Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
రాజకీయ వార్తలు

వరుణ్ గాంధీపై రాహుల్ గాంధీ ఆసక్తికర వ్యాఖ్యలు!

వరుణ్ గాంధీపై రాహుల్ గాంధీ ఆసక్తికర వ్యాఖ్యలు!
-తమ కుటుంబానికి ఒక భావజాలం ఉందన్న రాహుల్
-వరుణ్ మరో భావజాలాన్ని స్వీకరించారని వ్యాఖ్య
-తాను వరుణ్ ను కౌగిలించుకోగలనన్న రాహుల్

గాంధీ కుటుంబం కలవబోతుందా ? ఇప్పుడు దేశ రాజకీయాల్లో ఇదే ప్రధాన చర్చ …తన సొంత బాబాయి కుమారుడైన వరుణ్ గాంధీ ,ఆయన తల్లి మేనకా గాంధీ బీజేపీలో చేరారు. బీజేపీకి బద్ద శత్రువులుగా ఉండే వారి కుటుంబం ఆపార్టీలో చేరడం అప్పట్లో సంచలనంగా మారింది.ఇటీవల కాలంలో బీజేపీకి మేనకాగాంధీ , వరుణ్ గాంధీ దూరంగా ఉంటున్నారు . పైగా బీజేపీ విధానాలను వరుణ్ గాంధీ బహిరంగంగానే విమర్శించారు . దీంతో వారు బీజేపీతో తెగతెంపులు చేసుకుంటుందా ? అనే సందేహాలు కలిగాయి. వాటికీ కొంత ఊతమిచ్చే విధంగా రాహుల్ భారత్ జోడో యాత్ర సందర్భంగా యూపీలో మాట్లాడుతూ ఒకే కుటుంబానికి చెందిన తాము రెండు మార్గాల్లో ఉన్నామని అయితే వరుణ్ వస్తానంటే తాను కౌగిలించుకుంటానని రాహుల్ అనడం చర్చనీయాంశంగా మారింది .

రక్త సంబంధీకులైనా కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ, వరుణ్ గాంధీల మధ్య అనుబంధం ఎక్కడా కనిపించదు. మేనకాగాంధీ, ఆమె కుమారుడు వరుణ్ గాంధీలు బీజేపీలో ఉంటున్నారు. తాజాగా వరుణ్ గురించి రాహుల్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తమ కుటుంబానికి ఒక భావజాలం ఉందని… కానీ వరుణ్ మరో భావజాలాన్ని స్వీకరించారని చెప్పారు. వరుణ్ ను తాను కౌగిలించుకోగలనని, ప్రేమతో మాట్లాడగలనని చెప్పారు. కానీ వరుణ్ పుచ్చుకున్న రాజకీయ భావజాలాన్ని తాను స్వీకరించలేనని అన్నారు. రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్రలో వరుణ్ పాల్గొంటారనే వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఈ నేపథ్యంలో రాహుల్ చేసిన వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి.

Related posts

వైఎస్ జగన్‌పై మరో కేసు…

Drukpadam

ఖమ్మం జిల్లా టీఆర్ యస్ అధ్యక్షుడిగా తాతా మధు… ఎవరి ఛాయస్ …

Drukpadam

జ‌ర్న‌లిస్టుల‌కు జాగ్వార్ కార్లిస్తే.. టీఆర్ఎస్‌లో చేర‌తానంటున్న జగ్గారెడ్డి!

Drukpadam

Leave a Comment