Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
రాజకీయ వార్తలు

నెల్లూరు వైసీపీలో ప్రకంపనలు…

నెల్లూరు వైసీపీలో ప్రకంపనలు…కోటం రెడ్డి అవుట్ …ఆదాల ఇన్
-నెల్లూరు రూరల్ ఇంఛార్జిగా ఎంపీ ఆదాల ప్రభాకర్ రెడ్డి
-నెల్లూరు రూరల్ నుంచి ఆదాల పోటీ చేస్తారన్న సజ్జల
-వైసీపీ నాయకత్వంపై కోటంరెడ్డి ఫోన్ ట్యాపింగ్ ఆరోపణలు
-ఆదాల ప్రభాకర్ రెడ్డికి బాధ్యతలను అప్పగించిన జగన్
-వచ్చే ఎన్నికల్లో టికెట్ కూడా కన్ఫామ్
-ఇప్పటికే వెంకటగిరి ఎమ్మెల్యే ఆనం పై వేటు ఇంఛార్జిగా నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డి

నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి వైసీపీ అధిష్ఠానంపై ఫోన్ ట్యాపింగ్ ఆరోపణలు చేయడం కలకలం రేపిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో, నెల్లూరు రూరల్ సమన్వయకర్తగా ఆదాల ప్రభాకర్ రెడ్డిని జగన్ నియమించారు. ఈ సందర్భంగా వైసీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల మాట్లాడుతూ… వచ్చే ఎన్నికల్లో వైసీపీ రూరల్ నుంచి ఆదాల పోటీ చేస్తారని స్పష్టం చేశారు. ముఖ్యమంత్రితో చర్చల తర్వాతే ఈ నిర్ణయం తీసుకున్నామని చెప్పారు.

ఆదాల ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ, తనను ఇన్ఛార్జీగా నియమించడం సంతోషకరమని అన్నారు. వైసీపీ గెలుపుకోసం కృషి చేస్తానని చెప్పారు. మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ, టీడీపీ అధినేత చంద్రబాబు నుంచి వచ్చే ఎన్నికల్లో ఎమ్మెల్యే టికెట్ కు సంబంధించిన హామీని కోటంరెడ్డి తీసుకున్నారని ఆరోపించారు. చంద్రబాబును కలిసిన తర్వాతే ఆయన ఫోన్ ట్యాపింగ్ గురించి మాట్లాడుతున్నారని విమర్శించారు. నెల్లూరు రూరల్ స్థానంలో ఇకపై పార్టీకి సంబంధించిన అన్ని కార్యక్రమాలు ఆదాల ఆధ్వర్యంలోనే జరుగుతాయని చెప్పారు.

గత నెలరోజుల క్రితం వెంకటగిరి ఎమ్మెల్యే ఆనం రాంనారాయణ రెడ్డి పార్టీకి వ్యతిరేకంగా తరుచు మాట్లాడుతుండటంతో ఆయన స్థానంలో వెంకటగిరి ఇంఛార్జిగా నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డిని నియమించింది . ఎన్నికలకు మరో సంత్సరం పైగా ఉన్నప్పటికీ ఎన్నికలకు సన్నద్దమోవుతున్న వైసీపీ పార్టీ అభ్యర్థులపై ద్రుష్టి సారించింది. అందులో భాగంగానే బలహీనంగా ఉన్న ఎమ్మెల్యేల స్థానంలో బలమైన అభ్యర్థులను నియమించాలని నిర్ణయించిన వైసీపీ అందుకు అనుగుణంగా పావులు కదుపుతుంది .

Related posts

బండి సంజయ్ ను విడిచిపెట్టొద్దు.. పీడీ యాక్ట్ పెట్టాలంటూ ఆర్​ఎస్​ ప్రవీణ్​ సంచలన ట్వీట్!

Drukpadam

టికెట్ దక్కలేదని.. ఆత్మహత్యకు యత్నించిన సమాజ్‌వాదీ పార్టీ నేత!

Drukpadam

కేబినెట్ సమావేశం తర్వాత సిద్ధూ డిమాండ్లపై సీఎం చన్నీ కీలక ప్రకటన?

Drukpadam

Leave a Comment