసీఆర్ రాష్ట్రాన్ని అప్పుల తెలంగాణగా మార్చారని ధ్వజమెత్తారు . రాష్ట్రంలో పరిపాలన గాడితప్పిందని ,దానినుంచి ప్రజల మనస్సులను మరల్చేందుకు బీఆర్ యస్ పేరుతో కేసీఆర్ కొత్త డ్రామాలు ఆడుతున్నారని విమర్శించారు .

సంవత్సర కాలం క్రితం వరకు బీజేపీతో చెట్టపట్టాలు వేసుకొని కేంద్రం చేసిన అన్నిటిని సమర్ధించిన కేసీఆర్ ఇప్పుడు బీజేపీతో యుద్ధం అంటూ కొత్తనాటకం ఆడుతున్నారని రేణుక చౌదరి విమర్శలుగుప్పించారు . నీళ్లు , నిధులు , నియామకాలు అన్న కేసీఆర్ ప్రజలనుంచి వస్తున్నా ప్రశ్నలకు సమాధానం చెప్పే స్థితిలో లేరని అందుకు జాతీయపార్టీ అంటున్నారని , ఇప్పటికే కేసీఆర్ వైఖరి పై దేశంలో అనేక రాష్ట్రాల నాయకులు అర్థం చేసుకున్నారని అన్నారు . అందువల్ల బీఆర్ యస్ కు ఎక్కడ ఆదరణ లేదని దెప్పిపొడిచారు . బీజేపీ , బీఆర్ యస్ లు ఒకటేనని గ్రహించాలని అన్నారు . ఆ రెండు పార్టీల ఉద్దేశం కాంగ్రెస్ ను బలహీన పరచడమేనని పేర్కొన్నారు .అందువల్ల ఖమ్మం లో జరగనున్న బీఆర్ యస్ సభ తర్వాత బీఆర్ యస్ కు విఆర్ యస్ తప్పదని రేణుక చౌదరి అన్నారు . ముందు రాష్ట్రంలో ఉన్న సమస్యలు పరిష్కరించాలని , పోడుభూములు , ధరణిలో ఉన్న ఇబ్బందులు కౌలు రైతుల సమస్యలు , నిరుద్యోగులకు ఉద్యోగాలు , ఇవ్వాలని డిమాండ్ చేశారు . ఉద్యోగులకు సకాలంలో వేతనాలు చెల్లించాలని , వారికీ రావాల్సిన బకాయిలు వెంటనే ఇవ్వాలని , డి ఏ లు ప్రకటించాలని అన్నారు . దేశమంతా తెలంగాణ మోడల్ అమలు అంటే ఇదేనా అంటూ ఆమె ప్రశ్నించారు . తెలంగాణాలో తనకు ఎదురు గాలి వీస్తోందని తెలుసుకున్న కేసీఆర్ ప్రజలను మభ్యపెట్టేందుకు ప్రయత్నం చేస్తున్నారని అందుకు ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు రేణుక చౌదరి ….

 

Related posts

తెలంగాణలో వేడెక్కుతున్న రాజకీయం..మరోసారి బీజేపీ ఆకర్ష్ …

Drukpadam

పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి రాజ్యసభ సీటు …జరుగుతున్న చర్చ…

Drukpadam

పరిటాల శ్రీరామ్ కూల్ స్పందన …

Drukpadam

Leave a Comment