Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
రాజకీయ వార్తలు

నెల్లూరు రూరల్ నుంచి ఆదాల పోటీ చేస్తారు: సజ్జల!

నెల్లూరు రూరల్ నుంచి ఆదాల పోటీ చేస్తారు: సజ్జల!

  • వైసీపీ నాయకత్వంపై కోటంరెడ్డి ఫోన్ ట్యాపింగ్ ఆరోపణలు
  • ఆదాల ప్రభాకర్ రెడ్డికి బాధ్యతలను అప్పగించిన జగన్
  • వచ్చే ఎన్నికల్లో టికెట్ కూడా కన్ఫామ్

నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి వైసీపీ అధిష్ఠానంపై ఫోన్ ట్యాపింగ్ ఆరోపణలు చేయడం కలకలం రేపిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో, నెల్లూరు రూరల్ సమన్వయకర్తగా ఆదాల ప్రభాకర్ రెడ్డిని జగన్ నియమించారు. ఈ సందర్భంగా వైసీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల మాట్లాడుతూ… వచ్చే ఎన్నికల్లో వైసీపీ రూరల్ నుంచి ఆదాల పోటీ చేస్తారని స్పష్టం చేశారు. ముఖ్యమంత్రితో చర్చల తర్వాతే ఈ నిర్ణయం తీసుకున్నామని చెప్పారు.

ఆదాల ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ, తనను ఇన్ఛార్జీగా నియమించడం సంతోషకరమని అన్నారు. వైసీపీ గెలుపుకోసం కృషి చేస్తానని చెప్పారు. బాలినేని శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ, టీడీపీ అధినేత చంద్రబాబు నుంచి వచ్చే ఎన్నికల్లో ఎమ్మెల్యే టికెట్ కు సంబంధించిన హామీని కోటంరెడ్డి తీసుకున్నారని ఆరోపించారు. చంద్రబాబును కలిసిన తర్వాతే ఆయన ఫోన్ ట్యాపింగ్ గురించి మాట్లాడుతున్నారని విమర్శించారు. నెల్లూరు రూరల్ స్థానంలో ఇకపై పార్టీకి సంబంధించిన అన్ని కార్యక్రమాలు ఆదాల ఆధ్వర్యంలోనే జరుగుతాయని చెప్పారు.

Related posts

పవార్, యశ్వంత్ సిన్హా నేతృత్వంలో నేడు ప్రతిపక్షాల భేటీ!

Drukpadam

భారత్ సమీపంలోని మూడు దీవులను చైనాకు అప్పగించేసిన శ్రీలంక!

Drukpadam

ఓట్ల లెక్కింపున‌కు ముందే ఈవీఎంల‌ను ట్యాంప‌రింగ్ చేశారు: అఖిలేశ్ యాద‌వ్ తీవ్ర ఆరోపణలు!

Drukpadam

Leave a Comment