Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
రాజకీయ వార్తలు

స్టార్టప్ ల అభివృద్ధిలో ఏపీ ఇప్పుడు బీహార్ కంటే దిగువన ఉంది: చంద్రబాబు!

స్టార్టప్ ల అభివృద్ధిలో ఏపీ ఇప్పుడు బీహార్ కంటే దిగువన ఉంది: చంద్రబాబు!

  • 2019 వరకు స్టార్టప్ లకు ఏపీ గమ్యస్థానంగా ఉందన్న చంద్రబాబు
  • జగన్ వల్ల మొత్తం నాశనం అయిందని వెల్లడి
  • జగన్ నిర్లక్ష్యంతో స్టార్టప్ ల అభివృద్ధి కుంటుపడిందని విమర్శలు
  • యువ పారిశ్రామికవేత్తల ఆకాంక్షలను దెబ్బతీశారని వ్యాఖ్యలు

టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు ఏపీ ప్రభుత్వంపై మరోసారి విమర్శనాస్త్రాలు సంధించారు. స్టార్టప్ ల అభివృద్ధిలో ఏపీ పరిస్థితి నానాటికీ తీసికట్టు అన్నట్టుగా తయారైందని అన్నారు. ఈ అంశంలో బీహార్ కంటే ఏపీ దిగువన నిలిచిందని తెలిపారు.

2019 వరకు దేశంలోనే అత్యధిక స్టార్టప్ సంస్థలకు ఏపీ గమ్యస్థానంగా నిలిచిందని, స్టార్టప్ లు మరింత విస్తరించేందుకు వీలుగా విశాఖలో అనువైన వాతావరణాన్ని నెలకొల్పామని, కానీ జగన్ నిర్లక్ష్యం వల్ల స్టార్టప్ సంస్థల వ్యవస్థ నాశనం అయిందని చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. యువ పారిశ్రామికవేత్తల ఆకాంక్షలను జగన్ ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిందని ఆరోపించారు.

గతంలో టీడీపీ హయాంలో విశాఖలో ఏర్పాటు చేసిన వ్యవస్థతో స్టార్టప్ ల ఏర్పాటు దిశగా పురోగతి కనిపించిందని, ఇప్పుడా పరిస్థితి లేదని తెలిపారు. నేటి పోటీ ప్రపంచంలో ఏపీ యువత భవిష్యత్ తలచుకుంటేనే బాధ కలుగుతోందని అన్నారు. కేవలం జగన్ ఉదాసీన వైఖరి వల్లే ఈ పరిస్థితి ఏర్పడిందని వివరించారు.

Related posts

పలు రాష్ట్రాలకు, కేంద్ర పాలిత ప్రాంతాలకు ఇన్చార్జిలను ప్రకటించిన బీజేపీ!

Drukpadam

కర్ణాటకలో కలకలం …ఎమ్మెల్యేను హత్య చేస్తే కోటి…

Drukpadam

బండి సంజయ్ జాగరణ దీక్ష భగ్నం.. కార్యాలయ తలుపులు పగులగొట్టి అరెస్ట్!

Drukpadam

Leave a Comment