Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
రాజకీయ వార్తలు

బీజేపీ ,ఆర్ ఎస్ ఎస్ విధానాలు దేశానికి నష్టం …విపక్ష నేతలు

కేంద్రం తన పరిధిలో ఉన్న వ్యవస్థలన్నిటినీ దుర్వినియోగం చేస్తుందని ,రాజ్యాగం మౌలిక సూత్రాలను కాలరాస్తోందని ,గవర్నర్లను తమ తామెబేదార్లుగా మార్చుకొని రాష్ట్రాల హక్కులను కాలరాస్తోందని,బీజేపీ ,ఆర్ ఎస్ ఎస్ విధానాలు దేశానికి నష్టమని  ఖమ్మం సభలో పాల్గొన్న సిపిఐ ప్రధాన కార్యదర్శి డి .రాజా , ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ , పంజాబ్ సీఎం భగవంత సింగ్ మాన్ లు బీజేపీ సర్కార్ పై ధ్వజమెత్తారు .

బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్‌ దేశానికి ముప్పులా తయారయ్యాయి: డీ. రాజా

దేశానికి బీజేపీ ప్రమాదకారిగా తయారైందని సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి డీ. రాజా అన్నారు. దేశ సార్వభౌమాధికారం ప్రమాదంలో పడిందని అన్నారు. ఆర్‌ఎస్‌ఎస్‌, బీజేపీ కలిసి దేశ మౌలిక వ్యవస్థల్నే మార్చాలని చూస్తున్నాయని అన్నారు. భారత దేశం ప్రస్తుతం అతిపెద్ద సంక్షోభంలో ఉందని అన్నారు. బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్‌ దేశానికి ముప్పుగా తయారయ్యాయని అన్నారు. గవర్నర్‌ వ్యవస్థను దుర్వినియోగం చేస్తుందని అన్నారు. తమిళనాడు, కేరళ, తెలంగాణ, ఢిల్లీలో ఏం జరుగుతుందో ప్రజలందరూ చూస్తూనే ఉన్నారని అన్నారు.

తెలంగాణ పోరాట యోధులకు పుట్టినిల్లు అని సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి డీ. రాజా అన్నారు. ప్రజలకు విద్య, వైద్యం, ఉద్యోగం కనీస అవసరాలని, ఈ రంగాల్లో తెలంగాణ ముందుందని కొనియాడారు. కరెంట్‌ కోతలు లేని ఏకైక రాష్ట్రం తెలంగాణ అని అన్నారు. రైతుబంధు, దళితబంధు లాంటి అద్భుత పథకాలను తెలంగాణ అమలు చేస్తుందని కొనియాడారు.

కేంద్రం చేతిలో గవర్నర్లు కీలు బొమ్మలు: ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌

దేశాన్ని అభివృద్ధి చేయడం ఎలా.. రైతులకు ఏం చేయాలి, కార్మికులకు ఏం చేయాలనే దానిపైన ఇవాళ ముఖ్యనేతలందరం కలిసి చర్చించామని ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌ తెలిపారు. కేరళలో విద్యాసంస్థలు అద్భుతంగా ఉన్నాయని, అలాంటి పరిస్థితి దేశంలో ఎందుకు లేదని ప్రశ్నించారు. గవర్నర్‌ వ్యవస్థను బీజేపీ దుర్వినియోగం చేస్తుందన్నారు. తమిళనాడు, ఢిల్లీ, తెలంగాణ, కేరళలో గవర్నర్లు ఏం చేస్తున్నారో ప్రజలందరూ చూస్తున్నారని అన్నారు. అభివృద్ధి పనులకు అడ్గుతగలడమే గవర్నర్ల పని అన్నట్లు ఉందని కేజ్రీవాల్‌ అన్నారు. గవర్నర్లు కేవలం కీలు బొమ్మలుగా మారారని ఆరోపించారు.

మోదీకి ఇంకా 400 రోజులే మిగిలి ఉన్నాయి: యూపీ మాజీ సీఎం అఖిలేశ్‌

కేంద్రంలోని మోదీ ప్రభుత్వానికి ఇంకా 400 రోజులే మిగిలి ఉన్నాయని యూపీ మాజీ సీఎం అఖిలేశ్‌ యాదవ్‌ అన్నారు. కేంద్రం రోజులు లెక్కబెట్టుకుంటోందని, ఇవాల్టితో ఇంకా 399 రోజులు మాత్రమే మిగిలి ఉన్నాయని అన్నారు. రైతులను ఆదుకుంటామని మోదీ మాటతప్పారని, నిరుద్యోగులకు ఉపాధి కల్పిస్తామని మోసం చేశారని అన్నారు. దర్యాప్తు సంస్థలను చూపి ప్రతిపక్షాలను బీజేపీ భయపెట్టే ప్రయత్నం చేస్తుందన్నారు. కేసుల పేరుతో ఇరుకున పెట్టే ప్రయత్నం చేస్తుందన్నారు. బీజేపీయేతర ప్రభుత్వాలను ఇబ్బందులకు గురి చేస్తుందన్నారు

మోదీ ప్రజల కోసం కాదు.. తన మిత్రుల కోసమే పనిచేస్తున్నారు: పంజాబ్‌ సీఎం భగవంత్‌ మాన్‌ సింగ్‌

దొడ్డి దారిలో అధికారంలోకి రావడంలో బీజేపీ నంబర్‌ వన్‌ అని పంజాబ్‌ సీఎం భగవంత్‌ మాన్ అన్నారు. మోదీ ప్రజల కోసం కాదు తన మిత్రుల కోసం పని చేస్తున్నారని అన్నారు. ఎర్రకోటపై మోదీ 8 ఏళ్లుగా ఒకేరకమైన మాటలు చెబుతున్నారని విమర్శించారు. ప్రజల జీవితాలను మోదీ ఎలాగూ మార్చలేకపోతున్నారని, కనీసం తన ప్రసంగాన్నైనా మార్చుకోవాలని సూచించారు.

 

 

Related posts

ప్రజల దృష్టిని మళ్లించేందుకే… ట్రస్టుల ఎఫ్ సీఆర్ఏ లైసెన్సు రద్దుపై కాంగ్రెస్!

Drukpadam

శ్రీలంకలో కనిపిస్తే కాల్చివేత …సైన్యానికి పూర్తీ అధికారాలు తాత్కాలిక అధ్యక్షుడు విక్రమసింఘే!

Drukpadam

కాంగ్రెస్ అడ్రెస్స్ గల్లంతేనా ? బీజేపీ దే హవా??… ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు!

Drukpadam

Leave a Comment