Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
రాజకీయ వార్తలు

రాష్ట్రానికి కేటీఆర్ సీఎం …దేశానికి ప్రధాని కేసీఆర్ …శాసనసభలో మంత్రి మల్లారెడ్డి …

రాష్ట్రానికి కేటీఆర్ సీఎం …దేశానికి ప్రధాని కేసీఆర్ …శాసనసభలో మంత్రి మల్లారెడ్డి …
-కేసీఆర్, కేటీఆర్‌పై మంత్రి మల్లారెడ్డి పొగడ్తల వర్షం
-రాష్ట్రంలో సాక్షాత్తూ రామరాజ్యం నడుస్తోంది
-బడ్జెట్‌పై చర్చ సందర్భంగా సభలో నవ్వులు పూయించిన మంత్రి మల్లారెడ్డి
-తారకరాముడు ఐటీ రాజ్యం తెచ్చారన్న మంత్రి
-కేటీఆర్ 110 ఏళ్లు బతకాలని కాంక్షించిన మల్లారెడ్డి
-టీఆర్ఎస్‌ను చంద్రుడిగా, బీఆర్ఎస్‌ను సూర్యుడిగా అభివర్ణించిన టీఆర్ఎస్ నేత
-చంద్రుడిని ఆపలేక పోయిన మీరు …సూర్యుడిని ఆపగలరా ….
-తన ప్రసంగంతో శాసనసభలో నవ్వులు పూయించిన మల్లారెడ్డి
-మల్లారెడ్డి ప్రసంగానికి కోరస్ అందుకున్న సభ్యులు …

రాష్ట్రానికి సీఎం కేటీఆర్ ….దేశానికి పీఎం కేసీఆర్ దీన్ని ఎవరు ఆపలేరని రాష్ట్ర కార్మికశాఖ మంత్రి మల్లారెడ్డి శాసనసభలో అన్నారు .బడ్జెట్ పై చర్చ సందర్భంగా మల్లారెడ్డి తనదైన శైలిలో చేసిన ప్రసంగం ఆద్యంతం ఎమ్మెల్యేలను నవ్వులు పూయించింది . ఇప్పుడు నడుస్తుంది రామరాజ్యం …ఐటీ సెక్టార్ లో అమెరికా తర్వాత హైద్రాబాద్ ఉంది. దీనికి కారణం మన తారక రాముడు …ఆయన పరిశ్రమల మంత్రిగా వేల ,లక్షల కోట్లు తెస్తున్నాడు …నిధుల ప్రవాహం ఆగటంలేదు .అందువల్ల రాముడు పాలనా మనకు తెలియదు …అంటూ కేటీఆర్ పై పొగడ్తల వర్షం కురిపించారు .

‘‘రామరాజ్యం గురించి విన్నాం.. రాముడిని ఫొటోల్లో చూశాం. కానీ ఇప్పుడు రాష్ట్రంలో సాక్షాత్తూ రాముడి రాజ్యం నడుస్తోంది. తారకరాముడు ఐటీ రాజ్యం తెచ్చారు’’.. ఈ మాటన్నది మరెవరో కాదు తెలంగాణ మంత్రి మల్లారెడ్డి. అసెంబ్లీలో నిన్న బడ్జెట్‌పై చర్చ సందర్భంగా ఆయనీ వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్, కేటీఆర్‌పై ఆయన పొగడ్తలు కురిపిస్తున్నంత సేపు సభలో సభ్యులు నవ్వులు చిందించారు.

మల్లారెడ్డి మాట్లాడుతూ.. రాష్ట్రంలో యాదాద్రి, సచివాలయం, అంబేద్కర్ విగ్రహం, అమరవీరుల స్మారక కేంద్రం, కమాండ్ కంట్రోల్ సెంటర్, కాళేశ్వరం, మిషన్ భగీరథ రూపంలో ఏడు అద్భుతాలను చూస్తున్నామన్నారు. దేశంలో కేటీఆర్ లాంటి మంత్రి మరెక్కడైనా ఉన్నారా? అని ప్రశ్నించారు. ఇటీవల దావోస్ వెళ్లి రూ. 21 వేల కోట్ల పెట్టుబడులు తెచ్చారని ప్రశంసించారు. కేటీఆర్ 110 సంవత్సరాలు జీవించాలని కోరుకున్నారు.

కేంద్రం అసలు దొంగల్ని వదిలిపెట్టి ఐటీ, సీబీఐ, ఈడీలను తమపైకి ఉసిగొల్పుతోందన్నారు. అదానీకి అన్నీ అప్పగిస్తే పది రోజుల్లో రూ. 10 లక్షల కోట్లు ఆవిరైపోయాయని ఎద్దేవా చేశారు. టీఆర్ఎస్ అంటే చంద్రుడని, బీఆర్ఎస్ అంటే సూర్యుడని అభివర్ణించారు. చంద్రుడినే ఆపలేకపోయిన వారు ఇప్పుడు సూర్యుడిని ఆపగలరా? ఆయన కోపాన్ని తట్టుకోలగలరా? అని మల్లారెడ్డి ప్రశ్నించారు. రామన్న సీఎం, కేసీఆర్ పీఎం అవుతారని జోస్యం చెప్పారు.

Related posts

వచ్చే ఎన్నికల తర్వాత తెలంగాణలో బీజేపీ ఉండదు…రాహుల్ గాంధీ…

Drukpadam

సోము వీర్రాజు తాగుబోతులకు అధ్యక్షుడా ఏంటీ?ఏపీ మంత్రి నారాయ‌ణ స్వామి!

Drukpadam

బందరుకు పోర్టు రాకుండా చంద్రబాబు అడ్డుకున్నాడు..సీఎం జగన్

Drukpadam

Leave a Comment