Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
రాజకీయ వార్తలు

అసెంబ్లీ లో ఫ్రెండ్లీ పార్టీల మధ్య మాటల యుద్ధం …

వచ్చే ఎన్నికల్లో 50 స్థానాల్లో పోటీ చేస్తాం: కేటీఆర్ వ్యాఖ్యలకు అక్బరుద్దీన్ కౌంటర్

  • అసెంబ్లీలో ఎంఐఎం, బీఆర్ఎస్ మధ్య మాటల యుద్ధం
  • అక్బరుద్దీన్ ఒవైసీ వ్యాఖ్యలు… కేటీఆర్ ప్రతివ్యాఖ్యలు
  • ఉన్నదే ఏడుగురు ఎమ్మెల్యేలంటూ కేటీఆర్ విమర్శలు
  • ఈసారి 15 మంది ఎమ్మెల్యేలతో వస్తామన్న అక్బరుద్దీన్

KTR Vs Akbaruddin: కేటీఆర్ వర్సెస్ అక్బరుద్దీన్.. గవర్నర్ ప్రసంగంపై రచ్చ రచ్చ! |

శనివారం తెలంగాణ అసెంబ్లీలో ఫ్రెండ్లీ పార్టీలమధ్య విచిత్రమైన వాగ్వివాదం చోటుచేసుకున్నది . అధికార బీఆర్ యస్ , ప్రతిపక్షంలో ఉన్న ఎంఐఎం లు స్నేహపూర్వక పార్టీలు …అనేక సందర్భాల్లో రెండు పార్టీలు అనేక విషయాల్లో కలిసి మాట్లాడుకోవడం ,చర్చించుకోవడం ఒక అంగీకారానికి రావడం జరుగుతుంది. కానీ ఎందుకో అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల సందర్భంగా ఎంఐఎం కు స్పీకర్ ఎక్కువ సమయం ఇచ్చారని కేటీఆర్ అసహనం వ్యక్తం చేశారు . దీనిపై ఎంఐఎం శాసనసభ పక్షనేత అక్బరుద్దీన్ ఒవైసి ఫైర్ అయ్యారు . ఈసారి తన పార్టీ చీఫ్ అంగీకరిస్తే కనీసం 50 సీట్లలో పోటీచేస్తామని అన్నారు . 15 సీట్లకు తగ్గకుండా గెలిచి చూపించి అసెంబ్లీకి వస్తామని సవాల్ విసిరారు .దీంతో సభ్యులంతా ఒకరి ముఖాలు ఒకరు చూసుకున్నారు .ఫ్రెండ్లీ పార్టీల మధ్య జరిగిన ఈ సంభాషణను బీజేపీ ,కాంగ్రెస్ పార్టీలు ఆసక్తిగా చూశాయి.

అక్బరుద్దీన్ ఒవైసీ వ్యాఖ్యలకు, మంత్రి కేటీఆర్ ఘాటుగా బదులిచ్చారు. ఎంఐఎం ఎమ్మెల్యేలు ఉన్నదే ఏడుగురని, వారికి అధిక సమయం కేటాయించరని మంత్రి కేటీఆర్ వ్యాఖ్యానించడం తెలిసిందే. దీనిపై అక్బరుద్దీన్ ఒవైసీ కౌంటర్ ఇచ్చారు.

ఏడుగురు ఎమ్మెల్యేలే ఉన్నారని కేటీఆర్ అన్నారని, దీన్ని తాము తీవ్రంగా పరిగణిస్తున్నామని అన్నారు. తమ పార్టీ అధినేత అంగీకరిస్తే వచ్చే ఎన్నికల్లో 50 స్థానాల్లో పోటీ చేస్తామని ప్రకటించారు. దీనిపై తాను పార్టీ చీఫ్ తో మాట్లాడతానని వెల్లడించారు. ఏడుగురు కాదు కనీసం 15 మంది ఎమ్మెల్యేలుగా ఎన్నికయ్యేలా చూస్తామని అక్బరుద్దీన్ ఒవైసీ స్పష్టం చేశారు. ఈసారి మరింతమంది ఎమ్మెల్యేలతో సభలో అడుగుపెడతామని చెప్పారు.

Related posts

టీటీడీపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారు: పవన్, చంద్రబాబులపై సుబ్రహ్మణ్యస్వామి ఆగ్రహం…

Drukpadam

మేం యుద్ధమంటూ చేయాల్సి వస్తే తీవ్ర పరిణామాలు: రష్యా, చైనాలకు అమెరికా అధ్యక్షుడి హెచ్చరిక!

Drukpadam

తెలంగాణ స్టేట్ స్మాల్ స్కేల్ గ్రానైట్ ఇండస్ట్రీ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్ష పదవికి రాయల నాగేశ్వరరావు రాజీనామా..

Drukpadam

Leave a Comment