Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఆంధ్రప్రదేశ్

దైవదర్శనానికి సిపిఎం ,సిపిఐ నేతలు దూరం …

దైవదర్శనానికి సిపిఎం ,సిపిఐ నేతలు దూరం
గెస్ట్ హౌస్ లో కేరళ సీఎం విజయన్సిపిఐ ప్రధాన కార్యదర్శి డి.రాజా
యాదాద్రిలో ప్రత్యేక పూజలు నిర్వించిన కేసీఆర్
పాల్గొన్న కేజ్రీవాల్ ,భగత్ సింగ్ మాన్, యూపీ సీఎం అఖిలేష్
ఆలయ విశిష్టతను వివరించిన సీఎం కేసీఆర్

సీఎం కేసీఆర్ ఖమ్మంలో ఏర్పాటు చేసిన బీఆర్ యస్ సభకు హైద్రాబాద్ నుంచి సీఎంలు కేజ్రీవాల్ , పినారవి విజయన్ భగవత్ సింగ్ మాన్, యూపీ మాజీ సీఎం అఖిలేష్ యాదవ్ లకు యాదాద్రి లక్ష్మి నరసింహస్వామి దర్శనం చేశారు . అయితే వీరి వెంట హైద్రాబాద్ నుంచి వచ్చిన కేరళ సీఎం పినారై విజయన్ , సిపిఐ జాతీయ ప్రధాన కార్యదర్శి డి . రాజాలు దైవ దర్శనానికి వెళ్ల కుండా గెస్ట్ హౌస్ లో ఉన్నారు .సిపిఐ ,సిపిఎం నేతలందరూ కేసీఆర్ తోపాటు యాదాద్రి దైవదర్శనానికి వెళ్తారా ?లేదా ? దైవ దర్శనానికి ఆసక్తి చూపని లెఫ్ట్ పార్టీలు నేతలు ఒక సందర్భంలో నేరుగా సభాస్థలంలో కలుస్తారని అనుకున్నారు కానీ కేసీఆర్ కోరిక మేరకు హైద్రాబాద్ నుంచి హెలీకాఫ్టర్లలో వెళ్లేందుకు అంగీకరించిన ప్రజలకు వేరే సంకేతం వెళ్ళుతుందనే ఉద్దేశంతో వాళ్ళు దర్శనానికి వెళ్ల ఉండకుండా కేసీఆర్ ఇతర సీఎంలు అఖిలేష్ యాదవ్ లు వచ్చేవరకు రాష్ట్రపతి గెస్ట్ హౌస్ లో ఉన్నారు .

కేసీఆర్ మిగతా నేతలకు ఆలయ దర్శన అనంతరం తిరిగి ఖమ్మం సభకు బయలు దేరి వెళ్లారు . ఆలయంలో ప్రత్యేక పూజలు చేసిన కేసీఆర్ ఆలయ పునర్నిర్మాణం , దాని విశిష్టత గురించి అతిధులకు వివరించారు . అనంతరం అక్కడ నుంచి ఖమ్మం చేరుకొని నూతన ఇంటిగ్రేటెడ్ కలెక్టరేట్ సముదాయాన్ని ముగ్గురు ముఖ్యమంత్రులతో కలిసి సీఎం కేసీఆర్ ప్రారంభించారు .

ఖమ్మం కలెక్టర్ కు అరుదైన గౌరవం

నూతన కలెక్టరేట్ సముదాయం ప్రారంభం సందర్భంగా జిల్లా కలెక్టర్ వి పి గౌతమ్ ను కేసీఆర్ తోపాటు ముగ్గురు ముఖ్యమంత్రులు తన సీట్లు కూర్చోబెట్టి అభినందనలు తెలిపారు . ఇది ఇంత వరకు కలెక్టర్ కు లభించని అరుదైన గౌరవంఇప్పటివరకు సీఎం కేసీఆర్ ఒక్కరే వెళ్లి కలెక్టర్ కార్యాలయాలను ప్రారంభించి కలెక్టరేట్ లను ప్రారంభించి కలెక్టర్ ను సీట్లు కూర్చో బెట్టి పుష్ప గుచ్చం అందించి అబినందించేవారు .ఖమ్మం కలెక్టర్ ను మాత్రం నలుగురు ముఖ్యమంత్రులు , మాజీ సీఎం అఖిలేష్ , సిపిఐ జాతీయ కార్యదర్శి డి .రాజా అభినందించారు . అనంతరం కలెక్టర్ కార్యాలయంలో కంటివెలుగు రెండవ విడత కార్యక్రమాన్ని ప్రారంభించారు . సందర్భంగా లబ్దిదారులకు కంటి అద్దాలను సీఎంలు వారి జాతీయ నేతలు అందించారు .కార్యక్రమంలో రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు ,జిల్లా మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ,రోడ్ల భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత రెడ్డి ,చీఫ్ సెక్రటరీ శాంతా కుమారి ,సీఎల్పీ నేత భట్టి విక్రమార్క , సిపిఎం , సిపిఐ రాష్ట్ర కార్యదర్శులు తమ్మినేని వీరభద్రం ,కూనంనేని సాంబశివరావు పాల్గొన్నారు .

Related posts

బిగ్ బాస్ సీజన్ 5 విజేత ఖమ్మం కుర్రాడు వి జే సన్నీ !

Drukpadam

భారత్ తో బంధం ముఖ్యమే.. కానీ మా సార్వభౌమత్వం మాకు మరింత ముఖ్యం: కెనడా రక్షణ శాఖ మంత్రి

Ram Narayana

పట్టభద్రుల ఎన్నిక మార్చ్ 14 న

Drukpadam

Leave a Comment