Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
క్రైమ్ వార్తలు

వివేకా హత్య కేసులు అనేక మలుపులు …దూకుడు పెంచిన సిబిఐ

వివేకా హత్య విషయం మొదట తెలిసింది వాళ్లిద్దరికే: సజ్జల

  • వివేకా హత్య కేసులో సీబీఐ దర్యాప్తు వేగవంతం
  • కృష్ణమోహన్ రెడ్డి, నవీన్ లను విచారించిన సీబీఐ
  • అవినాశ్ కు వివేకా బావమరిది ద్వారా హత్య విషయం తెలిసిందన్న సజ్జల

ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి సొంతబాబాయి వైయస్ వివేకానందరెడ్డి హత్య కేసు అనేక మలుపులు తిరుగుతుంది. అనేక కేసులను ఛేదించిన సిబిఐకి వివేకా హత్య కేసు పెను సవాల్ గా మారింది.ఇంతకీ వివేకాను ఎవరు చంపారు .అనేది సిబిఐ తేల్చుకోలేక పోతుంది.హాలీవుడ్ టెర్రర్ సినిమాను తలపించే రీతిలో కేసు మలుపులు తిరుగుతుంది.చివరికి సీఎం కార్యాలయంలో ఉండే కృష్ణ మోహన్ రెడ్డిని కూడా సిబిఐ విచారించడం సంచలనంగా మారింది. అంతకు ముందే ఎంపీ అవినాష్ రెడ్డిని సిబిఐ విచారించింది . ఇది రాజకీయ మలుపులు తిరగటంతో ఒకరిపై మరొకరు ఆరోపణలు ,ప్రత్యారోపణలు చేసుకున్నారు . చివరకు వివేకా అల్లుడు , బావమరిదికి

వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో సీబీఐ దర్యాప్తు ఊపందుకుంది. హత్య అనంతరం ఎంపీ అవినాశ్ రెడ్డి నుంచి కాల్స్ అందుకున్నట్టుగా భావిస్తున్న సీఎం జగన్ ఓఎస్డీ కృష్ణమోహన్ రెడ్డి, వైఎస్ భారతి పీఏ నవీన్ లను సీబీఐ నేడు విచారించింది.

ఈ నేపథ్యంలో, రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ కేసులో అవినాశ్ రెడ్డి తర్వాత నవీన్ ను నోటీసులు ఇచ్చారని, దాంతో నవీన్ ఎవరోనంటూ ఏదేదో ప్రచారం చేశారని అసహనం వ్యక్తం చేశారు. హత్య విషయం మొదటగా తెలిసింది వివేకా అల్లుడు, బావమరిదికేనని సజ్జల వెల్లడించారు. 

వివేకా హత్యకు గురైన విషయం ఆయన బావమరిది ద్వారా అవినాశ్ రెడ్డికి తెలిసిందని… ఈ విషయాన్ని సీఎం జగన్ కు చెప్పేందుకు కృష్ణమోహన్ రెడ్డి, నవీన్ లకు అవినాశ్ రెడ్డి ఫోన్ చేసి ఉంటాడని అభిప్రాయపడ్డారు. చంద్రబాబుకు ఏదైనా విషయం తెలియజేయాలన్నా ముందు ఎవరో ఒకరికి ఫోన్ చేయాల్సిందే కదా అని సజ్జల వ్యాఖ్యానించారు. 

వివేకా మృతి అనుమానాస్పదంగా ఉందని తెలుస్తున్నా… వివేకా అల్లుడు, బావమరిది ఎందుకు పోలీసులకు సమాచారం అందించలేదని ప్రశ్నించారు.

Related posts

డొమినికా జైల్లో ఊసలు లెక్కపెడుతున్న చౌక్సీ…

Drukpadam

ఆపరేషన్​ ట్రోజన్​ షీల్డ్​: ప్రపంచ వ్యాప్తంగా 800 మంది నేరస్థుల అరెస్ట్​!

Drukpadam

కోడలిని చెరపట్టేందుకు ప్రయత్నించిన భర్తను గొంతుకోసి చంపేసిన మహిళ

Ram Narayana

Leave a Comment