Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
రాజకీయ వార్తలు

హరీష్ రావు అంకెల గారడీ …ప్రజలను మోసం చేశారు: బడ్జెట్ పై సీఎల్పీ నేత భట్టి,

హరీష్ రావు అంకెల గారడీ …ప్రజలను మోసం చేశారు: బడ్జెట్ పై సీఎల్పీ నేత భట్టి,
-బడ్జెట్ పేరుగొప్ప ఊరు దిబ్బలా ఉంది ..
-2 కోట్ల బీసీలకు కేవలం ,6 వేల కోట్లా…? ఒక్క బీసీకి మూడురూపాయలు
-బడ్జెట్ లో రుణమాఫీ ఊసేలేదు …
-విద్యత్ కోతలు లేవని సీఎం బహిరంగసభల్లో కోతలు కోస్తున్నారు
-ఇదేనా మీ ఆదర్శం ,ఇదేనా దేశమంతా అమలు చేసేది

2 లక్షల 90 వేలకోట్లతో తెలంగాణ రాష్ట్ర సర్కార్ భారీ బడ్జెట్ ను నేడు శాసనసభలో ఆర్ధికమంత్రి హరీష్ రావు ప్రవేశ పెట్టారు .దీనిపై కాంగ్రెస్ ,బీజేపీలు విమర్శలు గుప్పించాయి. ఇది కేవలం హరీష్ రావు అంకెల గారడీ అని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క ధ్వజమెత్తారు . బడ్జెట్ పేరుగొప్ప ఊరు దిబ్బలా ఉందని ప్రతిపక్షాలు ధ్వజమెత్తాయి. బిసిఏలకు ఎంతో మేలు చేశామని చెపుతున్న ప్రభుత్వం కేటాయింపుల్లో ఒక్క బీసీకి కేవలం 3 రూపాయలు మాత్రమే కేటాయించడాన్ని తప్పుపట్టారు .పాఠశాలల్లో వంట చేసే ఆలయాలకు జీతాలు లేవు …అంగన్వాడీలను ఆదుకునేది లేదు . కనీసం వేతనాలు అమలుగు నోచుకోవడం లేదు . ఉద్యోగులకు జీతాలు సరిగాలేవు …పెన్షన్ దారులకు సకాలంలో పెన్షన్ అందటంలేదు. రైతులకు గిట్టుబాట ధరలేదు .డీజిల్ , పెట్రోల్ ధరల తగ్గింపు లేదు . ధరణి పని చేయడంలేదు . విద్యత్ కోతలు ఉన్నా విద్యత్ కోతలు లేని తెలంగాణ అని బయట రాష్ట్రాలకు వెళ్లి కోతలుకొస్తున్నారని దుయ్యబట్టారు . నిరుద్యోగ భృతి లేదు . ఉద్యోగాల కల్పనా అంతంత మాత్రంగానే ఉంది . మాటలు కోటలు దాటుతున్నాయి.చేతలు మాత్రం గడప దాటటంలేదని మీడియా పాయింట్ వద్ద మాట్లాడిన కాంగ్రెస్ నేతలు భట్టి , జీవన్ రెడ్డి, బీజేపీ నేతలు ఈటెల రాజేందర్ , రఘునందన్ రావు లు హరీష్ రావు బడ్జెట్ పై విమర్శలు గుప్పించారు. సంక్షేమానికి పెద్దపీట వేస్తున్నామని చెపుతున్న ప్రభుత్వం అంకెల గారడితో మసిపూసి మారేడు కాయ చేస్తుందని ప్రభుత్వం విధానాలను తూర్పార బట్టారు .

Related posts

రోశయ్య ను హింసించారు … వీహెచ్ హాట్ కామెంట్స్!

Drukpadam

కమ్యూనిస్టుల త్యాగాలవల్లనే తెలంగాణ విలీనం జరిగింది.:సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని

Drukpadam

తాగండి తాగి! తాగి ఊగండి !! ఇది కేసీఆర్ ప్రభుత్వం తీరు ;సీఎల్పీ నేత భట్టి ధ్వజం!

Drukpadam

Leave a Comment