Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
రాజకీయ వార్తలు

బీఆర్ యస్ సభ కోసం ఖమ్మంలో హరీష్ రావు మకాం …

బీఆర్ యస్ సభ కోసం ఖమ్మంలో హరీష్ రావు మకాం …
-తుమ్మలకు సభ ఏర్పాట్ల భాద్యతలు …జోరు పెంచిన తుమ్మల
-దీంతో ఉరుకులు పరుగులు పెడుతున్న తుమ్మల
-తుమ్మలను ఖమ్మంలో ఉండి సభ ఏర్పుట్లు చూసుకోవాలన్న హరీష్ రావు …
-శనివారం ఉదయం బహిరంగ సభ ఏర్పాట్లును పరిశీలించిననేతలు
మార్నింగ్ వాక్ తోపాటు ఏర్పాట్ల పరిశీలన
-పాల్గొన్న మంత్రులు హరీష్ రావు , పువ్వాడ అజయ్
-ఎంపీ వద్దిరాజు ,ఎమ్మెల్యే సండ్ర ,ఎమ్మెల్సీ మధు .కౌశిక్ రెడ్డి
-మాజీ మంత్రు తుమ్మల ,సుడా చైర్మన్ బచ్చు విజయ్ కుమార్

ఖమ్మం లో ఈనెల 18 న జరగనున్న బీఆర్ యస్ సభని అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్న కేసీఆర్ సీనియర్ మంత్రి హరీష్ రావుకు భాద్యతలు అప్పగించారు .ఆయన గత నాలుగైదు రోజులుగా ఖమ్మంలోని మకాం వేసి స్వయంగా ఏర్పాట్లను పరిశీలిస్తూ , పార్టీకి దూరంగా ఉండి యాక్టీవ్ లేని నాయకులను యాక్టీవ్ చేస్తున్నారు . కొంతకాలం క్రితం వరకు ఎడమొహం పెడమొహంగా ఉండి, కారాలు మిరియాలు నూరుకున్న నేతలను కలుపుతున్నారు . రాష్ట్రంలోనే రాజకీయాలను తదైనా శైలిలో నడిపించే హరీష్ రావుకు ట్రబుల్ షూటర్ గా పేరుంది . అందులో ఆయన సక్సెస్ రేటు కూడా ఎక్కువగానే ఉంది .జిల్లాలో వివిధ నియోజకవర్గాల్లో స్వయంగా పర్యటిస్తూ జనసమీకరణకోసం ఎమ్మెల్యేలకు తగిన సూచనలు ఇస్తున్నారు .స్థానిక నేతలను సైతం ఉరుకులు ,పరుగులు పెట్టిస్తున్నారు . సభకు లక్షలాదిగా తరలించేందుకు పధక రచన చేస్తున్నారు .గ్రూప్ తగాదాలను పెక్కన పెట్టి సభ జయప్రదం చేయాలని నేతలకు సూచిస్తున్నారు . వైరాలో టికెట్ ఆశిస్తున్నా ముగ్గురు నేతలను ఒకే వేదికపైకి తీసుకోని రాగలిగిన హరీష్ రావు ,ఆద్యంతం ఆ సభ లో నవ్వులు పూవించేలా చేశారు . ప్రస్తుత ఎమ్మెల్యే రాములు నాయక్ ,గతంలో ఎమ్మెల్యేలుగా ఉన్న మదన్ లాల్ ,చంద్రావతి లు ఒకే వేదికపై కనిపించడంతో ప్రజలు సైతం ఆశ్చర్యాన్ని గురైయ్యారు . సత్తుపల్లిలో నిన్నమొన్నటివరకు ఉప్పు నిప్పుగా ఉన్న ఎమ్మెల్యే సండ్ర , మాజీ మంత్రి తుమ్మల సైతం ఒకే వేదికను పంచుకున్నారు. అయితే తుమ్మలకు ఎక్కడ నియోజకవర్గ భాద్యతలు అప్పగించకుండా ఖమ్మంలో ఉండి బహిరంగ సభ ఏర్పాట్లను చూసుకోమన్నారు . దీంతో అందివచ్చిన అవకాశాన్ని ఆయన ఉపయోగించుకొనే ప్రయత్నంలో ఉన్నారు .

ఇప్పటివరకు పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉండి పార్టీ మారబోతున్నాడని ప్రచారం జరిగిన తుమ్మల ఇటీవల పార్టీకి దగ్గరయ్యారు .ఆయన కోరుకున్న పాలేరు సీటు వస్తుందో రాదో అనే విషయం పక్కన పెడితే, ఆయన చురుగ్గా పార్టీ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు . అందుకు మంత్రి హరీష్ రావు చూపిన చొరవ ఫలించింది. దీంతో తుమ్మల జోషి పెంచారు . శనివారం ఉదయం సభాస్థలిని పరిశీలించిన మంత్రులు , హరీష్ రావు , పువ్వాడ అజయ్ తోపాటు ,ఎంపీ వద్దిరాజు రవిచంద్ర , ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య , ఎమ్మెల్సీలు తాతా మధు , కౌశిక్ రెడ్డి లతో మాజీ మంత్రి తుమ్మల జాయిన్ అయ్యారు . సభాస్థలిని కలయ తిరిగారు . పోలీస్ ఉన్నతధికారులతో బందో బస్తు ఏర్పాట్లను చర్చించారు . ఖమ్మం సభ కొందరిని దూరం చేసుకుంటుండగా మరికొందరిని దగ్గరకు చేర్చుకోవడం ఆసక్తిగా మారింది.

 

Related posts

జాతీయపార్టీ పేరుతొ కేసీఆర్ కొత్త నాటకం : సీఎల్పీ నేత భట్టి విక్రమార్క!

Drukpadam

యూపీ ఎన్నికల్లో కృష్ణుడి గోల …

Drukpadam

బీఆర్ యస్, కామ్రేడ్ల పొత్తు  కసరత్తు కొలిక్కి వచ్చేనా … …?

Drukpadam

Leave a Comment