Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
రాజకీయ వార్తలు

పార్టీ ద్వారా గెలిచి పక్కపార్టీలోకి వెళ్లిన వారికీ మళ్ళీ అవకాశం ఇవ్వొద్దు…రేవంత్ రెడ్డి!

పార్టీ ద్వారా గెలిచి పక్కపార్టీలోకి వెళ్లిన వారికీ మళ్ళీ అవకాశం ఇవ్వొద్దు…రేవంత్ రెడ్డి!
-కాంగ్రెస్ పార్టీలో గెలిచి గులాబీ పార్టీలో చేరిన 12 మందిని ఇంటికి పంపించాలి …
-కేసీఆర్ ఇవ్వకపోతే మన ప్రభుత్వం పోడుభూములకు పట్టాలిస్తుంది
-ఇల్లందు గడ్డ …కాంగ్రెస్ గడ్డ ఇక్కడ గెలిచేది కాంగ్రెస్ పార్టీనే

పార్టీ ద్వారా గెలిచి పక్క పార్టీలోకి వెళ్లిన తిరిగి మళ్ళీ అవకాశం ఇవ్వవద్దని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి పిలుపు నిచ్చారు . హత్ సే హత్ జోడో యాత్రలో భాగంగా ఆయన రెండవరోజు ఇల్లందు పట్టణంలో జరిగిన భారీ జనసమూహాన్ని ఉద్దేశించి ప్రసంగించారు . ఇల్లందు నుంచి పార్టీ నుంచి గెలిచి అధికార పార్టీలో చేరిన హరిప్రియ నాయక్ పై విమర్శలు గుప్పించారు . ప్రతిదీ తమకే కావాలని అంటున్న హరిచర్యలను ప్రజల అసహ్యంచుకుంటున్నారని విమర్శలు గుప్పించారు . స్థానిక ఎమ్మెల్యేపై రేవంత్ విమర్శలు గుప్పిస్తున్న సందర్భంగా ప్రజల నుంచి మంచి స్పందన లభించడం విశేషం …కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచిన 12 మంది అధికార పార్టీల చేరారు .వారిని తిరిగి అసెంబ్లీకి పంపవద్దని ,ఇంటికే పరిమితం చేయాలనీ పిలుపు నిచ్చారు . ఈసారి రాబోయేది కాంగ్రెస్ ప్రభుత్వమే వచ్చిన వెంటనే కేసీఆర్ ఇవ్వకపోతే పోడుభూములకు పట్టాలిస్తామని హామీ ఇచ్చారు .

సింగరేణి కార్మికుల సమస్యలు పరిస్కారం కాలేదు . దళితులకు మూడెకరాల భూమి లేదు …నిరుద్యోగ సమస్య పరిస్కారం కాలేదు …నిరుద్యోగ భృతిలేదు …చెప్పిన మాటలు చేసేది లేదు …చేసిన పనులు చెప్పేది లేదు .. తెలంగాణ ఇచ్చిన సోనియా గాంధీని మోసం చేశారు .నమ్ముకున్న ఉద్యమకారులను నట్టేట ముంచారు అని రేవంత్ రెడ్డి కేసీఆర్ పై తీవ్రస్వరంతో ధ్వజమెత్తారు . రేవంత్ ప్రసంగానికి ప్రజల నుంచి ప్రత్యేకించి యువకుల నుంచి మద్దతు లభించడం విశేషం .. రేవంత్ రెడ్డి వెంట ఈ యాత్రలో ములుగు ఎమ్మెల్యే సీతక్క , భద్రాచలం ఎమ్మెల్యే పొదెం వీరయ్య , మాజీ కేంద్రమంత్రి పోరిక బలరాం నాయక్ , మాజీ ఎంపీ మల్లు రవి , కాంగ్రెస్ ఖమ్మం జిల్లా అధ్యక్షులు పువ్వాళ్ళ దుర్గాప్రసాద్ , వరంగల్ జిల్లా అధ్యక్షులు రాజేందర్ రెడ్డి , జగిత్యాల అధ్యక్షులు జాంగా రాఘవరెడ్డి , జిల్లా కాంగ్రెస్ నాయకులు రామిరెడ్డి గోపాల్ రెడ్డి , యువజన కాంగ్రెస్ నాయకులు రామిరెడ్డి చరణ్ రెడ్డి , స్థానిక నాయకులు పాల్గొన్నారు .

 

Related posts

ఎన్టీఆర్ జిల్లా.. వైసీపీకి రాజకీయంగా లాభిస్తుందా?

Drukpadam

పంజాబ్​ సీఎం ఇంటి ముందు భారీ నిరసన…

Drukpadam

ప్ర‌స్తుతం ఈ స్థాయిలో ఉన్నానంటే అది వైఎస్సార్ వల్లే: కొండా సురేఖ

Drukpadam

Leave a Comment